
కల్యాణ కర్ణాటక.. ఉత్తీర్ణతలో వెనుక
రాయచూరు రూరల్: విద్యా రంగంలో వెనుక బడిన కల్యాణ కర్ణాటక(క.క)లోని బీదర్, కలబుర్గి, యాదగిరి, రాయచూరు, కొప్పళ, బళ్లారి, విజయనగర జిల్లాలు ఉత్తమ ఫలితాలు సాధించాలనే తపన తపనగానే మిగిలింది. బీదర్ జిల్లాలో హైస్కూళ్లలో 330, ప్రాథమిక పాఠశాలల్లో 497, కలబుర్గి జిల్లాలోని హైస్కూళ్లలో 450, ప్రాథమిక పాఠశాలల్లో 1640, యాదగిరి జిల్లాలో హైస్కూళ్లలో 661, ప్రాథమిక పాఠశాలల్లో 2363, రాయచూరు జిల్లాలో హైస్కూళ్లలో 826, ప్రాథమిక పాఠశాలల్లో 3304, కొప్పళ జిల్లాలో హైస్కూళ్లలో 489, ప్రాథమిక పాఠశాలల్లో 1852, బళ్లారి జిల్లాలో హైస్కూళ్లలో 396, ప్రాథమిక పాఠశాలల్లో 1250, విజయనగర జిల్లాలో హైస్కూళ్లలో 343, ప్రాథమిక పాఠశాలల్లో 760 ఉపాధ్యాయుల పోస్టులు, 2645 పీఈటీ, డ్రాయింగ్ ఉపాధ్యాయుల పోస్టులు, 398 విషయ పరిశీలకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఏడాదికే ఉపాధ్యాయుల బదిలీలు
ఈ ప్రాంతంలో ఉపాధ్యాయుల పోస్టులను పొందిన ఏడాదికే మైసూరు, తుమకూరు, విజయపుర, బాగల్‌కోటె, గదగ్, హాసన్, హావేరి, మండ్య, రామనగర, శివమొగ్గ, దావణగెరె జిల్లాలకు తిరిగి బదిలీలపై వెళ్లిన వారి స్థానంలో ఉపాధ్యాయులను నియమించడంలో ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం వల్ల నేడు టెన్త్ ఫలితాల్లో తక్కువ శాతం ఉత్తీర్ణత నమోదైంది. 48 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు మంత్రులు ఉన్నా విద్యారంగంపై శ్రద్ధ చూపడం లేదు. నూతనంగా 14 బీఈఓ పోస్టులతోపాటు కార్యాలయాలను ప్రారంభించడానికి కళ్యాణ కర్ణాటక అభివృద్ధి మండలి కార్యదర్శి సుందరేష్ బాబు, విద్యా శాఖ కమిషనర్ ఆకాష్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. కలబుర్గి జిల్లాలో యడ్రామి, కాళగ, కమలాపుర, యాదగిరి జిల్లాలో గురుమిఠకల్, రాయచూరు జిల్లాలో అరకెర, మస్కి, సిరవార, కొప్పళ జిల్లాలో కారటగి, కుకనూరు, బీదర్ జిల్లాలో చిటగుప్ప, కమలానగర, బళ్లారి జిల్లాలో కురుగోడు, విజయనగర జిల్లా కొట్టూరులో బీఈఓ కార్యాలయాలను ప్రారంభించడానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి లేఖలు రాశారు.
టెన్త్ ఫలితాల్లో తక్కువ శాతం
ఉత్తీర్ణత నమోదు
ఏడు జిల్లాల్లో 17443 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ
కొత్తగా 14 బీఈఓ ఉద్యోగాల సృష్టికి ప్రతిపాదనలు

కల్యాణ కర్ణాటక.. ఉత్తీర్ణతలో వెనుక

కల్యాణ కర్ణాటక.. ఉత్తీర్ణతలో వెనుక