వరిని కొనుగోలు చేయరా?
మండ్య: జిల్లావ్యాప్తంగా వరి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం బీజేపీ రైతు మోర్చా కార్యకర్తలు నిరసన తెలిపారు. ప్రభుత్వం దళారులతో కుమ్మకై ్క వారి జేబులు నింపుతోందని, వరి కొనుగోలు కేంద్రాలను తెరవకుండా రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. మండ్య జిల్లాలో రైతులు అత్యధికంగా వరి పండించారు, కోతలు కూడా సాగుతున్నాయని తెలిపారు. కేంద్రం రూ. 2386 మద్దతు ధర ప్రకటించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను తెరవడం లేదన్నారు. రైతులు వరిని నిల్వ చేసుకోలేక, అయినకాడికి.. అంటే క్వింటా రూ. 1800 – 2000 కంటే తక్కువకు దళారులకు అమ్ముతున్నారని తెలిపారు. వ్యవసాయ మంత్రి మండ్య జిల్లా వారైనా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.
వచ్చే బడ్జెట్ సిద్దుదే:
మంత్రి సతీశ్
రాయచూరు రూరల్: రాష్ట్ర బడ్జెట్‌ను 2026 మార్చిలో సీఎం సిద్దరామయ్య ప్రవేశపెడతారని ప్రజా పనుల శాఖ మంత్రి సతీశ్ జార్కిహొళి చెప్పారు. సోమవారం యాదగిరిలో విలేకరులతో మాట్లాడారు. సంక్రాంతి పండుగ తరువాత అధికార మార్పిడి ఉంటుందా, లేదా అనే చర్చ అనవసరమన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటారన్నారు. ముఖ్యమంత్రి పదవి ఖాళీగా లేదన్నారు. రెండు మూడు నెలల్లో జిల్లా పంచాయతీ, తాలూకా పంచాయతీ ఎన్నికలు వస్తాయని చెప్పారు. రాబోయే బడ్జెట్‌ను సిద్దరామయ్యే సమర్పిస్తారని అన్నారు.
లారీ సడన్ బ్రేక్.. ఇద్దరు యువకులు మృత్యువాత
దొడ్డబళ్లాపురం: సిమెంటు ట్యాంకర్ లారీని వెనుక నుంచి బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోయారు. దొడ్డ తాలూకా నాయకరండనహళ్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణలోని పరిగి ప్రాంతానికి చెందిన పవన్‌కుమార్ (22), అశోక్ (24) సోమవారం ఉదయం బైక్‌పై ఏపీ నుంచి బెంగళూరుకు వెళుతున్నారు. హిందూపురం– బెంగళూరు మార్గంలోని నాయకరండహళ్లి వద్ద ముందు వెళ్తున్న సిమెంటు లారీ సడన్ బ్రేక్ వేయడంతో వెనుకనే వస్తున్న యువకులు బైక్‌ను అదుపు చేయలేక లారీని ఢీకొన్నారు. ఇద్దరూ తీవ్ర గాయాలతో చనిపోయారు. సిమెంటు లారీ డ్రైవర్ వాహనంతో పాటు పరారయ్యాడు. దొడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
బస్సు ఢీకొని ఇద్దరు..
యశవంతపుర: కేఎస్ ఆర్టీసీ బస్సు బైకును ఢీకొనగా ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన హాసన్ జిల్లా చన్నరాయపట్టణ వద్ద జరిగింది. దడదరహళ్లివాసులు సునీల్ (20), శృంగార్ (18) మృతులు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో నడపడమే ఘోరానికి కారణమని స్థానికులు ఆరోపించారు. ముందు వెళుతున్న బైకును బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టిందని తెలిపారు. చన్నరాయపట్టణ పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు చేశారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పనులు, పథకాలపై
సీఎం సమీక్ష
శివాజీనగర: మౌలిక సౌకర్యాల పనుల నాణ్యతలో ఎలాంటి రాజీపడరాదు. జిల్లా ఇన్‌చార్జి మంత్రులు అన్ని పనుల ప్రగతి పరిశీలన చేయాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. కృష్ణా నివాసంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకం, రైల్వే పథకాల భూ స్వాధీనం గురించి మంత్రులు, అధికారులతో చర్చించారు. ప్రతి నియోజకవర్గానికి రూ. రూ.25 కోట్ల విడుదలకు అనుమతించినట్లు తెలిపారు. నిర్దేశించిన పనులను సకాలంలో పూర్తిచేసి బిల్లులు చేసుకోవాలన్నారు. పనుల నాణ్యతను జిల్లా ఇన్‌చార్జి మంత్రులు అన్ని పనులను పరిశీలించాలన్నారు. రైల్వే పనులకు పెండింగ్‌లో ఉన్న భూస్వాధీన ప్రక్రియలను ప్రాధాన్యత మేరకు పూర్తిచేయాలి. కుడచి–బాగలకోట, తుమకూరు–దావణగెరె, బేలూరు–హాసన్, శివమొగ్గ–రాణిబెన్నూరు, ధారవాడ–బెళగావి రైల్వే మార్గాల నిర్మాణ పనులు శీఘ్రగతిన జరగాలన్నారు.
పవన్ కుమార్, అశోక్ (అశోక్)
వరిని కొనుగోలు చేయరా?
వరిని కొనుగోలు చేయరా?


