ఉపాధి కరువు.. వలస దరువు
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు లేక రైతులు, వ్యవసాయ కూలీలు ఇతర నగరాలకు వలస వెళుతున్నారు. కళ్యాణ కర్ణాటక ప్రాంతంలోని రాయచూరు, యాదగిరి, కొప్పళ, బీదర్, కలబుర్గి జిల్లాల్లో రబీలో కూడా కరువు నెలకొంది. వ్యవసాయ కూలీలకు పనులు దొరకక బతుకు తెరువు కోసం బెంగళూరు, ముంబై, షోలాపూర్, గోవా, మహారాష్ట్ర, చైన్నె, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళుతున్నారు. వానలు లేక పంటలు పండక పోవడంతో జీవనోపాధికి వలస వెళుతూ రైతులు మూటా ముల్లె సర్దుకుంటున్నారు. రాయచూరు, యాదగిరి, బీదర్, కలబుర్గి జిల్లాల ప్రజలు ప్రతి రోజు వందలాది మంది బెంగళూరుకు రైలులో ప్రయాణిస్తున్నారు. వారిని కదిలిస్తే కళ్లలో కన్నీరు వస్తాయి. గ్రామాల్లో వయస్సు పైబడిన వారిని వదిలి పిల్లా పాపలతో కట్టుబట్టలతో వలస వెళుతున్నారు. ఈ ప్రాంతాల నుంచి ఎన్నికై న ప్రజాప్రతినిధులు వలసల నివారణకు ఎలాంటి పథకాలను ప్రారంభించాలనే తపన ఏ ఒక్కరిలో లేకపోవడం విడ్డూరంగా ఉంది. అధికారం కోసం తహతహలాడే నేతలు రైతన్నలు పడుతున్న ఈతిబాధలను పరిష్కరించడంలో మౌనం వహిస్తున్నారు.
బతుకు తెరువు కోసం తరలి వెళుతున్న కూలికార్మికులు
సమస్యలు పట్టించుకోని
ప్రజాప్రతినిధులు, అధికారులు
ఉపాధి కరువు.. వలస దరువు
ఉపాధి కరువు.. వలస దరువు


