కోర్టుకు దర్శన్, పవిత్ర
యశవంతపుర: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితులు నటి పవిత్రగౌడ, నటుడు దర్శన్ మంగళవారం బెంగళూరులో నగర 57వ సిసిహెచ్ కోర్టులో విచారణకు హాజరయ్యారు. కేసును విచారించిన జడ్జి జూలై 10 కి వాయిదా వేశారు. కాగా, పవిత్రగౌడ 15 రోజులు వేరే రాష్ట్రాలకు వెళ్లడానికి జడ్జి అనుమతించారు.
నంబర్ అడిగిన పవిత్ర
విచారణ ముగించుకుని లిఫ్ట్‌లో వెళుతుండగా, దర్శన్ ఫోన్ నంబర్ కావాలని పవిత్రగౌడ పట్టుబట్టింది. చేయి పట్టుకొని మొబైల్ నంబర్ అడిగి డయల్ చేయించుకున్నట్లు తెలిసింది. హత్య కేసులో అరెస్ట్, విడుదలైన తరువాత ఇద్దరి మధ్య దూరం పెరిగింది. మాట్లాడుకోవడం లేదని సమాచారం.
మరో చార్జీషీట్ దాఖలు
హత్య కేసులో ఫోరెన్సిక్ సాక్ష్యాధారాలను అదనంగా చేర్చి కామాక్షిపాళ్య పోలీసులు మంగళవారం మరో చార్జిషీటును కోర్టులో సమర్పించారు.


