త్రినేత్రాయ నమః
చింతామణి: పట్టణంలోని పురాతన నాగనాథేశ్వరస్వామి ఆలయంలో స్వామికి సోమవారం సందర్భంగా ప్రత్యేక అలంకరణ, పూజలు జరిపారు. ఉదయం అర్చకులు శివలింగాన్ని అభిషేకించి, పూలు పండ్లతో అలంకరించి పూజలు జరిపారు. పెద్దసంఖ్యలో భక్తులు త్రినేత్రున్ని దర్శనం చేసుకున్నారు.
బెంగళూరులో ఆగని డ్రగ్స్ దందా
● మరో రూ.2.5 కోట్ల మత్తు పదార్థాల సీజ్
● నైజీరియన్, డెలివరీ బాయ్ అరెస్టు
బనశంకరి: సిలికాన్ రాజధానిలో మత్తు పదార్థాలు గుట్టలు గుట్టలుగా బయటపడుతున్నాయి. పోలీసులు ఓ విదేశీ పౌరుడు, డెలివరీ బాయ్‌ని సోమవారం అరెస్ట్‌చేశారు. వీరి నుంచి రూ.2.5 కోట్ల విలువచేసే డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ తెలిపారు. కేసు వివరాలను ఆయన వెల్లడించారు. నైజీరియాకు చెందిన ఒకే క్రిస్టొఫర్, తమిళనాడువాసి నవీన్‌రాజ్ అనే ఇద్దరు డ్రగ్స్‌పెడ్లర్లు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి రూ.2 లక్షల నగదుతో పాటు రూ.2 కోట్ల 50 లక్షల విలువచేసే 1 కిలోకు పైగా ఎండీఎంఏ క్రిస్టల్, 60 ఎక్స్‌టసీ పిల్స్, 2 మొబైల్స్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. సూలదేవనహళ్లి పోలీసులు వీరిని పట్టుకున్నారు. నైజీరియన్ నిందితుడు గత ఏడాది బిజినెస్ వీసా తో భారత్ కు చేరుకుని ఢిల్లీ, ముంబైలో నివాసం ఉండే విదేశీయుల నుంచి చవగ్గా ఎండీఎంఏను కొనుగోలు చేసి వ్యాపారం సాగించేవాడు. హెచ్‌ఎస్‌ఆర్‌లేఔట్ బండేపాళ్యలో తమిళనాడు కు చెందిన నవీన్‌రాజ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ డ్రగ్స్ వ్యాపారం సాగిస్తున్నాడు. ఇతని వద్ద నుంచి రూ.25 లక్షల విలువచేసే 100 ఎల్‌ఎస్‌డీ స్ట్రిప్స్, 5 గ్రాములు కొకై న్, మొబైల్ ను స్వాదీనం చేసుకున్నారు.
దావణగెరెలో..
దొడ్డబళ్లాపురం: ఇటీవల దావణగెరె పట్టణంలో 290 గ్రాముల డ్రగ్స్ పట్టుబడ్డ కేసులో అక్కడి విద్యానగర పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసారు. దీంతో చిక్కినవారి సంఖ్య 8కి చేరింది. కాంగ్రెస్ నేత వేదమూర్తి (53)తో పాటు నలుగురు రాజస్థాన్‌వాసులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఎండీఎంఏ, సింథటిక్ డ్రగ్స్‌ను సీజ్ చేశారు. వీరు డ్రగ్స్ సేవించడంతో పాటు విక్రయించేవారని పోలీసులు తెలిపారు.
త్రినేత్రాయ నమః


