ఉగ్రవాదంపై ఉక్కుపాదమే: ప్రధాని మోదీ | Operation Sindoor showed the world India uncompromising policy against terrorism: PM Modi | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదంపై ఉక్కుపాదమే: ప్రధాని మోదీ

Jun 25 2025 2:48 AM | Updated on Jun 25 2025 5:57 AM

Operation Sindoor showed the world India uncompromising policy against terrorism: PM Modi

ప్రపంచానికి చాటిన సిందూర్‌: మోదీ

న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై భారత్‌ ఉక్కుపాదం మోపుతుందని ఆపరేషన్‌ సిందూర్‌తో మరోసారి ప్రపంచానికి చాటామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పాక్‌పై పోరులో మేకిన్‌ ఇండియా ఆయుధాలు సత్తా చాటాయని గుర్తు చేశారు. జాతి ప్రయోజనాల పరిరక్షణకు ఎలాంటి చర్యలకైనా తమ సర్కారు వెనకాడే సమస్యే ఉండబోదని స్పష్టం చేశారు. ఆధ్యాత్మికవేత్త, సామాజిక సంస్కర్త నారాయణగురు, మహాత్మాగాంధీ మధ్య చరిత్రాత్మక సంభాషణకు వందేళ్లయిన సందర్భంగా సోమవారం జరిగిన ఓ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు.

బలోపేతమైన భారత్‌ కోసం వాళ్లు కన్న కలలను నిజం చేసే దిశగా సాగుతున్నట్టు చెప్పారు. ‘‘11 ఏళ్ల క్రితం వరకూ దేశాన్ని పాలించిన వారి హయాంలో కోట్లాది ప్రజలు అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొ న్నారు. మా పాలనలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 11 ఏళ్లుగా దేశం సామాజికంగా, ఆర్థికంగా అత్యంత బలోపే తమవుతూ వస్తోంది. రక్షణ రంగంలో స్వావలంబన సాధిస్తోంది. భారత్‌ తయారు చేసే ఆయుధాలు ప్రపంచమంతటా జెండా ఎగరేసే రోజులు ఎంతో దూరం లేవు’’ అని ధీమా వెలిబుచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement