రాయచూరు రూరల్: కలబుర్గి విశ్వ విద్యాలయంలో డిగ్రీ పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలను ప్రకటించడంలో జాప్యం చేస్తోందనే ఆరోపణలు అధికంగా వినిపిస్తున్నాయి. విద్యాభ్యాసం ముగించుకొని ఉద్యోగాలు పొంది జీవితంలో స్థిరపడాలనుకునే వారి ఆశలకు విశ్వ విద్యాలయం గండి కొట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో పరీక్ష పేపర్లు చోరీ అయ్యాయనే ఆరోపణలున్న నేపథ్యంలో నేడు ఫలితాలను ప్రకటించడంలో జరుగుతున్న జాప్యంపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కలబుర్గి విశ్వ విద్యాలయం పరీక్ష సుధారణ సమితి విచారణలో సమాధాన పత్రాల మూడు బ్యాచ్‌ల విద్యార్థుల మార్కులు, ఫలితాలను పెండింగ్‌లో ఉంచారు. కలబుర్గి విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ శ్రీరాములు వివరిస్తూ డిగ్రీ పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలను త్వరలో ప్రకటిస్తామన్నారు, నకిలీ మార్కుల జాబితాల కేసు విషయంలో లోకాయుక్త అధికారుల విచారణతో జాప్యమైందన్నారు. ఈ విషయంలో విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యురాలు శ్రీదేవి మాట్లాడుతూ ప్రతి రోజు 200 మంది విద్యార్థులు వర్సిటీ క్యాంపస్‌లో ఉండి ఫలితాలు ప్రకటించాలని విన్నవించుకున్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయం పరీక్ష సుధారణ సమితి ఏర్పాటైన సమయంలో 16 వేల మంది విద్యార్థుల ఫలితాల్లో కేవలం 9,024 మంది విద్యార్థుల ఫలితాలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. నూతన విద్యా పథకం జారీ కావడంతో పరీక్షలు నిర్వహించామన్నారు. ఫెయిలైన వారికి పరీక్షలు నిర్వహించడంలో ఆలస్యమైందన్నారు. పరీక్షలు ముగిసిన 45 రోజుల్లో ఫలితాలు ప్రకటించాల్సి ఉందన్నారు.
9,024 మంది పరీక్షార్థుల ఎదురుచూపులు
అంధకారంలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు
కలబుర్గి విశ్వవిద్యాలయం నిర్వాకం
మూడేళ్లుగా ఫలితాలు పెండింగ్
మూడేళ్లుగా ఫలితాలు పెండింగ్