
చోరీ సొత్తు స్వాధీనం.. నిందితుడి అరెస్ట్
రాయచూరు రూరల్: చోరీ చేసిన వస్తువులు స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ పుట్టమాదయ్య తెలిపారు. శుక్రవారం రూరల్ పోలీస్ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. గత నెల 17న కల్మలలోని యంకణ్ణ నివాసంలో జేగర్‌కల్‌కు చెందిన ఈరేష్(21)ను అరెస్ట్ చేశామన్నారు. ఎల్‌బీఎస్ నగర్‌లో నివాసమున్న ఈరేష్‌తో పాటు మహేష్ నాయక్, మహబూబ్‌లను విచారించగా, వారు చేసిన దొంగతనాల వివరాలను వెల్లడించారన్నారు. 76 గ్రాముల బంగారం, 382 గ్రాముల వెండి, కెమెరా, గడియారాలను తొలగించారని, కేసు దర్యాప్తులో పూర్తి వివరాలు సేకరించి, వారి వద్ద నుంచి రూ.7,89,272 విలువ చేసే సామగ్రిని సొంతదారులకు అప్పగిస్తామన్నారు. అదనపు ఎస్పీ హరీష్, డీఎస్పీ శాంతవీర, సీఐ సాబయ్య, ఎస్‌ఐ ప్రకాష్ రెడ్డి డంబళలున్నారు.