
ఆకాంక్షకు కన్నీటి వీడ్కోలు
యశవంతపుర: పంజాబ్‌లో ఓ విద్యాసంస్థలో భవనంపై నుంచి పడి మరణించిన ధర్మస్థళకు చెందిన ఏరోనాటిక్స్ ఇంజినీర్ ఆకాంక్ష (24) మృతదేహాన్ని ఐదు రోజుల తరువాత గురువారం ఆమె పుట్టిన ఊరు దక్షిణకన్నడ జిల్లా బెళ్తంగడి తాలూకా బోళియార్‌కు చేరుకొంది. బెంగళూరు విమానాశ్రయం నుంచి అంబులెన్స్‌లో తీసుకెళ్లారు. కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఆమె ఇంటికి సమీపంలో ఖననం చేశారు. ఆమె చదివే కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్, కేరళవాసి మ్యాథ్యూ ప్రేమ పేరుతో మోసం చేయడంతో ఆమె భవనం మీద నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది.
అప్పులుచేసి చదివిస్తే..
ఆకాంక్ష చిన్ననాటి నుంచి చదువులో మేటి, తల్లిదండ్రులు బ్యాంక్‌లో రూ. 15 లక్షలు అప్పు తీసుకుని, భూమిని అమ్మి ఆకాంక్షను చదివించారు. అప్పుడే మమ్మల్ని విడిచిపోయావా తల్లీ అని కన్నవారు రోదించడం గ్రామస్తులను కలిచి వేసింది. ఎమ్మెల్యే హరీశ్ పూంజా పరామర్శించారు.