
రుణాలిప్పిస్తామని నమ్మించి మోసం
హొసపేటె: కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ రుణాలు అందిస్తామని హామీ ఇచ్చి కోట్లాది రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేయడంతో మోసపోయిన స్వయం సహాయక సంఘాల మహిళలు బైలువద్దిగేరి జీపీ సభ్యులు, మాజీ అధ్యక్షులు సహా 19 మంది విజయనగర జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రెండేళ్ల క్రితం హొసపేటె నగరంలో ప్రియాంక మహిళా పరపతి సహకార సొసైటీని ప్రారంభించి మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ఉచిత కుట్టు, కంప్యూటర్ శిక్షణ అందించి మోసగించిన సహకార సంఘానికి చెందిన ప్రియాంక జైన్, తాయమ్మదేవి శక్తి సంఘం అధ్యక్షురాలు కవితా ఈశ్వర్ సింగ్, ఆమె సన్నిహితురాలు లలితమ్మ, సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వారి నుంచి డబ్బును తిరిగి రాబట్టాలని ఆ ఫిర్యాదులో కోరారు. సీపీఎం నాయకులు భాస్కర్‌రెడ్డి, యల్లాలింగ, దళిత హక్కుల కమిటీ నాయకులు మరడి జంబయ్య నాయక, బీ.తాయప్ప నాయక, బీ.రమేష్‌కుమార్, సూర్యనారాయణ, డీవైఎఫ్‌ఐ నాయకులు ఈడిగర మంజునాథ్, వడ్డరహళ్లి స్వామి, తిరుకప్ప తదితరులు హాజరై నిందితులకు ప్రముఖ రాజకీయ నాయకులతో సంబంధాలున్నాయని, ఫిర్యాదుదారులకు తగిన రక్షణ కల్పించాలని పోలీసు శాఖ అధికారులను వారు కోరారు.
జిల్లా ఎస్పీకి బాధితుల ఫిర్యాదు