బైకిస్టు అనుమానాస్పద మృతి
మైసూరు: బైకిస్టు అనుమానాస్పద స్థితిలో సజీవదహనమయ్యాడు. ఈఘటన మైసూరు జిల్లా నంజనగూడులో జరిగింది. నంజనగూడు తాలూకా రాంపూర్ నివాసి ఆదిత్య (24) మంగళవారం తన ఇంటినుంచి బైక్‌లో బయల్దేరాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కాని కోరహుండి వెళ్లే మార్గంలో హుల్లహళ్లి కాలువ సమీపంలో సజీవదహనమయ్యాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో నంజనగూడు పోలీసులు వచ్చి పరిశీలించారు. ఆదిత్య మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఇంజిన్‌లో మంటలు చెలరేగి ఆదిత్య మృతి చెందినట్లు కొందరు చెబుతున్నదాంట్లో వాస్తవం లేదంటున్నారు. మంటలు చెలరేగి ఉంటే తప్పించుకొని వెళ్లేవాడని చెబుతున్నారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా హత్య చేసి ఉండవచ్చని, ఆ కోణంలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
బైకిస్టు అనుమానాస్పద మృతి


