
వైభవంగా కంచు మారెమ్మ జాతర
రాయచూరు రూరల్: నగరంలోని హరిజనవాడలో వెలసిన కంచు మారెమ్మ జాతర వైభవంగా జరిగింది. మంగళవారం రాత్రి ఆలయం వద్ద వందలాది మంది భక్తుల సమక్షంలో ఊయల ఉత్సవం జరిపారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అంగన్‌వాడీ ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
హుబ్లీ: జిల్లాలో సమగ్ర బాల వికాస అభివృద్ధి పథకంలో ఖాళీగా ఉన్న 23 అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులు, అలాగే మొత్తం 97 అంగన్‌వాడీ సహాయకుల ఉద్యోగాల నియామకాల కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించారు. ఆసక్తిగల వారు జూన్ 18లోగా వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులను సమర్పించాలి. వివరాలకు ధార్వాడ గ్రామీణ సీడీపీఓ కార్యాలయం, హుబ్లీ గ్రామీణ సీఈపీఓ కార్యాలయం, కలఘటిగి సీడీపీఓ కార్యాలయం, కుందగోళ, నవలగుంద కార్యాలయంలో సంప్రదించాలని జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్‌ఎస్ సంకనూరు ఓ ప్రకటనలో తెలిపారు.
పాఠశాలల మూసివేత తగదు
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం కన్నడ పాఠశాలలను మూసివేయడం తగదని ఏఐడీఎస్‌ఓ పేర్కొంది. బుధవారం జగ్జీవన్ రామ్ సర్కిల్‌లో చేపట్టిన 50 లక్షల సంతకాల సేకరణ సందర్భంగా అధ్యక్షుడు చెన్నబసవ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 6 వేలకు పైగా ప్రభుత్వ కన్నడ పాఠశాలలను మూసివేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేస్తూ సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టామన్నారు.
పాఠశాలల మార్పునకు వినతి
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం 100 కన్నడ పాఠశాలలను కర్ణాటక పబ్లిక్ స్కూల్(కేపీఎస్)లుగా ప్రకటించిన మేరకు జిల్లాలోని ప్రభుత్వ ఉరూ పాఠశాలలను కేపీఎస్‌లుగా మార్చాలని విధాన పరిషత్ సభ్యుడు వసంత కుమార్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి జమీర్ అహ్మద్‌కు వినతిపత్రం సమర్పించారు. సిరవార, మస్కి, కవితాళ, సింధనూరులో మొరార్జీ దేశాయి గురుకుల పాఠశాల, రాయచూరు, యరమరస్ క్యాంప్, ఆశాపూర్‌లలో మౌలానా ఆజాద్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలను మంజూరు చేయాలని కోరారు.
ధర్మ సందేశాలు పిల్లలకు నేర్పాలి
రాయచూరు రూరల్: హిందూ వైదిక ధర్మ సందేశాలను పిల్లలకు బోధించడం మనందరి కర్తవ్యమని సోమవారపేటె మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్య స్వామీజీ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం రామలింగేశ్వర ఆలయంలో జిల్లా బేడ జంగమ సంఘం ఏర్పాటు చేసిన వేద అధ్యయన శిబిరం ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు సనాతన సంప్రదాయాలు, ఆచార, విచారాలు, భారతీయ సంస్కృతిపై అవగాహన కల్పించి మంత్రోపచారణ, ఇష్టలింగ పూజ, ఆచమ, ఆగమ, ఇతర పురాణాలను శిబిరంలో నేర్పిన విద్య చిరకాలం ఉంటుందని తెలిపారు. శిబిరంలో శాంత మల్ల శివాచార్య, వీర సంగమేశ్వర స్వామి, పంపాపతి శాస్త్రి, శరణయ్య, బసవరాజ్‌లున్నారు.
అలరించిన కరగ ఉత్సవం
కోలారు : తాలూకాలోని సువర్ణహళ్లి గ్రామంలో రంగనాథస్వామి కళ్యాణోత్సవం, గంగాదేవి, మారికాంబా దేవి జాతర మహోత్సవంలో భాగంగా నిర్వహించిన కరగ ఉత్సవం గ్రామ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఈసందర్భంగా హసికరగ, పూల కరగ, అగ్నిగుండ ప్రవేశం, దీపోత్సవం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

వైభవంగా కంచు మారెమ్మ జాతర

వైభవంగా కంచు మారెమ్మ జాతర

వైభవంగా కంచు మారెమ్మ జాతర