ఛలానా వేస్తారని భయపడి.. మహిళా ట్రాఫిక్ పోలీసును ఈడ్చుకెళ్లి! | Drunk Driver Drags Woman Cop Maharashtra Video Viral | Sakshi
Sakshi News home page

ఛలానా వేస్తారని భయపడి.. మహిళా ట్రాఫిక్ పోలీసును ఈడ్చుకెళ్లి!

Aug 19 2025 11:11 AM | Updated on Aug 19 2025 11:52 AM

Drunk Driver Drags Woman Cop Maharashtra Video Viral

ఆమె విధినిర్వహణలో ఉంది. సరిగ్గా అదే సమయంలో ఓ ఆటోడ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌తో దూసుకొస్తున్నాడు. అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేయబోయిందామె. అయితే ఆ డ్రైవర్‌ ఆగకుండా ఆమెనూ రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. 

సతారా సిటీలో భాగ్యశ్రీ జాదవ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోంది. సోమవారం సాయంత్రం విధుల్లో ఉండగా.. ఓ ఆటో దూసుకురావడం ఆమె గమనించింది. అతన్ని అడ్డుకునే ప్రయత్నంలో ఆమె ఆటోను పట్టుకుని కిందపడిపోయింది. అది గమనించి.. ఆ ఆటోడ్రైవర్‌ ఆటోను మరింత వేగంగా పోనిచ్చాడు. ఆ ప్రయత్నంలో ఆమె కిందపడిపోగా.. రోడ్డు మీదే కాస్త దూరం లాక్కెళ్లాడు. ఈలోపు.. 

స్థానికులు ఆ ఆటో వెంట పరిగెత్తి.. ఆ ఆటోడ్రైవర్‌ను అడ్డుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. తాను తాగేసి ఉన్నానని, పోలీసులకు దొరికితే ఛలానా వేస్తారనే భయంతోనే పారిపోయే ప్రయత్నం చేశానని ఆ ్రైవర్‌ దేవ్‌రాజ్‌ కాలే చెబుతున్నాడు. ఈ ఘటనలో భాగ్యశ్రీకి గాయాలు కాగా.. ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో.. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీల్లో రికార్డయ్యాయి. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement