
దేశానికి రాజీవ్‌గాంధీ సేవలు అనన్యం
రాయచూరు రూరల్ : దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ దేశానికి చేసిన సేవలు అనన్యమని నగర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్‌గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడారు. నాడు రాజీవ్‌గాంధీ అత్యంత ప్రభావశాలి ప్రధానమంత్రిగా ఉండి దేశంలో విజ్ఞాన, సాంకేతిక రంగంలో సామాజిక దృష్టితో అంతర్జాతీయ స్థాయిలో పోటీ చేసేంత స్థాయికి వివిధ రంగాలను తీర్చిదిద్దారన్నారు. దేశభద్రతను పటిష్ట పరిచే ప్రక్రియలో రాజీవ్‌గాంధీ చేసిన ప్రయత్నం మరువలేనిదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు చట్టప్రకారం రిజర్వేషన్లు, దళితులకు, మైనారిటీ, వెనుకబడిన వర్గాలకు పదవులు లభించేలా చేశారన్నారు. కార్యక్రమంలో అమరేగౌడ, రుద్రప్ప, చేతన్, ఆంజనేయ, శంశాలం, శివమూర్తి, జయంత్‌రావ్‌లున్నారు. కాగా యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మరిస్వామి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఒపెక్ ఆస్పత్రిలో రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు.

దేశానికి రాజీవ్‌గాంధీ సేవలు అనన్యం