
ఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పులు విరమణ ఒప్పందంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీ, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇద్దరినీ ప్రశంసించారు. తన జోక్యం కారణంగా ఆపరేషన్ సిందూర్ నాలుగు రోజుల్లోనే ముగిసిందని ట్రంప్ అంటున్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘డొనాల్డ్ ట్రంప్ గత 11 రోజుల్లో ఎనిమిది సార్లు భారత్, పాక్ మధ్య కాల్పుల ఒప్పందాన్ని తానే కుదిర్చినట్టు చెప్పారు. భారత్‌ను తానే ఒప్పించినట్టు చెప్పుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లినా ట్రంప్ ఇదే చెబుతున్నారు. కానీ, ఆయన స్నేహితుడు ప్రధాని మోదీ మాత్రం ఆయన వ్యాఖ్యలపై మౌనంగా ఉన్నారు. మన విదేశాంగ మంత్రి కూడా ఏం మాట్లాడటం లేదు. డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీ, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇద్దరినీ ప్రశంసించారు. అంటే భారత్, పాకిస్తాన్ ఒకే పడవలో ఉన్నాయి. ఇది మాకు ఆమోదయోగ్యం కాదు. ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు?. తన జోక్యం కారణంగా ఆపరేషన్ సిందూర్ నాలుగు రోజుల్లోనే ముగిసిందని ట్రంప్ చెప్పినప్పుడు దేశం మొత్తం షాక్ అయ్యింది. ప్రధాని మోదీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఆయన ఈ సమస్యల నుండి దృష్టిని మళ్లిస్తున్నారు’ అని ఆరోపించారు.
ఇదే సమయంలో ఆపరేషన్ సిందూర్ విషయమై అఖిలపక్ష ప్రతినిధుల బృందంపై జైరాం రమేష్ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులు జమ్ము, కశ్మీర్‌లోనే తిరుగుతున్నారు. వీరందరూ గత 18 నెలల్లో మూడు ఉగ్రవాద దాడులకు కారణమైనట్టు అధికారులు చెబుతున్నారు. ఉగ్రవాదులను పట్టుకోవడమే ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యతగా ఉండాలి. ఇలాంటిదేమీ లేకుండా.. ఎంపీలందరూ ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నారు. ఎంపీలను ఇతర దేశాలకు పంపడం ఎందుకు?. మేము అడిగే ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారు?. పార్లమెంట్ సమావేశం జరగాలి. ప్రధానమంత్రి ఎప్పుడూ అఖిలపక్ష సమావేశాలకు హాజరు కారు. ఆయన ఎటువంటి సమాధానాలు ఇవ్వరు అని విమర్శలు చేశారు.
#WATCH | Delhi | Congress MP Jairam Ramesh says, "In the last 11 days, US President Trump has repeated 8 times that he convinced India and enabled the ceasefire... But his friend, PM Modi, is quiet. Our foreign minister is quiet... Donald Trump praises both PM Modi and Pakistan… pic.twitter.com/G2FxHs8Trx
— ANI (@ANI) May 22, 2025