గాలివాన బీభత్సం.. వరి పైరుకు నష్టం
బళ్లారి రూరల్ : ఎండనక, వాననక, రాత్రనక, పగలనక, ఆరుగాలం రైతులు కష్టించి పండించిన పంటలు చేతికొచ్చే సమయానికి గాలివానకు నేలకొరిగి దిగుబడి తగ్గితే ఆ రైతు ఆవేదన ఎలా ఉంటుందో చెప్పనక్కరలేదు. దావణగెరె పరిసర ప్రాంత రైతన్నలకు ఇలాంటి ఆవేదనే మిగిలింది. జిల్లా వ్యాప్తంగా మంగళవారం జడివాన కురిసింది. ఏకధాటిగా గంటకు పైగా నిరవధికంగా కురిసిన గాలివానకు వంకలు, వాగులు పారాయి. అక్కడక్కడ పిడుగులు పడ్డాయి. ఈ జడివానకు కోతకు వచ్చిన వరిపైర్లు నేలకొరిగాయి. పంటపొలంలో ఒక్క అడుగు నీరు చేరాయి. వరికోత కోసి ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. ఈనేపథ్యంలో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకొంటున్నారు. పొలంలోనే రాలిన గింజలను చూసి బాధపడుతున్నారు. తడిసిన ధాన్యం రంగు మారితే ధర పలకదని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
నేలకొరిగిన చేతికొచ్చిన
వరి తదితర పంటలు
తడిసిన ధాన్యాన్ని ఆరపెట్టుకొంటున్న రైతన్నలు
రంగు మారితే ధర పలకదని
కర్షకుల దిగాలు
గాలివాన బీభత్సం.. వరి పైరుకు నష్టం


