
నూతన పోలీస్ బాస్ సలీం
అడవినోదం
స్మార్ట్ మీటర్లపై
గవర్నర్‌కు ఫిర్యాదు
బనశంకరి: ఇళ్లకు విద్యుత్ స్మార్ట్‌మీటర్ల కొనుగోలులో దోపిడీతో పాటు వినియోగదారులకు అన్యాయం జరుగుతుందని బీజేపీ నేతలు ఆరోపించారు. బుధవారం బీజేపీ నేతలు ఆర్.అశోక్, సీఎన్.అశ్వత్‌నారాయణ నేతృత్వంలో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌ను కలిసి స్మార్ట్‌మీటర్ల టెండర్లలో కుంభకోణం జరిగిందని వినతిపత్రం ఇచ్చారు. ఆపై విలేకరులతో మాట్లాడారు. స్మార్ట్‌మీటర్ల వల్ల కస్టమర్లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, వేలాది కోట్లు లూటీ అయ్యాయి, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం , ఇంధనశాఖ అధికారులు భాగస్వాములయ్యారని ఆరోపించారు. మీటర్ల ధర చాలా అధికంగా ఉందని, అర్హతలేని కాంటాక్టర్లకు అప్పగించారని చెప్పారు. ఈ కుంభకోణం గురించి గవర్నర్‌కు వివరించామన్నారు.
శివాజీనగర: రాష్ట్ర నూతన డీజీపీగా సీఐడీ చీఫ్ డాక్టర్ ఎం.ఏ.సలీం నియమితులయ్యారు. డీజీపీ అలోక్‌మోహన్ బుధవారం ఉదయం రిటైరయ్యారు. పోలీస్ కవాతు మైదానంలో అట్టహాసంగా వీడ్కోలు వేడుక జరిగింది. ప్రభుత్వం తాత్కాలిక డీజీపీగా సలీంకు పగ్గాలు అప్పగించింది. కేంద్ర యూపీఎస్‌సీ ఆమోదం తరువాత పూర్తిస్థాయి డీజీపీని నియమిస్తారు. సీనియారిటీ ఆధారంగా ఐపీఎస్‌లు ప్రశాంత్‌కుమార్ ఠాకూర్, సలీం, సైబర్ విభాగం చీఫ్ ప్రణవ్ మొహంతి తదితర ఏడుమంది ఉన్నారు. సీనియారిటీలో ఠాకూర్‌ది అగ్రస్థానం. అయితే సిద్దరామయ్య సర్కారు సలీంకు కట్టబెట్టింది.
బెంగళూరువాసే
1966 జూన్ 25న బెంగళూరులోని చిక్కబాణవారలో జన్మించిన సలీం ఎంబీఏ తరువాత పలు పీజీ కోర్సులు చేశారు. సివిల్స్‌లో ఉత్తీర్ణులై 1993లో కర్ణాటక కేడర్ ఐపీఎస్‌గా వచ్చారు. గుల్బర్గా, కొడగు తదితర జిల్లాల్లో పనిచేశారు. ఆయన బెంగళూరువాసి, మైనారిటీ కావడంతో కలిసివచ్చిందని సమాచారం.
దేశంలో ఉత్తమ పోలీసులు
దేశంలోనే కర్ణాటక పోలీస్ బెస్ట్ అని రిటైరైన డీజీపీ అలోక్ మోహన్ ప్రశంసించారు. కోరమంగల కేఎస్‌ఆర్‌పీ పరేడ్ మైదానంలో ఘనంగా వీడ్కోలు వేడుక జరిగింది. పోలీస్ శాఖలో 38 సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలంగా సేవలందించాను. కర్ణాటక పోలీస్ బలగాలు దేశంలో బెస్ట్ అని చెప్పేందుకు గర్వంగా ఉందని కొనియాడారు.
తాత్కాలిక డీజీపీగా నియామకం

నూతన పోలీస్ బాస్ సలీం

నూతన పోలీస్ బాస్ సలీం