
బుద్ధుని బోధనలే మోక్షమార్గం
తుమకూరు: నేడు అధికారం, ఆస్తుల కోసం ఘర్షణలు ప్రతి చోట సర్వసాధారణం. కానీ 2600 సంవత్సరాల క్రితం అధికారం, ఆస్తులు, కుటుంబాన్ని వదిలేసి, మోక్షాన్ని కోరుతూ భగవాన్ బుద్ధుడు అన్వేషణ సాగించారు. ప్రజలకు ప్రశాంతమైన, సంపన్నమైన జీవితాన్ని అందించడానికి పాటు పడ్డారని వక్తలు పేర్కొన్నారు. సోమవారం రాష్ట్రమంతటా బుద్ధ పూర్ణిమ వేడుకలను భక్తిశ్రద్ధలతో ఆచరించారు. తుమకూరు నగరంలోని డాక్టర్ గుబ్బివీరణ్ణ కళాక్షేత్రం జిల్లా యంత్రాంగం ద్వారా బుద్ధ జయంతిని ఆచరించారు. మన దేశంలో పుట్టిన బౌద్ధమతాన్ని నేడు మనం ఇతరుల నుంచి నేర్చుకోవలసిన పరిస్థితి రావడం విచాకరమన్నారు. మనిషిని విముక్తివైపు నడిపించే ఎనిమిది మార్గాలను బుద్ధ భగవానుడు బోధించారని పేర్కొన్నారు. ఆ మార్గాలను నేడు ఆసియాలో ఈశాన్య దేశాల్లో బోధిస్తున్నారని తెలిపారు. మంచి వాక్కు, మంచి పనులు, మంచి ప్రణాళిక, ప్రయత్నాలు మానవులను ముక్తి వైపు నడిపిస్తాయని పేర్కొన్నారు. బెంగళూరులోని మహాబోధి సొసైటీ బుద్ధుని ప్రతిమలకు విశేష పూజలు జరిపారు. పలు దేశాల నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులు, భక్తులు పాల్గొన్నారు.
బుద్ధుని బాట ఉత్తమం
భగవాన్ బుద్ధుని తత్వ సిద్ధాంతాలను మనం ప్రతి ఒక్కరం జీవితంలో అలవాటు చేసుకొని జీవితాన్ని సార్థకం చేసుకోవాలని హోం మంత్రి జీ.పరమేశ్వర్ అన్నారు. సిద్దార్థ విద్యాసంస్థలలో బుద్ధ పౌర్ణమి వేడుకలను నిర్వహించారు. బుద్ధుని విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడారు. భగవాన్ బుద్ధుడు ప్రబోధించిన తత్వ సిద్దాంతాలు, ఆచార విచారాలను ప్రతి ఒక్కరూ పాటించడం ద్వారా ఆయన మార్గంలో ముందుకు సాగాలని అన్నారు. ప్రతి మనిషికి దుఃఖం, కష్టం, సంతోషం అనేవి వస్తుంటాయి, పోతుంటాయని, వాటిలో పడి కొట్టుకుపోకుండా బుద్ధుని మార్గంలో సాగాలని అన్నారు.
ఘనంగా బుద్ధపూర్ణిమ వేడుకలు

బుద్ధుని బోధనలే మోక్షమార్గం

బుద్ధుని బోధనలే మోక్షమార్గం

బుద్ధుని బోధనలే మోక్షమార్గం

బుద్ధుని బోధనలే మోక్షమార్గం