బట్టలో వ్యక్తి మృతదేహం తరలింపు
రాయచూరు రూరల్: ప్రమాదంలో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని బట్టలో తీసుకెళుతున్న దృశ్యం బుధవారం సాయంత్రం యాదగిరి జిల్లాలోని యడహళ్లిలో చోటు చేసుకుంది.ట్రాక్టర్ వెనుక భాగానికి తగిలి గాయపడిన మల్లప్ప(33)ను ఆస్పత్రిలో చేర్పించారు. చివరికి ప్రాణాలు వదలడంతో గ్రామస్తులు బట్టలో శవాన్ని వేసుకొని తరలించి దహనం చేశారు. ఈ వీడియో వైరల్ అయింది. ఈ విషయంలో గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ హన్మంతు బంకలగికి తెలిపినా ప్రయోజనం లేకపోయింది. సహోదరులు శవాన్ని మోసుకెళ్లారు. 1.5 కి.మీ దూరంలోని హత్తికుణి ఆరోగ్య కేంద్రం నుంచి సకాలంలో అంబులెన్సు రాకపోవడంతో వారు శవాన్ని బట్టలో తీసుకెళ్లి శవ సంస్కారాలు జరిపారు.
ఆక్రమణల తొలగింపునకు వినతి
రాయచూరు రూరల్: నగరంలో నగరసభ కేటాయించిన గోశాల స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా కట్టుకున్న ఇళ్లను తొలగించాలని జేడీఎస్ జిల్లాధ్యక్షుడు విరుపాక్షి డిమాండ్ చేశారు. శుక్రవారం నగరసభ కార్యాలయంలో కమిషనర్‌తో ఆయన మాట్లాడారు. 1942లో నగరసభ వార్షిక టెండర్‌లో గోశాల సమితికి 3.25 ఎకరాల భూమిని కేటాయించారు. 1965లో సమితికి పూర్తి అధికారంతో నేటి వరకు పన్నులు కట్టారన్నారు. రాజకీయ నాయకుల మద్దతుతో గోశాలలోని 2.25 ఎకరాల భూమి తమదే అంటూ గోపాల్ సింగ్ పుత్రులు ఆ ప్రాంతంలో నగరసభ, నగర ప్రాధికార, జిల్లాధికారి అనుమతి లేకుండా కట్టడాలను నిర్మించారన్నారు. నిర్మాణాలు చేపట్టడం తప్పని, వాటిని నిలుపుదల చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
బట్టలో వ్యక్తి మృతదేహం తరలింపు


