మన బంగారం మంచిదే
బంగారు ఆభరణాలు, వెండి సామగ్రి
సొత్తును వారసు దారులకు అందిస్తున్న పోలీసులు
కోలారు: కోలారు జిల్లాలో గత కొద్ది నెలలుగా జరిగిన దొంగతనాలు, దోపిడీల కేసులలో దొంగలు ఎత్తుకెళ్లిన సొత్తు మళ్లీ యజమానులకు చేరడంతో ఆనందభరితులయ్యారు. జిల్లా పరిధిలో జరిగిన మొత్తం 533 కేసులలో దొంగలను అరెస్టు చేసి బంగారు, వెండి సొత్తును రికవరీ చేశారు. వీటి విలువ సుమారు 2.57 కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇందులో బంగారం 1,813 గ్రాములు, వెండి 3,143 గ్రాములు, నగదు 7.62 లక్షలు, శ్రీగంధం చెక్కలు 1,460 కేజీలు, వాహనాలు 25, మొబైల్ ఫోన్లు 461 ఉన్నాయి. సోమవారం నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో పోలీసు ఉన్నతాధికారులు సొంతదారులకు అందజేశారు. అలాగే జిల్లాలోని వివిధ ప్రాంతాలలో 30 కేసుల్లో గంజాయి, ఎండిఎంఎ తదితర మాదక ద్రవ్యాలను సీజ్‌చేసినట్లు తెలిపారు.
చోరీ సొత్తు మళ్లీ యజమానుల సొంతం
కోలారు పోలీసుల కార్యాచరణ
మన బంగారం మంచిదే
మన బంగారం మంచిదే


