ముక్కోటి ఏకాదశి శోభ
సాక్షి బళ్లారి: నగర వ్యాప్తంగా మంగళవారం ముక్కోటి ఏకాదశి సందడి నెలకొంది. సంగం సర్కిల్, కూల్‌కార్నర్ సమీపంలో, రామేశ్వర కాలనీ, రూపనగుడిలోని వేంకటేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆయా దేవాలయాలు వద్ద ఏర్పాటు చేసిన ఉత్తర ద్వారంలో ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు బారులుదీరి స్వామిని దర్శించుకున్నారు. ఆలయాలు శ్రీనివాస గోవిందా.. శ్రీ వెంకటేశా గోవిందా, భక్తవత్సల గోవిందా నామస్మరణతో మార్మోగిపోయాయి. ఆలయాల వద్ద భక్తులకు ప్రసాదం అందజేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు.
రాయచూరు రూరల్: నగరంలోని నవోదయ కాలనీలో వెలసిన వేంకటేశ్వర ఆలయంలో కల్యాణ, పుష్పయాగ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ వేంకటేశ్వరాలయంలో నారాయణపేట మాజీ శాసన సభ్యుడు రాజేంద్ర రెడ్డి దంపతులు పూజలు చేయించారు. అలాగే ఉప్పార వాడిలో వెలసిన వేంకటేశ్వర ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందడి నెలకొంది. సాయంత్రం విగ్రహాన్ని పల్లకీలో ఊరేగించిన అనంతరం రథోత్సవం నిర్వహించారు. మంత్రాలయం రాఘవేంద్ర స్వాముల మఠంలో వైకుంఠ ఏకాదశి కోలాహలం నెలకొంది. మఠాధిపతి సుబుదేంద్ర తీర్థ ఊంజల సేవలు, మంగళ హరతి తదితర పూజలు చేశారు. అనంతరం భక్తులతో కలసి రథోత్సవం నిర్వహించారు. క్రిష్ణగిరి కాలనీలో ఇస్కాన్ మందిరంలో వేంకటేశ్వరుడికి రాదేశ్యాం పూజలు చేపట్టారు.
పెరిగిన భక్తుల రద్దీ..
హొసపేటె: అమరావతిలో వెలసిన వేంకటేశ్వర స్వామి ఆలయం భక్తి పారవశ్యంతో పులకించిపోయింది. ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకుని తరించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే ఆలయ అర్చకులు స్వామికి పంచామృతాభిషేకాలు, విశేష అర్చనలు చేపట్టారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు చంద్రశేఖర్ శెట్టి మాట్లాడుతూ.. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి భక్తుల రద్దీ పెరిగిందని తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ జాహ్నవి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. భక్తులకు పంచేందుకు 13 వేల లడ్డూలు తయారు చేశామన్నారు.
భక్తుల సందడి..
హుబ్లీ: దావణగెరెలో మూడు కిలోమీటర్ల మేర భక్తులు బారులుదీరి లక్ష్మీ వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. ఎంసీసీ బీ బ్లాక్‌లోని లక్ష్మీ వేంకటేశ్వర ఆలయం భక్త సమూహంతో నిండిపోయింది. తెల్లవారుజామున మూడు గంటల నుంచే దర్శనానికి భక్తులు తరలివచ్చారు. ఆలయ అర్చకుడు మురారీ ఆచార్య మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి రోజున విష్ణువును పూజించే సంప్రదాయం ఉందన్నారు. వైకుంఠ ఏకాదశికి చాలా ప్రాధాన్యత ఉందని తెలిపారు.
ఆలయాల్లో మార్మోగిన
వేంకటేశ్వరుడి నామస్మరణ
స్వామి దర్శనానికి
బారులు దీరిన భక్తులు
ఆలయాల వద్ద అన్నదానం
ముక్కోటి ఏకాదశి శోభ
ముక్కోటి ఏకాదశి శోభ
ముక్కోటి ఏకాదశి శోభ
ముక్కోటి ఏకాదశి శోభ
ముక్కోటి ఏకాదశి శోభ
ముక్కోటి ఏకాదశి శోభ


