breaking news
Traffic conistable
-
ఛలానా వేస్తారని భయపడి.. మహిళా ట్రాఫిక్ పోలీసును ఈడ్చుకెళ్లి!
ఆమె విధినిర్వహణలో ఉంది. సరిగ్గా అదే సమయంలో ఓ ఆటోడ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్‌తో దూసుకొస్తున్నాడు. అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేయబోయిందామె. అయితే ఆ డ్రైవర్ ఆగకుండా ఆమెనూ రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. సతారా సిటీలో భాగ్యశ్రీ జాదవ ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోంది. సోమవారం సాయంత్రం విధుల్లో ఉండగా.. ఓ ఆటో దూసుకురావడం ఆమె గమనించింది. అతన్ని అడ్డుకునే ప్రయత్నంలో ఆమె ఆటోను పట్టుకుని కిందపడిపోయింది. అది గమనించి.. ఆ ఆటోడ్రైవర్ ఆటోను మరింత వేగంగా పోనిచ్చాడు. ఆ ప్రయత్నంలో ఆమె కిందపడిపోగా.. రోడ్డు మీదే కాస్త దూరం లాక్కెళ్లాడు. ఈలోపు.. స్థానికులు ఆ ఆటో వెంట పరిగెత్తి.. ఆ ఆటోడ్రైవర్‌ను అడ్డుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. తాను తాగేసి ఉన్నానని, పోలీసులకు దొరికితే ఛలానా వేస్తారనే భయంతోనే పారిపోయే ప్రయత్నం చేశానని ఆ ్రైవర్ దేవ్‌రాజ్ కాలే చెబుతున్నాడు. ఈ ఘటనలో భాగ్యశ్రీకి గాయాలు కాగా.. ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో.. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీల్లో రికార్డయ్యాయి. Video: Drunk autorickshaw driver drags woman cop trying to stop him in Maharashtra#Maharashtra #Satara #KhandobaMaal #VIDEO #ViralVideos pic.twitter.com/t7pZivZi35— Princy Sharma (@PrincyShar14541) August 19, 2025 -
వైరల్ వీడియో: యువతులపై చేయి చేసుకున్న మహిళా కానిస్టేబుల్!
ముంబై: ముగ్గురు యువతులు బైక్‌పై త్రిబుల్ రైడింగ్ చేసూకుంటూ వెళుతున్నారు. స్కూటీని వేగంగా, ప్రమాదకరంగా మలుపులు తిప్పుతూ డ్రైవ్ చేస్తున్నారు. ఆ సమయంలో తన కుమార్తెను ట్యూషన్ కాలేజీకి తీసుకెళ్తున్న ఓ మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ వారిని ఆపి, తల్లిలా మందలించింది. కానీ వెరసి మహిళా కానిస్టేబుల్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ అమ్మాయిల విషయంలో తాను చేసింది తప్పేనంటూ బహిరంగంగా క్షమాపణాలు చెప్పాల్సి వచ్చింది. ఇంతకి ఏం జరిగిందంటే?మహరాష్ట్ర లాతూర్ సిటీలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రణిత ముస్నే.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి ఇష్టారీతిని త్రిబుల్ రైడింగ్ చేస్తున్న యువతులపై చేయి చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోమవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.రెనాపూర్ నాకా వద్ద చిత్రీకరించిన ఈ వీడియోలో.. కానిస్టేబుల్ ప్రణిత ముస్నే యువతులను మాటలతో దూషిస్తూ, చివరికి వారిలో ఒకరిని చెంపదెబ్బ కొడుతూ కనిపించారు. ట్రిపుల్ రైడింగ్ చేయడం చట్టవిరుద్ధమని ఆమె పేర్కొన్నారు.తర్వాత మీడియాతో మాట్లాడిన కానిస్టేబుల్ మాట్లాడుతూ.. నా కుమార్తెలను ట్యూషన్‌కు వదిలి విధులకు వెళ్తున్న సమయంలో, ముగ్గురు యువతులు స్కూటర్‌పై ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారని గమనించాను. వారిని ఆపి జాగ్రత్తగా వెళ్లమని చెప్పాను. కానీ వారు 'నీ పని చూసుకో' అంటూ స్పందించారు. అందుకే వారిని వెంబడించి ఆపాను. ఆ సమయంలో నేను తల్లిలా స్పందించాను, కానిస్టేబుల్‌గా కాదు.అయితే, ఆమె అసభ్యంగా మాట్లాడడంపై విమర్శలు వెల్లువెత్తాయి. నెటిజన్లు సైతం ఆమె మాట్లాడిన తీరుపై విమర్శలు గుప్పించారు. చట్టం ప్రకారం.. యువతులపై చేయిచేసుకునే హక్కు లేదని ట్వీట్లు కూడా పెట్టారు. ఇలా ఆమె తీరు వివాదంగా మారింది. చివరికి ఆమె క్షమాపణలు చెప్పేందుకు దారి తీసింది. ‘నేను వాడిన భాష తప్పు. దానికి నేను క్షమాపణ చెబుతున్నాను. కానీ నా ఉద్దేశం తప్పు కాదు’అని ఆమె స్పష్టం చేశారు.లాతూర్ పోలీస్ అధికారులు ఈ ఘటనపై ఇంకా స్పందించలేదు. Lady Traffic Constable Abuses, Beats Three Young Girls For Triple-Seat Riding In Latur pic.twitter.com/juTK3okkLg— ExtraOrdinary (@Extreo_) June 24, 2025 -
ఏపీ: ట్రాఫిక్ ఆర్ఎస్ఐకు అరుదైన గౌరవం
సాక్షి, అమరావతి: మహిళ ప్రాణాలు రక్షించిన ట్రాఫిక్ ఆర్ఎస్ఐ అర్జున్‌రావుకు అరుదైన గౌరవం దక్కింది. "ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శౌర్య పతకం" ప్రభుత్వం ప్రకటించింది. ఎస్పీలు, కమిషనర్లతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ ఎస్పీలు, కమిషనర్లతో డీజీపీ గౌతమ్ సవాంగ్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన "దిశ"పై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. "దిశ"పై మహిళా పోలీసులకు డీజీపీ గౌతమ్ సవాంగ్ దిశానిర్దేశం చేశారు. ఇంటింటికి వెళ్లి మహిళల ఫోన్లలో దిశయాప్‌ను డౌన్లోడ్ చేసి అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలలు, విద్యాసంస్థల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలని డీజీపీ ఆదేశించారు. చదవండి: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు ఏపీ మరో కీలక నిర్ణయం: వారిక మహిళా పోలీసులు -
కార్గిల్ యుద్ధ వీరుడికి డబుల్ ప్రమోషన్!
చండీగఢ్: భారతదేశ చరిత్రలో కార్గిల్ యుద్ధానికి ప్రత్యేకం స్థానం ఉంది. మంచుకొండలపై మాటు వేసి భారత్‌ను దొంగ దెబ్బ తీయాలన్న పాక్ పన్నాగాన్ని మన సైన్యం సమర్థంగా ఎదుర్కొని ఆ దేశాన్ని చావుదెబ్బ కొట్టింది. కార్గిల్ యుద్ధంలో మన జవాన్లు చూపిన అసమాన పోరాటమే భారత్‌కు విజయాన్ని అందించింది. అమర జవాన్ల పోరాటాన్ని స్మరించుకునేందుకు భారత్ ఏటా జులై 26న ‘విజయ్ దివస్’ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా నాడు దేశం కోసం వీరోచితంగా పోరాడిన యుద్ధ వీరుడు సత్పాల్ సింగ్ గురించి మీడియాలో ప్రత్యేక కథనాలు వెలువడ్డాయి. నాడు యుద్ధంలో సత్పాల్ చూపిన ధైర్యసాహసాలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనకు ‘వీర్ చక్ర’ అవార్డు కూడా ప్రదానం చేసింది. సైన్యం నుంచి బయటకు వచ్చిన అనంతరం ప్రస్తుతం సత్పాల్ సింగ్ పంజాబ్‌లోని ఓ చిన్న పట్టణంలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నిన్న కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సత్పాల్ గురించి ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అది కాస్త పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ దృష్టికి వెళ్లడం.. ఆయన వెంటనే సత్పాల్కు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ ఇస్తూ ఆదేశాలు జారీ చేయడం క్షణాల్లో జరిగిపోయాయి. అంతేకాక సత్పాల్ కొడుకు పీజీ పూర్తి చేసి ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్నాడు. సత్పాల్ కథనానికి స్పందించిన ఓ విద్యాసంస్థల చైర్మన్, కూల్ డ్రింక్స్ కంపెనీలు సత్పాల్ కొడుకుకు ఉద్యోగం ఇవ్వడానికి ఆసక్తి చూపాయి. దీని గురించి ఇప్పటికే సత్పాల్ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడినట్లు సమాచారం. దీంతో సత్పాల్ కొడుకు కూడా త్వరలోనే ఉద్యోగంలో చేరనున్నట్లు తెలుస్తోంది. Glad to report that Punjab CM @capt_amarinder has just announced that Head Constable Satpal Singh, Vir Chakra has immediately been promoted Assistant Sub Inspector.@IndianExpress https://t.co/idpTIuj9H0 — Man Aman Singh Chhina (@manaman_chhina) July 26, 2019 -
ట్రిపుల్ రైడింగ్ నో ‘ఫైన్’
రిమాండ్‌కు తీసుకెళ్తున్న ఖైదీని మధ్యలో కూర్చోబెట్టుకొని పోలీసులు ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న ఈ దృశ్యం శుక్రవారం గుంటూరు నగరంలోని శంకర్ విలాస్ సెంటర్లో కనిపించింది. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇలా తనకేమీ పట్టనట్టు వ్యవహరించారు. – ఫొటో: రూబెన్ బెసాలియేల్, గుంటూరు