
కొనసాగిన వర్షాలు.. నీటమునిగిన పంటలు
హొసపేటె: కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. చారిత్రాత్మక కమలాపురలో చెరువు నిండిపోయి బయటకు నీరు ప్రవహించింది. హొసపేటె తాలూకాలో కమలాపుర, హంపీ, హరపనహళ్లి, కూడ్లిగి తాలూకాల్లో కొన్ని ప్రాంతాలు వర్షం నీటితో బురదమయంగా మారాయి. అదే విధంగా హొసపేటె– బయలువద్దిగేరి మధ్య ఉన్న వాగులో వేగంగా ప్రవహిస్తున్న వర్షపు నీటిలో ఒక ఆవు కొట్టుకుపోయింది. హరపనహళ్లి తాలూకాలోని హూవినహడగలి, కొట్టూరు తాలూకాల్లో పంటలు దెబ్బతిన్నాయి. హొసపేటె తాలూకాలోని బైలువద్దిగేరి రైల్వే స్టేషన్ సమీపంలో జెస్కాం ఉద్యోగి పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా కాలువ నీటిలో చిక్కుకున్నారు. ఆ సమయంలో స్థానిక యువకులు ఉద్యోగి ప్రాణాలను కాపాడారు.

కొనసాగిన వర్షాలు.. నీటమునిగిన పంటలు