శుక్రవారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2025
బెంగళూరు..
బనశంకరి: బెంగళూరు నగరంలో అతివృష్టి వల్ల 200 ప్రదేశాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని నెల రోజులు క్రితం కర్ణాటక రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. కానీ ఎవరూ మేలుకోలేదు, దాని ఫలితమే ఆదివారం నుంచి పలు ప్రాంతాలు మునిగిపోయి లక్షలాది మంది అవస్థలు పడడం. ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలను తీసుకోలేదని ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి.
సిలికాన్ సిటీ ఆదివారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలమైంది. హోసూరు రోడ్డు, హెణ్ణూరు తో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లు, అపార్టుమెంట్లు జలమయం కాగా వరద భయం ఏర్పడింది. లోతట్టు ప్రదేశాల్లో ఇళ్లలోకి నీరు చొరబడింది. సిటీలో బొమ్మనహళ్లి వలయం, రాజరాజేశ్వరి నగర, యలహంక తో పాటు వలయాల వారీగా వరదలు తలెత్తే అవకాశం ఉందని ఆయా ప్రాంతాలను విపత్తు నిర్వహణా శాఖ గుర్తించి హెచ్చరించింది. 8 వలయాల్లో ఏప్రిల్ 15 నుంచి వరదలు హెచ్చరికలు జారీచేసి అప్రమత్తంగా ఉండాలని బీబీఎంపీ, జలమండలి, బెస్కాం, పోలీస్‌శాఖ కు సమాచారం అందించింది. సాధారణం కంటే భారీ వర్షాలు కురుస్తాయని తెలిపినా ఆ స్థాయిలో చర్యలను చేపట్టలేదు.
ఇంకా ఎక్కడెక్కడ?
బెంగళూరు తూర్పు భాగంలో హెచ్‌ఆర్‌బీఆర్ లేఔట్, వీరణ్ణపాళ్య, పశ్చిమ బెంగళూరు రాజాజీనగర పారిశ్రామికవాడ, గాలి ఆంజనేయస్వామి ఆలయం జంక్షన్, నాయండహళ్లి జంక్షన్, బన్నేరుఘట్ట రోడ్డు, జయదేవ ఫ్లై ఓవర్, సిల్క్‌బోర్డు జంక్షన్, మెక్‌గ్రాత్–బ్రిగేడ్ రోడ్డు జంక్షన్, దక్షిణ బెంగళూరులో విల్సన్‌గార్డెన్ పీడబ్ల్యూడీ క్వార్టర్స్, యలహంక వలయంలో ఎల్‌బీఎస్‌నగర, మహదేవపుర వలయంలో సర్జాపురరోడ్డు, వర్తూరు, పణత్తూరు, బెళగెరె, హుడి తీవ్ర వరదలు తలెత్తే ప్రదేశాలు గా గుర్తించారు. ఎడాపెడా చెరువులను కబ్జా చేయడం, రాజకాలువల ఆక్రమణలు, వాననీరు వెళ్లే మార్గాలు లేకపోవడం తదితర కారణాల వల్ల ముంపు సమస్య ఏటేటా పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.
న్యూస్‌రీల్
సిటీలో 200 ప్రదేశాలు యమ డేంజర్
కుంభవృష్టి కురిస్తే ప్రజలకు నరకమే
హెచ్చరికలు ఉన్నా సర్కారు చర్యలు సున్నా
ఎండాకాలం వస్తే నీటి కరువు, వర్షాకాలం వస్తోందంటే భారీ వర్షాలతో ఇళ్లు, వీధులు ముంపు. ఇదీ సిలికాన్ నగరవాసుల కష్టాలు. వాటితోనే సహజీవనం చేస్తున్నారు తప్ప పరిష్కారం కోసం గొంతెత్తడం లేదు. ముంగారు వానలు రాకముందే వరుణుడు పేట్రేగడంతో బెంగళూరు ముంపు ముప్పులో చిక్కుకుంది.
ఏ వలయంలో ఎన్ని ప్రాంతాలు
పాలికెలో 8 వలయ ప్రదేశాలైన బొమ్మనహళ్లి వలయం – 19 ప్రదేశాలు, దాసరహళ్లి వలయ–11, బెంగళూరు తూర్పు వలయ– 29, మహదేవపుర వలయ–30, రాజరాజేశ్వరినగర వలయ –29, దక్షిణ వలయ –34, పశ్చిమ వలయ–38, యలహంక వలయ –10 ప్రదేశాలు ముంపునకు గురవుతున్నాయి.
వీటితో కలిపి రాజధానిలో మొత్తం 200 వరద పీడిత ప్రాంతాలున్నట్లు ఏప్రిల్ 2వ తేదీన ఆదేశాల్లో విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది.
ఈ ప్రదేశాల్లో రియల్‌టైమ్‌లో 12 గంటల ముందుగా వాతావరణ హెచ్చరికలను అందిస్తుంది.
ఇక బెంగళూరులో తీవ్రంగా ముంపునకు గురయ్యే ప్రదేశాలు 58 ఉన్నాయి.
153 ప్రదేశాలు మధ్యస్థాయిలో వరదలకు గురవుతాయి.
రాజరాజేశ్వరినగర వలయంలో 39 ప్రదేశాలు, పశ్చిమ బెంగళూరులో 38 స్థలాలకు ఎక్కువ ముప్పు నెలకొంది.
బొమ్మనహళ్లి వలయంలో 12 ప్రాంతాలు తీవ్ర ముంపునకు గురైయ్యే ప్రదేశాలు ఉండగా మహదేవపుర వలయంలో 11 ప్రాంతాలున్నాయి.
ముంపు ముంగిట
ముంపు ముంగిట
ముంపు ముంగిట
ముంపు ముంగిట
ముంపు ముంగిట
ముంపు ముంగిట
ముంపు ముంగిట