
ఈడీ దాడులు
గురువారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2025
హోం మంత్రి విద్యాసంస్థలపై
తుమకూరులోని సిద్దార్థ వైద్య విద్యాలయం
తుమకూరు: రాష్ట్ర ప్రభుత్వంలో సీనియర్ మంత్రుల్లో ఒకరైన హోం మంత్రి జీ.పరమేశ్వర్‌కు కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆకస్మికంగా షాక్ ఇచ్చింది. ఆయనకు చెందిన సిద్దార్థ గ్రూప్ విద్యా సంస్థల్లో బుధవారం ఉదయం నుంచి దాడులు ప్రారంభించింది. సిద్దార్థ గ్రూప్ విద్యా సంస్థల మూడు కార్యాలయాలలో 30 మందికి పైగా ఈడీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. బెంగళూరు నెలమంగల సమీపంలోని టీ.బేగూరు వద్ద ఉన్న సిద్దార్థ వైద్య కళశాల, తుమకూరులోని మరళూరులో ఉన్న సిద్దార్థ ఇంజినీరింగ్ కాలేజీ, హెగ్గెరె సమీపంలోని సిద్దార్థ మెడికల్ కాలేజీలలో దాఖలాలు, కంప్యూటర్లను పరిశీలిస్తున్నారు.
కాలేజీ వద్ద నియంత్రణ
మూడు కార్లలో 10 మందికి పైగా ఈడీ అధికారులు తుమకూరులోని మరళూరు వద్ద ఉన్న సిద్దార్థ ఇంజినీరింగ్ కాలేజీపై దాడి చేశారు. కాలేజీ లోపలకు మీడియా వారితో సహా ఎవరూ ప్రవేశించకుండా ఆంక్షలు విధించారు. అలాగే టీ.బేగూరు, లగ్గెరెలోని విద్యాలయాలకు చేరుకున్నారు. అక్కడి సిబ్బందిని బయటకు వెళ్లకుండా, కాల్స్ చేయకుండా నియంత్రించారు.
వైద్య సీట్లపై నిఘా
ఈడీ అధికారులు మెడికల్ సీట్ల ఫీజులు, దాఖలాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈడీ వెంట భద్రతగా కేంద్ర బలగాలు వచ్చాయి, అలాగే కాలేజీల వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. గతంలో 2019లో మెడికల్ సీట్ల అక్రమాలు జరిగాయని సిద్దార్థ విద్యా సంస్థలపై ఐటీ దాడులు చేశారు. పరమేశ్వర్ పీఏను ఐటీ అధికారులు ప్రశ్నించారు, దీంతో ఆ పీఏ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ దాడుల సమాచారాన్ని ఐటీవారు ఈడీకి ఇచ్చారని, వాటి కొనసాగింపే ఈ తనిఖీలని సమాచారం.
తుమకూరుకు మంత్రి రాక
ఈడీ దాడుల గురించి తెలియగానే హోం మంత్రి జీ.పరమేశ్వర్ భార్య కన్నికతో కలిసి బెంగళూరు నుంచి తుమకూరు సమీపంలోని టీ.బేగూరు, లగ్గెరెల్లోని మెడికల్ కాలేజీలకు వెళ్లారు. సోదాలు ఎందుకని ఈడీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బెంగళూరులో అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.
తుమకూరు, నెలమంగల వద్ద వైద్య,
ఇంజినీరింగ్ కాలేజీల్లో తనిఖీలు
హుటాహుటిన తుమకూరుకు పరమేశ్వర్
రన్య రావుతో లింకులు?
కొంతకాలంగా బంగారం స్మగ్లింగ్‌తో పేరుపొందిన రన్య రావు కేసుకు, ఈ దాడులతో సంబంధముందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆమెతో ఆర్థిక లావాదేవీలు జరిగాయని, అది గుర్తించి ఈడీ దాడులు చేసిందని సమాచారం. రన్యకు మంగళవారమే బెయిలు రావడం తెలిసిందే. మరుసటి రోజే ఈడీ కదిలింది. దాడుల గురించి ఇంకా ఈడీ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

ఈడీ దాడులు

ఈడీ దాడులు