
సోషల్ మీడియాలో పోస్టులపై తీవ్ర నిఘా
హుబ్లీ: సోషల్ మీడియా ద్వారా సామాజిక ఆరోగ్యానికి చేటు, అలాగే సమాజంలోని ప్రజల్లో భయభ్రాంతులు సృష్టిస్తూ హెచ్చరిక బెదిరింపులు చేస్తూ సందేశాలు పోస్టు చేస్తున్న ఆరోపణలపై రౌడీషీటర్లతో పాటు వారి అనుచరులపై జంట నగరాల పోలీస్ కమిషనరేట్ పోలీసులు 28 కేసులను నమోదు చేసుకున్నారు. రౌడీషీటర్లు, వారి అనుచరులు ఫేస్‌బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్ చానల్‌లలో సమాజానికి తప్పుడు సందేశాలను ఇస్తూ సంఘం భయభ్రాంత వాతావరణం కలిగేలా అభ్యంతకర విషయాలను పోస్టు చేస్తుండటంపై కమిషనరేట్ సోషల్ పర్యవేక్షణ యూనిట్ సిబ్బంది పరిశీలించగా వెల్లడి అయింది. దీంతో సదరు బాధ్యులపై వివిధ స్టేషన్‌లలో కేసులు నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ ఎన్.శశికుమార్ మీడియాకు వివరించారు. తమను తాము గొప్పగా చెప్పుకుంటూ రౌడీషీటర్లు జన్మదినాన్ని రోడ్డు మధ్యలో ఆచరించి వాటి వీడియో ఫొటోలను అప్‌లోడ్ చేసేవారు.
యువతపై దుష్ప్రభావ ప్రమాదం
దీంతో యువత, విద్యార్థులు ఉద్వేగానికి, ఉద్రేకానికి గురై చట్ట వ్యతిరేక పనులకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు. రౌడీల గుంపుల మధ్య కక్షలు తదితర సందేశాలను అప్‌లోడ్ చేసేవారు పాఠశాల, కళాశాలల పరిధిలో రౌడీషీటర్ల బెడద, వారి ఫోటోలు, బ్యానర్లు, కనిపించేవి. దీంతో విద్యార్థుల మనసుపై దుష్పరిణామాలు కలిగే అవకాశం ఉందన్నారు. విద్యా సంస్థల తర్వాత ఆడ పిల్లలను వేధించడం, హింసించడం చేసే వారు కులమతాల పేరున ఆధిపత్యం చలాయించడం ద్వారా సామాజిక ఆరోగ్యానికి చేటు కలిగించే వారు ఇలా వివిధ రకాలుగా వీరిపై చర్యలు తీసుకున్నారు. ఇక 75 మంది రౌడీషీటర్లు, 700 మందికి పైగా వారి అనుచరులపై తీవ్ర నిఘా పెట్టామని కమిషనర్ వివరించారు. వీరిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామన్నారు. డీసీపీ రవీష్, ఏసీపీలు ఉమేష్ చిక్కమఠ, శివరాజ కటదావి, విజయ్‌కుమార్ తళవార తదితరులు పాల్గొన్నారు.
బాధ్యులైన రౌడీషీటర్లపై కేసుల నమోదు
జంట నగరాల పోలీస్ కమిషనర్ శశికుమార్