breaking news
Rajasree
-
నటితో అసభ్య ప్రవర్తన.. మద్యం మత్తులో ప్రముఖ నేత కుమారుడి వీరంగం
ముంబై: ముంబైలో కలకలం. మద్యం మత్తులో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) నాయకుడు జావేద్ షేక్ కుమారుడు రాహిల్ జావేద్ వీరంగం సృష్టించాడు. పీకల దాకా మద్యం సేవించి నటి రాజశ్రీ మోరే పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కారును ఢీకొట్టి దూర్భలాడాడు. తనతో ఎందుకు ఇలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ప్రశ్నిస్తే.. ఇదిగో కావాలంటే డబ్బులు తీసుకో అంటూ నటిని బెదిరిస్తున్న వీడియోలో వెలుగులోకి వచ్చాయి.గత ఆదివారం (జూలై 6న) ముంబైలోని అంధేరి ప్రాంతంలో రాహిల్ మోతాదుకు మించి మద్యం సేవించాడు. అంధేరి నుంచి మరో ప్రాంతానికి వెళుతుండగా.. మార్గం మధ్యలో నటి రాజశ్రీ మోరే కారును ఢీ కొట్టాడు. దీంతో రాజశ్రీ.. రాహిల్‌పై వాగ్వాదానికి దిగింది. అర్ధ నగ్నంగా ఉన్న రాహిల్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. మా నాన్న ఎవరో నీకు తెలుసా? మహరాష్ట్ర నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు జావెద్ షేక్ అని బెదిరించాడు. ఇరువురి వాగ్వాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీసులతో రాహిల్ ఘర్షణకు దిగారు. తాజా సమాచారం ప్రకారం.. రాహిల్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది.ఇటీవల మరాఠీ భాషను బలవంతంగా తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎంఎన్ఎస్ కార్యకర్తలు తనని లక్ష్యంగా చేసుకున్నారని రాజశ్రీ ఆరోపించారు. ఘటన తాలూకు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. The son of MNS leader Javed Shaikh abuses (in Hindi/Urdu, of course) a Marathi girl after hitting her car. He even mocks her Marathi surname.Let’s see whom the Thackeray brothers choose, a Marathi-speaking Maharashtrian or a Hindi-speaking Muslim. pic.twitter.com/xxamEFlTn7— Mr Sinha (@MrSinha_) July 7, 2025మహారాష్ట్రలో భాషా వివాదం మహారాష్ట్రలో భాషా వివాదం రాజుకుంది. ముంబైలో నివసించే వారు మరాఠీని తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన అవసరం లేదంటూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సీనియర్ నాయకుడు సురేశ్ భయ్యాజీ జోషి చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా శివసేన(యూబీటీ) శ్రేణులు నిరసనలు చేపట్టాయి. దీంతో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెంటనే అప్రమత్తమయ్యారు. ముంబైతోపాటు మహారాష్ట్ర భాషగా మరాఠీని ఆయన అభివర్ణించారు. ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరూ మరాఠీని నేర్చుకుని మాట్లాడి తీరవలసిందేనంటూ స్పష్టంచేశారు. మీ మాతృభాషను మీరు ప్రేమించి, గౌరవిస్తే ఇతర భాషల పట్ల కూడా మీరు అలాగే వ్యవహరిస్తారు అని ఫడ్నవీస్ చెప్పారు.నటి రాజశ్రీ మోర్సేపై విమర్శలుఈ వివాదంపై నటి రాజశ్రీ మోరే స్పందించారు. మహరాష్ట్రలో మరాఠీ భాషను తప్పనిసరి చేయడంపై సోషల్ మీడియా వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో.. మరాఠీలు ఎక్కడ ఉన్నా కష్టపడి పనిచేస్తారు. కానీ భాషను రద్దు ప్రయత్నం చేయడం వల్ల వలసదారులు నగరం విడిచిపెడతారని అన్నారు. అదే జరిగితే ముంబైలోని స్థానిక మరాఠీ సమాజం పరిస్థితి మరింత దిగజారిపోతుందని ఆమె హెచ్చరించారు. ఈ ప్రకటనల తర్వాత, నటి రాజశ్రీ మోర్సేపై విమర్శలు వెల్లువెత్తాయి.నేపథ్యంలో, రాజ్శ్రీ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. మరాఠా భాషపై స్పందించిన వీడియోను డిలీట్ చేశారు. ఎంఎస్ఎన్ మద్దతు దారులు సైతం ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పెళ్లయిన కొంతకాలానికే భర్త చనిపోయాడు, జీవితం తలకిందులైంది: సీనియర్ నటి
తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు సరసన నటించి తెలుగు నటీమణుల్లో మంచి పేరు తెచ్చుకున్న సీనియర్ నటీమణి రాజశ్రీ. అలనాటి అందాల నటీమణులలో రాజశ్రీ ఒకరు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కాంతారావు వంటి స్టార్ హీరోల సరసన నటించారు. అప్పట్లోనే ఆమె తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరుసగా సినిమా చేసి స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు. ఇక తెలుగు ఎన్టీఆర్, కాంతారావు వంటి స్టార్స్‌తో ఎక్కువగా నటించిన ఆమె జానపద జోనర్ చిత్రాలతో గుర్తింపొందారు. చదవండి: భర్త కోసం నయన్ వ్యూహం.. ఆ డైరెక్టర్‌కి హ్యాండ్ ఇచ్చిన విజయ్ సేతుపతి? కెరీర్ పీక్స్‌లో ఉండగానే పొలిటికల్ ఫ్యామిలీకి కోడలిగా వెళ్లి సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం కొడుకు, మనవళ్లతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న ఆమె భర్త చనిపోయిన అనంతరం కఠిన పరిస్థితులు చూశానని చెప్పారు. తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె తన వ్యక్తిగత విషయాలను, మూవీ కెరీర్ గురించి చెప్పుకొచ్చారు. తన తల్లి చనిపోయాక హైదరాబాద్‌కు పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసకున్నానని చెప్పారు. ‘‘హీరోయిన్గా ఫుల్ బిజీగా ఉండగానే పెళ్లి చేసుకున్నా. నాకు చెప్పకుండ పెళ్లి చూపులు అరెంజ్ చేశారు. అంతా ఒకే అయ్యి పెళ్లి అయిపోయింది. వివాహం తర్వాత సినీ పరిశ్రమ వైపు తొంగి చూడలేదు. అందరు నన్ను ఎంతో అదృష్టవంతురాలిగా చూశారు. రాజశ్రీకి ఏంటి ఆహా, తంతే బూరెల బుట్టలో పడింది’ అని అంతా నా గురించి మాట్లాడుకునేవారు’’ అని చెప్పారు. ‘అలా మా అత్తగారి వాళ్లది ఉన్నతమైన కుటుంబం కావడంతో గూటిలో పక్షిలా బతికాను. కొంతకాలానికి నా భర్త చనిపోయారు. దీంతో ఒక్ససారిగా నా జీవితం తలకిందులైంది. చదవండి: ఇకపై మీ గొంతుక మరింత శక్తివంతంగా మారుతుంది: ఖుష్బూపై చిరు ప్రశంసలు నా కొడుకు మూడేళ్లు ఉన్నప్పుడే ఆయన గుండెపోటుతో చనిపోయారు. మా అమ్మ చనిపోయింది, పెళ్లయిన కొంతకాలానికే భర్త మరణించాడు. ఆ డిప్రెషన్‌తో నేను పదేళ్లు బయటకు రాలేదు. బయట ప్రపంచానికి నా ముఖం కూడా చూపించకుండ బతికాను. అప్పటి వరకు ఆహా అంటూ సాగిన నా జీవితం ఒక్కసారిగా కిందకు పడిపోయింది’ అంటూ వాపోయారు. ప్రస్తుతం తన కొడుకు అమెరికాలో సెటిలైయ్యాడని, చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పారు. తరచూ అమెరికా, ఇండియాకు తిరుగుతూనే ఉంటానని ఆమె తెలిపారు. -
గీత స్మరణం: మావేలే మావేలే
పల్లవి : ఆమె: మావేలే మావేలే పరువాలు మావేలే మీవేలే మీవేలే పంతాలు మీవేలే మజాలే మజాలే చెయ్యాలి మజాలే ఇదేలే ఇదేలే టీనేజీ ఇదేలే ప్రాయం మళ్లీ రాదు బృందం: వారెవ్వా బాబయ్య ॥ మావేలే॥ చరణం : 1 ఆ: పడుచు పిల్లలకి భాగవతం చెప్పొద్దు బృం: చెప్పొద్దూ చెప్పొద్దూ ఆ మాటలు చెప్పొద్దూ ఆ: చిలకే ఎగిరొస్తే విదిలించుకోవద్దు బృం: రావొద్దూ రావొద్దూ మళ్లీ మళ్లీ రావొద్దు ఆ: పూచే పూలన్నీ పూజలకే వాడొద్దు పడుచుకి పూవందం మరిచిపోవద్దు లక్షలు అడిగేనా లగ్నం నేనడిగేను ముహూర్తం పెట్టించు రేపో మాపో ॥ మావేలే॥ చరణం : 2 ఆ: పానుపు నిద్దరకే పరిమితము కావొద్దు బృం: పెట్టొద్దూ పెట్టొద్దూ కొత్త రూలు పెట్టొద్దూ ఆ: కాశ్మీర్ లోయల్లో కాశీని తలవొద్దూ బృం: పాడొద్దు పాడొద్దు హద్దుమీరి పాడొద్దు చక్కని వయ్యారి నీవెంట పడుతుంటే దొరకీ దొరకనట్టు జారుకోవద్దూ పగ్గం వెయ్యెద్దు పరువాలకిక ముందు అనుభవించాలి నేడే నేడే ॥ మావేలే॥ గానం : మిన్మిని, బృందం పల్లవి : చికు బుకు చికు బుకు రైలే అదిరెను దీని స్టైలే చక్కనైన చిక్కనైన ఫిగరే ఇది ఓకే అంటే గుబులే ॥ చికు॥ దీని చూపుకు లేదు ఏ భాషా కళ్లలోనే ఉంది నిషా ఈ హొయలే చూస్తే జనఘోష చెంగు తగిలితే కలుగును శోష ॥ చికు॥ చరణం : 1అహ... సైకిలెక్కి మేం వస్తుంటే మీరు మోటర్ బైకులే చూస్తారు అహ... మోటర్ బైకులో మేం వస్తుంటే మీరు మారుతీలు వెతికేరు అహ... జీన్స్ ప్యాంట్సుతో మేం వస్తే మీరు బ్యాగి ప్యాంట్సుకై చూస్తారు అహ... బ్యాగి ప్యాంట్సుతో మేం వస్తే మీరు పంచలొంక చూస్తారు మీకు ఏవి కావాలో మారు అర్థం కాలేదే పూలబాణాలేశామే పిచ్చివాళ్లయి పోయామే ॥ చికు॥ చరణం : 2 మాకు ఆటపాటలో అలుపొచ్చే మీ వెనక తిరిగి ఇక విసుగొచ్చే మా మతులు చెదిరి తల నెరుపొచ్చే రాదులే వయసు మళ్లీ మీ పెళ్లి కొరకు మీ పెద్దోళ్లు రేపిచ్చుకోవాలి కట్నాలు అవి లేక జరగవు పెళ్లిళ్లు ఎందుకీ గోల మీకు మీరు ఇపుడే లవ్‌చేస్తే మూడుముళ్లు పడనిస్తే కన్నవాళ్లకు అది మేలు చిన్నవాళ్లకు హ్యాపీలు ॥ చికు॥ చిత్రం : జెంటిల్‌మేన్ (1993), రచన : రాజశ్రీ సంగీతం : ఎ.ఆర్.రెహమాన్, గానం : సురేష్ పీటర్ - నిర్వహణ: నాగేష్