
నిత్యావసరాల ధరలు తగ్గించండి
రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ సర్కార్ పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలు, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన పేదలు వినియోగించే నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని జేసీటీయూ డిమాండ్ చేసింది. మంగళవారం పాత జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో రాష్ట్ర కార్యదర్శి శరణ బసవ మాట్లాడారు. పంచ గ్యారెంటీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఖజానాను లూటీ చేసిందన్నారు. నేడు విద్యుత్, బస్ చార్జీలు, పాల ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెంచిన ధరలను తగ్గించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని, వక్ఫ్ బిల్లును, లేబర్ కోడ్ నోటిఫికేషన్లను ఉపసంహరించుకోవాలని కోరుతూ గవర్నర్‌కు స్థానికాధికారి ద్వారా వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో శ్రీశైలరెడ్డి, కాశప్ప, పద్మ, వీరేష్, నరసింహ, లక్ష్మణ, గోకారమ్మ, ఇందిర, చంద్రకళ, భీమప్ప, విజయలక్ష్మి, హులిగప్ప, మల్లికార్జునలున్నారు.