వైరల్‌ వీడియో: యువతులపై చేయి చేసుకున్న మహిళా కానిస్టేబుల్‌! | Lady constable beats up women riding triple seat on motorbike later apologises | Sakshi
Sakshi News home page

వైరల్‌ వీడియో: యువతులపై చేయి చేసుకున్న మహిళా కానిస్టేబుల్‌!

Jun 25 2025 8:43 PM | Updated on Jun 25 2025 8:51 PM

Lady constable beats up women riding triple seat on motorbike later apologises

ముంబై: ముగ్గురు యువతులు బైక్‌పై త్రిబుల్‌ రైడింగ్‌ చేసూకుంటూ వెళుతున్నారు.  స్కూటీని వేగంగా, ప్రమాదకరంగా మలుపులు తిప్పుతూ డ్రైవ్‌ చేస్తున్నారు. ఆ సమయంలో తన కుమార్తెను ట్యూషన్‌ కాలేజీకి తీసుకెళ్తున్న ఓ మహిళా ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ వారిని ఆపి, తల్లిలా మందలించింది. కానీ వెరసి మహిళా కానిస్టేబుల్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ అమ్మాయిల విషయంలో తాను చేసింది తప్పేనంటూ బహిరంగంగా క్షమాపణాలు చెప్పాల్సి వచ్చింది. ఇంతకి ఏం జరిగిందంటే?

మహరాష్ట్ర లాతూర్‌ సిటీలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రణిత ముస్నే.. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించి ఇష్టారీతిని త్రిబుల్‌ రైడింగ్‌ చేస్తున్న యువతులపై చేయి చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోమవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రెనాపూర్ నాకా వద్ద చిత్రీకరించిన ఈ వీడియోలో.. కానిస్టేబుల్ ప్రణిత ముస్నే యువతులను మాటలతో దూషిస్తూ, చివరికి వారిలో ఒకరిని చెంపదెబ్బ కొడుతూ కనిపించారు. ట్రిపుల్ రైడింగ్ చేయడం చట్టవిరుద్ధమని ఆమె పేర్కొన్నారు.

తర్వాత మీడియాతో మాట్లాడిన కానిస్టేబుల్ మాట్లాడుతూ.. నా కుమార్తెలను ట్యూషన్‌కు వదిలి విధులకు వెళ్తున్న సమయంలో, ముగ్గురు యువతులు స్కూటర్‌పై ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారని గమనించాను. వారిని ఆపి జాగ్రత్తగా వెళ్లమని చెప్పాను. కానీ వారు 'నీ పని చూసుకో' అంటూ స్పందించారు. అందుకే వారిని వెంబడించి ఆపాను. ఆ సమయంలో నేను తల్లిలా స్పందించాను, కానిస్టేబుల్‌గా కాదు.

అయితే, ఆమె అసభ్యంగా మాట్లాడడంపై విమర్శలు వెల్లువెత్తాయి. నెటిజన్లు సైతం ఆమె మాట్లాడిన తీరుపై విమర్శలు గుప్పించారు. చట్టం ప్రకారం.. యువతులపై చేయిచేసుకునే హక్కు లేదని ట్వీట్లు కూడా పెట్టారు. ఇలా ఆమె తీరు వివాదంగా మారింది. చివరికి ఆమె క్షమాపణలు చెప్పేందుకు దారి  తీసింది. ‘నేను వాడిన భాష తప్పు. దానికి నేను క్షమాపణ చెబుతున్నాను. కానీ నా ఉద్దేశం తప్పు కాదు’అని ఆమె స్పష్టం చేశారు.లాతూర్ పోలీస్ అధికారులు ఈ ఘటనపై ఇంకా స్పందించలేదు. 

 

Advertisement
 
Advertisement
Advertisement