
కొడుకు కాదు.. కర్కోటకుడు
తుమకూరు: జిల్లాలోని కుణిగల్ పట్టణంలో ఐస్‌క్రీమ్ ఫ్యాక్టరీ యజమాని మృతి కేసులో పెద్ద మలుపు. కుమారుడే హత్య చేసి, కరెంటు షాక్‌తో చనిపోయాడని నాటకమాడినట్లు వెల్లడైంది. వివరాలు.. యజమాని నాగేశ్ (58) మే 11న ఐస్‌క్రీమ్ ఫ్యాక్టరీలో ఉన్నాడు. ఈ సమయంలో కుమారుడు సూర్య (25) వచ్చాడు, డబ్బు ఇవ్వాలని అతడు తండ్రిని ఒత్తిడి చేయగా ఆయన ససేమిరా అన్నాడు. పైగా గొడవ జరిగి కొడుక్కి రెండు డెబ్బలు కూడా వేశాడు. కోపోద్రిక్తుడైన కుమారుడు సూర్య టవల్‌తో తండ్రి గొంతుకు బిగించి హత్య చేశాడు. సూర్యతో పాటు కూడా వచ్చిన మరో యువకుడు సహకరించారు. నాన్నకు కరెంట్‌షాక్ కొట్టి చనిపోయాడని సూర్య శోకాలు పెట్టాడు.
గుట్టు బయటపడిందిలా
మృతుని సోదరి సవితకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఐస్‌క్రీం ఫ్యాక్టరీలో గాలించారు. సీసీ కెమెరాలు ఉండడంతో పని సులువైంది. డీవీఆర్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మృతదేహానికి పోస్టుమార్టం జరిపి అంత్యక్రియలు పూర్తిచేశారు. సీసీ కెమెరా చిత్రాలను చూడగా సూర్య ఘాతుకం బయటపడింది. సవిత కూడా నిందితున్ని గుర్తించారు.
దండించాడని..
ఫ్యాక్టరీలోని డబ్బులను సూర్య తస్కరించేవాడు, పైగా సూర్య సోదరిని సంజయ్ అనే యువకుడు ప్రేమించాడు. ఇతని ప్రేమకు సూర్య సహకరించేవాడు. ఇవి నచ్చని తండ్రి అతన్ని తరచూ దండించేవాడు. ఇవన్నీ మనసులో పెట్టుకుని సంజయ్‌తో కలిసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
సీసీ కెమెరాలో దాడి దృశ్యం
తండ్రినే హతమార్చి, కరెంటు
షాక్ నాటకం
పట్టించిన సీసీ కెమెరాలు