
ముంబై: ముంబైలో కలకలం. మద్యం మత్తులో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) నాయకుడు జావేద్ షేక్ కుమారుడు రాహిల్ జావేద్ వీరంగం సృష్టించాడు. పీకల దాకా మద్యం సేవించి నటి రాజశ్రీ మోరే పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కారును ఢీకొట్టి దూర్భలాడాడు. తనతో ఎందుకు ఇలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ప్రశ్నిస్తే.. ఇదిగో కావాలంటే డబ్బులు తీసుకో అంటూ నటిని బెదిరిస్తున్న వీడియోలో వెలుగులోకి వచ్చాయి.
గత ఆదివారం (జూలై 6న) ముంబైలోని అంధేరి ప్రాంతంలో రాహిల్ మోతాదుకు మించి మద్యం సేవించాడు. అంధేరి నుంచి మరో ప్రాంతానికి వెళుతుండగా.. మార్గం మధ్యలో నటి రాజశ్రీ మోరే కారును ఢీ కొట్టాడు. దీంతో రాజశ్రీ.. రాహిల్‌పై వాగ్వాదానికి దిగింది. అర్ధ నగ్నంగా ఉన్న రాహిల్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. మా నాన్న ఎవరో నీకు తెలుసా? మహరాష్ట్ర నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు జావెద్ షేక్ అని బెదిరించాడు.
ఇరువురి వాగ్వాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీసులతో రాహిల్ ఘర్షణకు దిగారు. తాజా సమాచారం ప్రకారం.. రాహిల్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ఇటీవల మరాఠీ భాషను బలవంతంగా తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎంఎన్‌ఎస్ కార్యకర్తలు తనని లక్ష్యంగా చేసుకున్నారని రాజశ్రీ ఆరోపించారు. ఘటన తాలూకు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
The son of MNS leader Javed Shaikh abuses (in Hindi/Urdu, of course) a Marathi girl after hitting her car. He even mocks her Marathi surname.
Let’s see whom the Thackeray brothers choose, a Marathi-speaking Maharashtrian or a Hindi-speaking Muslim. pic.twitter.com/xxamEFlTn7— Mr Sinha (@MrSinha_) July 7, 2025
మహారాష్ట్రలో భాషా వివాదం
మహారాష్ట్రలో భాషా వివాదం రాజుకుంది. ముంబైలో నివసించే వారు మరాఠీని తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన అవసరం లేదంటూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) సీనియర్ నాయకుడు సురేశ్ భయ్యాజీ జోషి చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా శివసేన(యూబీటీ) శ్రేణులు నిరసనలు చేపట్టాయి. దీంతో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెంటనే అప్రమత్తమయ్యారు. ముంబైతోపాటు మహారాష్ట్ర భాషగా మరాఠీని ఆయన అభివర్ణించారు. ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరూ మరాఠీని నేర్చుకుని మాట్లాడి తీరవలసిందేనంటూ స్పష్టంచేశారు. మీ మాతృభాషను మీరు ప్రేమించి, గౌరవిస్తే ఇతర భాషల పట్ల కూడా మీరు అలాగే వ్యవహరిస్తారు అని ఫడ్నవీస్ చెప్పారు.
నటి రాజశ్రీ మోర్సేపై విమర్శలు
ఈ వివాదంపై నటి రాజశ్రీ మోరే స్పందించారు. మహరాష్ట్రలో మరాఠీ భాషను తప్పనిసరి చేయడంపై సోషల్ మీడియా వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో.. మరాఠీలు ఎక్కడ ఉన్నా కష్టపడి పనిచేస్తారు. కానీ భాషను రద్దు ప్రయత్నం చేయడం వల్ల వలసదారులు నగరం విడిచిపెడతారని అన్నారు. అదే జరిగితే ముంబైలోని స్థానిక మరాఠీ సమాజం పరిస్థితి మరింత దిగజారిపోతుందని ఆమె హెచ్చరించారు. ఈ ప్రకటనల తర్వాత, నటి రాజశ్రీ మోర్సేపై విమర్శలు వెల్లువెత్తాయి.నేపథ్యంలో, రాజ్‌శ్రీ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. మరాఠా భాషపై స్పందించిన వీడియోను డిలీట్ చేశారు. ఎంఎస్‌ఎన్ మద్దతు దారులు సైతం ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.