ఎడతెగని వానలు.. పొంగిన వాగులు
హొసపేటె: విజయనగర జిల్లాలో అకాల వర్షాలు గత మూడు రోజుల నుంచి యథావిధిగా కొనసాగుతున్నాయి. బుధవారం కురిసిన వర్ష ప్రభావానికి రోడ్లతో పాటు చెక్ డ్యాంల్లో వర్షపు నీరు నిండి వాగులను తలపిస్తున్నాయి. ఏకధాటిగా భారీ వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా మరికొన్ని చోట్ల రోడ్లపై నీరు పొంగి ప్రవహించింది. జిల్లాలోని హొసపేటె, కూడ్లిగి, హగరిబొమ్మనహళ్లి, హడగలి, హరపనహళ్లి, కొట్టూరు తాలూకాల్లో కూడా వర్ష ప్రభావం కొనసాగింది. గంటల తరబడి వర్ష ప్రభావం తగ్గని పరిస్థితి నెలకొనడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
ఎడతెగని వానలు.. పొంగిన వాగులు
ఎడతెగని వానలు.. పొంగిన వాగులు


