breaking news
DRAGGED
-
Bhubaneswar: ప్రభుత్వ అధికారిపై దౌర్జన్యం.. నేటి నుంచి ఉద్యోగుల నిరవధిక సెలవు
భువనేశ్వర్: ఒడిశాలోని ఒక ప్రభుత్వ అధికారికి ఘోర అవమానం ఎదురయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కార్యాలయంలో అదనపు కమిషనర్ రత్నాకర్ సాహూపై కొందరు దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో రత్నాకర్ సాహూను కార్యాలయం నుంచి బయటకు ఈడ్చుకెళ్లి, అతనిపై దాడి చేస్తూ, ముఖంపై తన్నడం కనిపిస్తోంది. I am utterly shocked seeing this video. Today, Shri Ratnakar Sahoo, OAS Additional Commissioner, BMC, a senior officer of the rank of Additional Secretary was dragged from his office and brutally kicked and assaulted in front of a BJP Corporator, allegedly linked to a defeated… pic.twitter.com/yf7M3dLt9C— Naveen Patnaik (@Naveen_Odisha) June 30, 2025ఈ ఘటన గురించి రత్నాకర్ సాహూ మాట్లాడుతూ తాను ఉదయం 11.30 గంటల సమయంలో ఫిర్యాదులు స్వీకరించే పనిలో ఉండగా, బీఎంసీ కార్పొరేటర్ జీవన్ రౌత్‌తోపాటు వచ్చిన ఆరుగురు తన ఛాంబర్లోకి చొరబడ్డారని, తరువాత వారు దుర్భాషలాడుతూ, తనను ఆఫీసు నుండి బయటకు లాక్కెళ్లి, వారి వాహనంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించారని సాహూ తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. నిందితులు జీవన్ రౌత్, రష్మి మహాపాత్ర, దేబాషిష్ ప్రధాన్‌లను అరెస్ట్ చేశారు. ఈ ఘటన అనంతరం బిజు జనతాదళ్ (బీజేడీ)కార్పొరేటర్లు, బీఎంసీ సిబ్బంది నిరసనకు దిగారు. జనపథ్ రోడ్డు దిగ్బంధనం చేశారు.రత్నాకర్ సాహూపై దాడికి నిరసనగా ఒడిశా అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అసోసియేషన్ మంగళవారం (జూలై 1) నుండి సామూహిక నిరవధిక సెలవును ప్రకటించింది. అదనపు కమిషనర్ పై జరిగిన దాడిపై బిజు జనతాదళ్ అధినేత, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దోషులపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీని కోరారు. బీఎంసీ మేయర్ సులోచన దాస్ ఈ సంఘటనను ఖండిస్తూ నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.ఇది కూడా చదవండి: Madhya Pradesh: తనను దూరం పెట్టిందని.. నర్సింగ్ విద్యార్థినిపై యువకుని ఘాతుకం -
పోలీసుల్ని ఢీకొట్టి.. 20 మీటర్లు ఈడ్చుకెళ్లి!
న్యూఢిల్లీ: విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసులను ఢీకొట్టిన కారు, వారిని 20 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన ఢిల్లీలోని వేదాంత్ దేశికా మార్గ్‌లోని బెర్ సరాయ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద శనివారం రాత్రి 7.45 గంటల సమయంలో చోటుచేసుకుంది. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్(ఏఎస్ఐ) ప్రమోద్, హెడ్ కానిస్టేబుల్ శైలేశ్ చౌహాన్ ట్రాఫిక్ ఉల్లంఘనుల వాహనాలకు చలాన్లు రాస్తున్నారు. అదే సమయంలో ఓ కారు రెడ్ సిగ్నల్‌ను పట్టించుకోకుండా వేగంగా దూసుకువచి్చంది. దాంతో శైలేశ్, ప్రమోద్ ఆ కారును ఆపారు. అయితే అది ఒక్కసారిగా స్పీడందుకుని ఇద్దరినీ 20 మీటర్ల మేర ఈడ్చుకెళ్లి మాయమైంది. గాయపడ్డ పోలీసులను సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. వారు పెను ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారని అధికారులు తెలిపారు. కారు యజమానిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. -
బీజేపీ ఎమ్మెల్యేను చెంపదెబ్బ కొట్టిన న్యాయవాది.. వీడియో వైరల్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ ఎమ్మెల్యేపై జరిగిన దాడి సర్వత్రా చర్చనీయాంశమైంది. లఖింపూర్‌లో బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ వర్మ చెంప చెళ్లుమనించాడు ఓ న్యాయవాది చెంపపై న్యాయవాది కొట్టాడు. పోలీసుల సమక్షంలోనే ఈ సంఘటన జరగ్గా. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అసలేం జరిగిందంటే.. అక్టోబర్ 14న అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఓటర్ల జాబితాను తారుమారు చేశారని, కొంత మంది సభ్యులను జాబితా నుంచి తొలగించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సునీల్‌సింగ్, ఎమ్మెల్యే యోగేష్ వర్మ డిమాండ్ చేశారు. బుధవారం అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఏడీఎం)కు వినతి పత్రం సమర్పించారు. కానీ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఏడీఎం) సంజయ్ సింగ్ ధృవీకరించారు.అయితే, కలెక్టర్ కార్యాలయం నుంచి తిరిగి వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ వర్మపై స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, న్యాయవాది అవధేష్ సింగ్ దాడికి ప్రయత్నించాడు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ ఎమ్మెల్యే చెంపపై ఆయన కొట్టాడు. అంతేగాక సింగ్ మద్దతుదారులు, మరికొంతమంది న్యాయవాదులు కూడా ఎమ్మెల్యేపై చేయిచేసుకున్నారు. ఎమ్మెల్యే తిరిగి ప్రతి దాడికి ప్రయత్నించినప్పటికీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.Uttar Pradesh: In Lakhimpur, tensions flared during the Urban Cooperative Bank election as Sadar MLA Yogesh Verma and Bar Association President Avadhesh Singh clashed pic.twitter.com/qF9mFi5Mps— IANS (@ians_india) October 9, 2024 -
ఎంత అమానుషం: భార్యను తాడుతో కట్టేసి.. బైక్‌పై ఈడ్చుకెళ్లిన భర్త
రాజస్థాన్‌లో అమానుష ఘటన వెలుగుచూసింది. తాగిన మైకంలో ఓ భర్త తన భార్యపై క్రూరంగా ప్రవర్తించాడు. భార్య కాళ్లకు తాడు వేసి దానిని బైక్‌కు కట్టి కొంతదూరం లాక్కెళ్లాడు. ఈ ఘోర దృశ్యాలకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియోలో.. మట్టి, రాళ్లు కలిగిన నేల మీద మహిళను ఈడ్చుకెళ్తుండే.. ఆమె నొప్పితో బాధపడుతూ సాయం కోసం అరవడం వినిపిస్తోంది. అక్కడే ఓ మహిళ, మరో వ్యక్తి (వీడియో తీస్తున్న అతను) ఉన్నప్పటికీ దీనిని ఆపేందుకు కూడా ప్రయత్నించలేదు. నాగౌర్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది.మహిళను కొంతదూరం లాక్కెళ్లిన తర్వాత అతడు బైక్ దిగి ఓ సాధించినట్లు నడుం మీద చేయి వేసి దర్జాగా నిల్చొని ఉన్నాడు. గాయాలపాలైన భార్య మెల్లగా లేచి ఏడుస్తూ నిలబడి ఉంటుంది. అయితే ఈ 40 సెకన్ల నిడివి గల ఈ వీడియోకు చెందిన ఘటన గత నెలలో జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా సోషల్ మీడియాలోషేర్ చేయడంతో చక్కర్లు కొడుతోంది. అయితే జైసల్మేర్‌లో ఉన్న తన సోదరి ఇంటికి వెళ్లాలని భార్య అనుకోగా..భర్త ఆమెపై ఈ విధంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. వ్యక్తిని ప్రేమ్ రామ్ మేఘ్వాల్గా(32) గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మేఘ్వాల్ నిరుద్యోగి, డ్రగ్స్ బానిసైనట్లు పంచౌడీ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ సురేంద్ర కుమార్ తెలిపారు. ప్రస్తుతం మహిళ పంజాబ్‌లోని తన తల్లిదండ్రుల వద్ద ఉంటున్నట్లు సమాచారం.Shocking incident in Nagaur: A man, under the influence of alcohol,tied his wife to the back of a bike and dragged her on the road.The video went viral, leading to the man's arrest. Prior to this, the wife was reportedly held captive at home. She is now with her mother in Punjab. pic.twitter.com/Nfik4CJpqj— Smriti Sharma (@SmritiSharma_) August 13, 2024 -
దారుణం: డాక్టర్ని ఢీకొట్టి.. కారుతో లాక్కెళ్లి..
చంఢీగర్: హర్యానాలో అమానవీయ ఘటన జరిగింది. ఓ డాక్టర్ని కారుతో దాడి చేసి 50 మీటర్ల వరకు అలాగే లాక్కెళ్లారు దుండగులు. పంచకుల ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డా. గగన్ తన కుమారున్ని ట్యూషన్ నుంచి ఇంటికి తీసుకువెళ్తున్నాడు. ఈ క్రమంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్దకు చేరుకున్నాడు. అదే సమయంలో పక్కనే ఉన్న కారు అతన్ని ఢీ కొట్టింది. గగన్ కారును ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కారు డోమ్‌పై అతన్ని అలాగే ఉంచి ముందుకు దూసుకెళ్లారు. దాదాపు 50 మీటర్ల వరకు కారుతోపాటు లాక్కెళ్లారు దుండగులు. #Video: Doctor Dragged For 50 Meters On Car Bonnet In Panchkula Road Rage Incident in Panchkula#PANCHKULA #ROADRAGE #DOCTORDRAGGED #LatestUpdates pic.twitter.com/JQgpinikw6 — mishikasingh (@mishika_singh) August 28, 2023 తీవ్ర గాయాలపాలైన అతన్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఆధారాలతో దుండగుల కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదీ చదవండి: ప్రభుత్వ ఆఫీస్‌లో అధికారి మద్యం సేవిస్తూ.. వీడియో వైరల్.. -
మొసలి నోటికి చిక్కిన మహిళ.. గంట తర్వాత బయటపడిందిలా..!
ఈ భూమి మీద నూకలున్నంత వరకూ ప్రాణం ఎలాగైనా నిలబడుతుందంటారు. ఇది 38 ఏళ్ల మహిళ విషయంలో నిరూపితమయ్యింది. ఒక భారీ మెసలి ఆమెపై దాడి చేసింది. నీటిలోతుల్లోకి లాక్కుపోయింది. గంట పాటు ఆ మహిళను మొసలి నోటిలో చిక్కుకుని విలవిలలాడిపోయింది. అయితే అప్పుడే అద్భుతం జరిగింది. ఆమె ప్రాణాలతో బయటపడింది. సోషల్ మీడియాలో ఆమె కథ విపరీతంగా వైరల్ అవుతోంది. మెట్రో యూకే తెలిపిన వివరాల ప్రకారం 38 ఏళ్ల ఫమ్లిరా.. పామ్ ఆయిల్ తోటల్లో పనిచేస్తుంటుంది. ఇటీవల ఆమె ఒక నదిలో నీటిని పాత్రలో పట్టుకుంటోంది. ఆ నదిలో మొసళ్లు ఉన్న సంగతి ఆమెకు తెలియదు. ఇంతలో ఒక మొసలి క్షణాల్లో ఆమెను నీటిలోనికి లాక్కుపోయింది. ఫ్లమిరా బాధతో తనను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేసింది. ఆమెతో పాటు పనిచేసే కూలీలు ఆమెను కాపాడేందుకు పరుగులు పెట్టారు. వారు ఆ మొసలిని కర్రలతో కొట్టాసాగారు. దీంతో బాధితురాలు ఆ మెసలి నోటి బారి నుంచి ఎలాగోలా బయటపడింది. అయితే ఆమెను కాపాడేందుకు కూలీలు గంటకుపైగా శ్రమించారు. ఈ సమయంలో ఫల్మిరా కూడా మొసలి బారి నుంచి బయటపడేందుకు ప్రయత్నించింది. అటు కూలీల దాడి, ఇటు బాధితురాలి పెనుగులాట మధ్య ఆ మొసలి ఆమెను తన నోటి నుంచి విడిచిపెట్టింది. బాధితురాలిని మొసలి బారి నుంచి తప్పించేందుకు ప్రయత్నించిన కొందరు గాయాలపాలయ్యారు. ప్రాణాలతో బయటపడిన ఫమ్లిరా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మొసలి నోటికి చిక్కిన తాను దాని బారి నుంచి బయటపడుతాననుకోలేదన్నారు. ఇప్పటికీ తన కళ్ల ముందు మొసలి ఉన్నట్లుందన్నారు. కాగా మొసలి దాడిలో ఫల్మిరా పాదాలకు, ఉదర భాగానికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఇది కూడా చదవండి: ఎందుకు పెంచుకున్నారు? ఎందుకు చంపేశారు? -
సిసోడియాకు అవమానం.. మెడ పట్టుకుని లాక్కెళ్లిన పోలీసులు
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా పట్ల నగర పోలీసులు వ్యవహరించిన తీరుపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో సహా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. దేశ రాజధానిలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చిన సమయంలో.. సిసోడియాను పోలీసులు మెడ పట్టుకొని బలవంతంగా లాక్కెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు సీఎం కేజ్రీవాల్ ఓ వీడియో విడుదల చేశారు. సిసోడియాను మెడ పట్టుకొని లాక్కెళ్లిన పోలీసులు? ఇందులో ఢిల్లీ కోర్టుకు భారీ భద్రత నడుమ పోలీసులు సిసోడియాను తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో మీడియా వారి వద్దకు చేరుకొని ప్రశ్నలు అడుగుతుంటే పోలీస్ అధికారి ఏకే సింగ్ రిపోర్టర్లను దూరంగా నెట్టడానికి ప్రయత్నించారు. కోర్టు ఆవరణలో సిసోడియా విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధానికి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని, మోదీ చాలా అహంకారంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఓ పోలీస్ అధికారి సిసోడియాను మాట్లాడనివ్వకుండా మెడ పట్టుకొని తీసుకెళ్లిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. కేజ్రీవాల్ ఆగ్రహం ఈ వీడియోపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. మనీష్ సిసోడియాతో ఇలా అనుచితంగా ప్రవర్తించే హక్కు పోలీసులకు ఉందా? అని ప్రశ్నించారు. ఇలా చేయమని పైనుంచి (కేంద్రం లోని మోదీ సర్కార్) పోలీసులకు ఆదేశాలొచ్చాయా? అని మండిపడ్డారు. మనీష్‌తో పోలీసుల దురుసు ప్రవర్తన షాక్‌కు గురిచేసిందని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి పేర్కొన్నారు. సిసోడియా పట్ల అనుచితంగా ప్రవర్తించిన అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. क्या पुलिस को इस तरह मनीष जी के साथ दुर्व्यवहार करने का अधिकार है? क्या पुलिस को ऐसा करने के लिए ऊपर से कहा गया है? https://t.co/izPacU6SHI — Arvind Kejriwal (@ArvindKejriwal) May 23, 2023 ఖండించిన పోలీసులు అయితే ఆప్ ఆరోపణలను ఢిల్లీ పోలీస్‌లు కొట్టి పారేశారు. ఇదంతా దుష్ప్రచారంగా పేర్కొన్నారు. వీడియోలో కనిపిస్తున్న పోలీసుల చర్య భద్రత దృష్ట్యా సహజమేనని.. నిందితులు ఎవరైనా మీడియాకు స్టేట్మెంట్లు ఇవ్వడం చట్టవిరుద్ధమని పోలీసులు ట్వీట్ చేశారు. సిసోడియా కస్టడీ పొడిగింపు కాగా, ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి సిసోడియాను పోలీసులు మంగళవారం కోర్టులో హాజరు పరిచారు. రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు జూన్ 1వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. -
లోపలికి తీసుకెళ్లేందుకు ఎలాంటి సాయం చేయని సిబ్బంది
-
విమానం టేకాఫ్ అవుతుందనంగా అది కావాలన్నాడు..అంతే గెంటేశారు
విమానంలో ప్రయాణికుల వికృతి ఘటనలు గురించి తరుచుగా విన్నాం. కానీ ఇప్పుడూ ఒక ప్రయాణికుడు అలా ఏం చేయకపోయినా విమాన నుంచి బయటకు గెంటేశారు. అదీకూడా కేవలం డ్రింక్ చేస్తానని రిక్వెస్ట్ చేసినందుకు విమానం నుంచి బలవంతంగా బయటకు పంపించేశారు. ఈ ఘటన యూఎస్ ఎయిర్‌లైన్స్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..యూఎస్‌లోని ఒక వ్యక్తి విమానం బయలుదేరే ముండు డ్రింక్ చేస్తానని తనకు జిన్ వంటి పానీయం కావాలని అడిగాడు. అంతే అక్కడ ఉన్న సిబ్బంది సదరు వ్యక్తిని విమానం నుంచి దిగిపోమని సీరియస్ అయ్యారు. మొత్తం సిబ్బంది వచ్చి దిగిపోమని పలుమార్లు సూచించారు. అతనికేం అర్థం కాక ఎందుకిలా అంటున్నారని ఆ ఘటనను మొత్తం ఫోన్‌తో వీడియో తీసేందుకు రెడీ అయ్యాడు. అంతే అక్కడ ఉన్న సిబ్బంది, ఫ్లైట్ అటెండెంట్ అతని ఫోన్‌ని లాక్కుని, ఆ వ్యక్తిని బలవంతంగా విమానం నుంచి బయటకు గెంటేశారు. తదనంతరం అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ భద్రతా విభాగం అతన్ని అరెస్టు చేశారు. ఐతే సిబ్బంది అసహనంతో అలా చేశారా లేక ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడో తెలియాల్సి ఉంది. అందుకు సంబంధించిన వీడియో రెడ్ఇట్లో వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్లు మండిపడ్డారు. అతను చిన్నపిల్లాడిలా అలా చేయడం ఆశ్చర్యంగా అనిపించిందని కొందరూ, ఇది అత్యంత అవమానకరం అని మరికొందరూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: కాల్పుల భయంలో అమెరికా..పరుగెత్తండి, దాక్కోండి అంటూ యూనివర్సిటీ హడావిడి..) -
బెంగుళూరులో దారుణం.. పార్కులో నుంచి యువతిని ఊడ్చుకెళ్లి..
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. స్నేహితుడిని కలిసేందుకు పార్క్‌కు వెళ్లిన ఓ యువతిని నలుగురు వ్యక్తులు ఈడ్చుకెళ్లి కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మరుసటిరోజు ఉదయం ఆమెను తమ ఇంటి సమీపంలో విడిచిపెట్టి వెళ్లారు. మార్చి 25న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత ఆదివారం ఓ యువతి తన స్నేహితుడితో కలిసి బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలోగల నేషనల్ గేమ్స్ విలేజ్ పార్కులో కూర్చొని మాట్లాడుతోంది. ఇంతలో ఓ వ్యక్తి వాళ్ల దగ్గరకు వచ్చి.. రాత్రి సమయంలో పార్కులో ఏం చేస్తున్నారంటూ బెదిరించాడు. దాంతో భయపడిన ఆమె స్నేహితుడు.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం ఆ బెదిరించిన వ్యక్తి తన ముగ్గురు స్నేహితులకు ఫోన్ చేసి అక్కడికి రప్పించాడు. నలుగురు కలిసి ఆమెను బలవంతంగా పార్కులోంచి ఈడ్చుకెళ్లి వాళ్ల కారులోకి తోశారు. అనంతరం ఆ వీధుల్లో తిరుగుతూ కదులుతున్న కారులోనే యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మార్చి 26న తెల్లవారుజామున బాధితురాలిని తన ఇంటి సమీపంలో వదిలేసి వెళ్లారు. అంతేగాక అఘాయిత్యం గురించి ఎవరికైనా చెప్పినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా చంపేస్తామని బెదిరించారు. అమిnrso బాధితురాలి ఆరోగ్యం బాలేక పోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తనకు జరిగిన ఘోరాన్నికుటుంబసభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు బెంగుళూరు పోలీస్ అధికారి సీకే బాబా వెల్లడించారు. -
కారు కింద పడి.. 3 కి.మీ. ఈడ్చుకెళ్లి
బుదాన్ (యూపీ): దేశ రాజధాని ఢిల్లీలో కారు కింద పడ్డ యువతిని ఈడ్చుకొని కొన్ని కిలోమీటర్లు వెళ్లిన తరహా ఘటనలు తరచూ జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం మార్నింగ్ వాక్‌కి వెళ్లిన ఒక యువకుడి నిండు ప్రాణాలు ఇలాగే బలయ్యాయి. యూపీ పోలీసులు అందించిన వివరాల ప్రకారం సిరసోలా గ్రామానికి చెందిన 22 ఏళ్ల వయసున్న ఉమేష్ కుమార్ శుక్రవారం ఉదయం మార్నింగ్ వాక్కు బయల్దేరగా వెనుక నుంచి వచ్చిన కారు అతనిని ఢీకొట్టింది. కారు బోనెట్‌పైకి ఎగిరి మళ్లీ కిందపడిన కుమార్ ముందువైపునున్న ఎడమ చక్రంలో ఇరుక్కుపోయారు. అయినా కూడా కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా 3 కి.మీ. ప్రయాణించాడు. దీనిని చూసిన స్థానికులు ఆ కారుని వెంబడించి అతనిని పట్టుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ కుమార్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. పోలీసులు డ్రైవర్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. -
కారును ఢీకొట్టి.. 3 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన భారీ ట్రక్..
-
షాకింగ్ దృశ్యాలు: కారును ఢీకొట్టి.. 3 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన భారీ ట్రక్..
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. వేగంగా దూసుకొచ్చిన 22 చక్రాల భారీ కంటైనర్ ట్రక్.. కారును ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా అందరూ చూస్తుండగానే కారును మూడు కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంలో ట్రక్ మరికొన్ని వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటన మీరట్‌లో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ప్రమాద ఘటనను కొందరు వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కారును ట్రక్ ముందు భాగంతో ఈడ్చుకెళ్లిన దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అయితే అదృష్టం బాగుండి కారులో కూర్చున్న నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. వారిలో ఎవరికి కూడా తీవ్రమైన గాయాలేవి అవ్వలేదు. కారును టక్కు లాక్కెళ్తుండటం చూసి రోడ్డుమీదున్న జనాలు, వాహనదారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వాహనం ఆపమని ఆరిచినా పట్టించుకోకుండా ట్రక్ డ్రైవర్ అలాగే ముందుకు పోనిచ్చాడు. దీంతో స్థానికులు వెంటనే సమాచారంనిచ్చారు. పోలీసులకు రంగంలోకి దిగిన పోలీసులు ట్రక్‌ను వెంబడించి అడ్డగించే వరకు కంటైనర్‌ను ఆపలేదు. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే కారులో ఉన్నవారికి, ట్రక్కు డ్రైవర్‌కు మధ్య జరిగిన ఓ వాగ్వాదంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్‌పై కేసు నమోదుచేశామని, దర్యాప్తు చేస్తున్నామన్నారు. చదవండి: ఈ పెళ్లికొడుకు చాలా రిచ్.. బంధువుల కోసం విమానం బుక్ చేశాడు.. That's #Meerut neighbour of #Ghaziabad. Real life action in #UttarPradeshpic.twitter.com/xxazsrOREV — Arvind Chauhan (@Arv_Ind_Chauhan) February 13, 2023 -
ఢిల్లీ అంజలి సింగ్‌లాంటి ఘటన: పది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి..
ఢిల్లీలో కొత్తడేది రోజున జరిగిన అంజలి యాక్సిడెంట్ ఘటన మరువక ముందే అలాంటిదే మరో ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఒక వ్యక్తిని ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మధురలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో బాధితుడు గుర్తుపట్టలేనంత స్థితిలో దారుణంగా గాయపడి మృతి చెందాడు. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..ఒక వ్యక్తి సోమవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తిన ఢీ కొట్టి 10 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు.. ఈ ఘటనను మథురలోని యమునా ఎక్స్‌ప్రెస్ హైవే వద్ద ఉన్న టోల్ బూత్ వద్ద ఉన్న భద్రతా సిబ్బంది గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఆ పరిసరా ప్రాంతాల్లోని సీసీఫుటేజ్‌లు పరిశీలించి..సదరు వ్యక్తిని ఢిల్లీ నివాసి వీరేంద్ర సింగ్‌గా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు పోలీసులు. అతను ఆగ్రా నుంచి నోయిడాకు బయలు దేరుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఐతే అతను విచారణలో సోమవారం రాత్రి దట్టమైన మంచు ఉండటంతో తాను గమనించలేకపోయానని చెబుతున్నాడని పోలీసులు తెలిపారు. అంతేగాదు తనకు ఆ దట్టమైన మంచు కారణంగా ఢీ కొట్టినట్లు కూడా తెలియలేదని, కారు కింద ఇరుక్కున్నట్లు గమనించలేకపోయినట్లు వివరించాడు. ఐత ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి ఎవరో తెలియాల్సి ఉందని చెప్పారు పోలీసులు. అతడిని గుర్తించేందుకు సమీప ప్రాంతంలోని సీసీ కెమెరాలను ముమ్మరంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. (చదవండి: 'నిజమైన స్నేహితుడికి అర్థం భారత్': ధన్యావాదాలు తెలిపిన టర్కీ) -
కారును ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ట్రక్కు.. ఆరుగురు దుర్మరణం..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ఉన్నావ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. లక్నో-కాన్పూర్ హైవేపై ఓ కూడలి వద్ద కారును ట్రక్కు ఢీకొట్టింది. రోడ్డుపై ఉన్న మరో ముగ్గురిపైకి కూడా దూసుకెళ్లింది ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ట్రక్కును కారును ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లిందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత కారు ఓ గుంతలో పడిందని పేర్కొన్నారు. మృతుల్లో ముగ్గురు ఓకే కుటుంబానికి చెందిన వారని వివరించారు. మరో ఇద్దరు తల్లికూతుళ్లు ఉన్నారని పేర్కొన్నారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఆరుగురు చనిపోవడంతో స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ట్రక్కు డ్రైవర్‌ను అరెస్టు చేయాలని వైరు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. రెండు గంటలపాటు రహదారిని దిగ్భందించారు. పోలీసులు వచ్చి హామీ ఇవ్వడంతో ఆందోళనలు విరమించారు. ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నాడని త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు. చదవండి: చిరుత దాడి.. ఇంటికి వస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి చంపేసిన వైనం -
కారుపై యువకుడు.. కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన యువతి
క్రైమ్: అంజలి సింగ్ ఘటన దేశాన్ని కుదిపేసి నెల గడవక ముందే.. దాదాపు ఆ తరహా ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ దాదాపు అలాంటి ప్రమాదం నుంచే బయటపడ్డారు. ఇదిలా ఉంటే.. శుక్రవారం బెంగళూరులో ఓ వ్యక్తిని కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్లింది ఓ యువతి. బెంగళూరు జ్ఞానభారతి నగర్లో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రియాంక అనే యువతి.. తన వాహనంపై దర్శన్ అనే యువకుడిని కిలోమీటర్ పైనే దూరం ఈడ్చుకెళ్లింది. అంతకు ముందు ఇద్దరి కార్లు యాక్సిడెంట్‌కి గురికావడం, పరస్పర వాగ్వాదం తర్వాతే ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు పోలీసులు ధృవీకరించారు. టాటా నెక్సన్ వాహనంలో దూసుకొచ్చిన ప్రియాంక తన మారుతీ సుజుకీ స్విఫ్ట్ కారును ఢీ కొట్టింది. దీంతో కారులోని దర్శన్.. ఆమెను బయటకు రావాలంటూ వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఆమె అసభ్య సైగ(మధ్య వేలు చూపించడంతో) చేయడం వివాదం మరింత ముదిరింది. దర్శన్ మాట లెక్కచేయకుండా ఆమె కారును ముందుకు పోనిచ్చే ప్రయత్నం చేసింది. దీంతో బానెట్‌పై వేలాడుతూ అలాగే ఉండిపోయాడు దర్శన్. కారు ఆపమని చుట్టుపక్కల జనాలు, వాహనదారులు మొత్తుకున్నా.. ఆమె పట్టించుకోకుండా ముందుకు వెళ్లింది. ఆపై కిలోమీటర్ పైనే వెళ్లాక.. కారు స్లో కాడంతో అతను పక్కకు దూకేశాడు. కాస్త ముందుకు వెళ్లాక ఉల్లాల్ రోడ్లో ప్రియాంక కారు ఆపగా.. తన స్నేహితుల సాయంతో ఆ కారును ధ్వంసం చేశాడు దర్శన్. ఆపై ఇరువురు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసులు నమోదు అయ్యాయి. హత్యాయత్నం అభియోగం కింద ప్రియాంకపై కేసు నమోదు కాగా, దర్శన్‌తో పాటు మరో ముగ్గురిపై.. యువతిని వేధించడం, దాడి చేయడం లాంటి అభియోగాలపై కేసు నమోదు చేసినట్లు డీసీపీ (ట్రాఫిక్ వెస్ట్) వెల్లడించారు. Another incident of dragging in #Bengaluru, a woman has dragged a man sitting on her SUV’s bonnet for 3 km in Ullal Main Road, Jnanabarathi on Friday morning in a road rage. A case & counter case has been filed against the woman and the man climbing SUV bonnet.@DeccanHerald pic.twitter.com/ZV4Qm2d6AD — Chaithanya (@ChaithanyaSwamy) January 20, 2023 -
దేవుడే నన్ను రక్షించాడు: లైంగిక వేధింపులపై స్వాతి మలివాల్
ఢిల్లీ: ప్రముఖ ఉద్యమకారిణి, మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ భయానక అనుభవం ఎదుర్కొన్నారు. ఓ యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన చంపిన ఘటన తర్వాత.. ఢిల్లీలో మహిళల భద్రతను పర్యవేక్షించేందుకు స్వయంగా రంగంలోకి దిగారు ఆమె. అయితే.. ఈ ప్రయత్నంలో కారులో తప్పతాగి వచ్చిన ఓ వ్యక్తి నడిరోడ్డుపై ఆమెను లైంగికంగా వేధించడంతో పాటు ప్రతిఘటించడంతో కొద్దిదూరం అతని కారుతో సహా లాక్కెల్లాడు. ఈ ఘటన నుంచి ఆమె సురక్షితంగా బయటపడగా.. ఆమె ఆ భయానక అనుభవాన్ని పంచుకున్నారు. అంజలి సింగ్ ఘటన తర్వాత.. ఢిల్లీలో మహిళల భద్రతపై తన బృందంతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు డీసీడబ్ల్యూ చైర్పర్సన్ స్వాతి మలివాల్. ఈ క్రమంలో.. బుధవారం అర్ధరాత్రి మూడు గంటల తర్వాత ఎయిమ్స్ వద్ద కాలిబాటలో ఆమె నిల్చున్నారు. అంతలో ఓ బాలెనో కారులో దూసుకొచ్చిన వ్యక్తి.. ఆమెను చూసి ఆగిపోయాడు. కారులో ఎక్కమంటూ ఆమెను బలవంతం చేయబోయాడు. ఆమె నిరాకరించడంతో అక్కడి నుంచి కొంతదూరం వెళ్లి.. యూటర్న్ తీసుకుని మళ్లీ వచ్చాడు. మరోసారి కారు ఎక్కమంటూ ఆమెను కోరగా.. ఆమె అతన్ని కిటీకి నుంచి బయటకు లాగే యత్నం చేసింది. అయితే.. కిటీకిని క్లోజ్ చేయడంతో ఆమె చెయ్యి అందులో ఇరుకుపోయింది. అలా.. 15 మీటర్లపాటు కారు దూసుకెళ్లగా, ఆమె కిటికీలోంచి చెయ్యిని విడిపించుకుంది. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న టీం ఆమెకు సాయంగా వచ్చారు. ఆపై సదరు వ్యక్తి మీద ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవుడే తనను రక్షించాడని, ఢిల్లీలో ఒక మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కే ఇలా జరిగితే.. పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చని ఆమె ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తిని నలభై ఏడేళ్ల హరీశ్‌చంద్రగా గుర్తించి.. కారును సీజ్ చేశారు. कल देर रात मैं दिल्ली में महिला सुरक्षा के हालात Inspect कर रही थी। एक गाड़ी वाले ने नशे की हालत में मुझसे छेड़छाड़ की और जब मैंने उसे पकड़ा तो गाड़ी के शीशे में मेरा हाथ बंद कर मुझे घसीटा। भगवान ने जान बचाई। यदि दिल्ली में महिला आयोग की अध्यक्ष सुरक्षित नहीं, तो हाल सोच लीजिए। — Swati Maliwal (@SwatiJaiHind) January 19, 2023 కొత్త సంవత్సరం రోజున.. స్నేహితురాలితో స్కూటీ మీద వస్తున్న అంజలి సింగ్(20)ను ఢీ కొట్టారు దుండగులు. ఆపై సుల్తాన్‌పురి నుంచి కంఝావాలా మధ్య పదమూడు కిలోమీటర్లపాటు ఆమె శరీరాన్ని ఈడ్చుకుంటూ వెళ్లారు. ఈ ఘోర ఘటనలో ఆమె అక్కడికక్కడే చనిపోగా.. దేశవ్యాప్తంగా ఈ హిట్ అండ్ రన్ కేసు చర్చనీయాంశంగా మారింది. -
బైకర్‌ను ఢీకొట్టి 1.5 కిమీ ఈడ్చుకెళ్లిన ఆటో డ్రైవర్.. అరుస్తున్నా ఆపకుండా..
పాట్నాా: బిహార్ సహర్సా జిల్లాలో ఢిల్లీ తరహా ఘటన జరిగింది. ఓ ఆటో డ్రైవర్ బైకర్‌ను ఢీకొట్టి 1.5 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు. ఆపమని అరుపులు, కేకలు పెట్టినా పట్టించుకోకుండా అలాగే వేగంగా ఆటోను పోనిచ్చాడు. చివరకు ఓ చోట ఆటో ఆపి బైకర్‌ను రోడ్డు పక్కన పడేసి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావమైన అతడ్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బైకర్ పరిస్థితి విషమంగా ఉందని, అతని కుడి కాలు తీవ్రంగా దెబ్బతిందని వైద్యులు తెలిపారు. అవసరమైతే కాలును పూర్తిగా తొలగించాల్సి రావచ్చని పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడ్డ బైకర్‌ను కోమల్ కిషోర్ సింగ్(25)గా గుర్తించారు. ఇతడు మంగళవారం తన స్వాగ్రామం హేంపూర్ వెళ్తుండగా బిహ్రా బ్రహాం ఆస్థాన్ వద్ద ఆటో ఢీకొట్టింది. దీంతో అతను ఆటో కిందే ఇరుక్కుపోయాడు. అయితే ఆటో డ్రైవర్ మాత్రం అక్కడి నుంచి పారిపోవాలని వాహనాన్ని అలాగే పోనిచ్చాడు. 1.5 కిలోమీటర్లు కిశోర్‌ను ఈడ్చుకెళ్లాడు. స్థానికులు ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. చివరకు బైకర్‌ను రోడ్డపక్కన పడేసి ఆటోడ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. ఢిల్లీలో జనవరి 1న అంజలి అనే యువతిని కారు ఢీకొట్టి 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో యువతి దారుణంగా చనిపోయింది. పోలీసులు నిందితులను గంటల్లోనే అరెస్టు చేశారు. చదవండి: ఈ పెళ్లికూతురు చాలా స్మార్ట్.. కారు వదిలి మెట్రోలో పెళ్లి మండపానికి.. -
75 ఏళ్ల వృద్ధుడిని స్కూటీతో ఈడ్చుకెళ్లిన యువకుడు
-
పట్టపగలే దారుణం..వృద్ధుడిని బైక్‌తో ఈడ్చుకెళ్లి..
బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కారుని ర్యాష్‌గా వచ్చి ఢీ కొట్టి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ కారు యజమాని వృద్ధుడుని ఆపేందుకు యత్నించాడంతో ఈడ్చుకెళ్లిపోయాడు. దీంతో పలువురు అతన్ని వెంబడించి అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. వివరాల్లోకెళ్తే..బెంగళూరులోని ముత్తప్ప అనే వ్యక్తి కారుని సాహిల్ అనే వ్యక్తి బైక్‌తో ఢీ కొట్టాడు. దీంతో ఆ వ్యక్తి కారులోంచి దిగి మాట్లాడాదాం అనుకుంటుండగా.. సాహిల్ తన బైక్‌తో పారిపోయేందుకు యత్నించాడు. ఐతే వృద్ధుడు అతన్ని ఆపాలనే ఉద్దేశంతో అతని బైక్ బ్యాక్ సైడ్ గట్టిగా పట్టుకున్నాడు. కానీ సాహిల్ వృద్ధుడన్న కనికరం లేకుండా బైక్‌ని ఆపకుండా ఈడ్చు కెళ్లిపోయాడు. పట్టపగలే అందరూ చూస్తుండగా 71 ఏళ్ల వృద్ధుడుని దాదాపు ఒక కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్లాడు. ఇంతలో అటుగా వస్తున్న ఆటో రిక్షా వాలా, ఒక ద్విచక్ర వాహనదారుడు ఆ వ్యక్తిని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనలో ఆ వృద్ధుడి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. click here: viral Video (చదవండి: జల్లికట్టు పోటీలో అపశ్రుతి..నలుగురు మృతి) -
ఢిల్లీలో దారుణం: కారుతో ఢీకొట్టి.. బానెట్‌పై అర కిలోమీటర్ లాక్కెళ్లి
న్యూఢిల్లీ: ఢిల్లీ నగరం ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. గత కొంతకాలంగా హస్తీనాలో నేర సంఘటనలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. యాధృచికంగా, ఉద్ధేశపూర్వంగా జరిగినా యాక్సిడెంట్లు, హత్యలు వంటి కేసులతో దేశ రాజధాని నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల దేశం మొత్తం ఉల్కికి పడేలా చేసిన కంఝూవాలా కారు ప్రమాదం(కారుతో ఢీకొట్టి అంజలి అనే యువతిని ఈడ్చుకెళ్లిన ఘటన) తరువాత అలాంటి కోవకే చెందిన దారుణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా ఢిల్లీలో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ ఢిల్లీలోని రాజౌరి గార్డెన్ ప్రాంతంలోని రోడ్డుపై ఇద్దరి వ్యక్తుల మధ్య హారన్ విషయంలో గొడవ తలెత్తింది. వాగ్వాదం పెరిగి పెద్దదవడంతో.. ఓ వ్యక్తి కోపంతో తన కారుతో ఢీకొట్టాడు. దీంతో ఆ వ్యక్తి కారు బానెట్‌పై పడటంతో అలాగే 500 మీటర్లు(అర కిలోమీటరు) లాక్కెళ్లాడు. ఈ భయంకర దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు ఈ ఘటనపై ఏపీసీ సెక్షన్లు 279, 323, 341, 308 కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ కారు నెంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఏ విషయంలో గొడవ జరిగింది, అసలు ఏం జరిగిందనే దానిపై బాధితుడి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. #WATCH | A man was dragged on car's bonnet in Delhi's Rajouri Garden(12.01) An incident of road rage occured that led to incident shown in video. Case registered under IPC sec 279, 323, 341, 308. Accused identified, being interrogated: Delhi Police (Visuals confirmed by Police) pic.twitter.com/RdVGuU7QXL — ANI (@ANI) January 14, 2023 -
సైకిల్‌ను ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన కారు.. ఎంత అరిచినా..!
లఖ్‌నవూ: దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో అంజలి సింగ్ అనే యువతిని ఓ కారు ఢీకొట్టి 13 కిలోమీటర్లు లాక్కెళ్లిన ఘటన తరహాలోనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని హర్దోయ్ ప్రాంతంలో జరిగింది. సైకిల్‌పై వెళ్తున్న ఓ విద్యార్థిని ఢీకొట్టిన కారు సుమారు కిలోమీటర్ ఈడ్చుకెళ్లింది. కారును ఆపాలని స్థానికులు ఎంత అరిచినా అలాగే వేగంగా దూసుకెళ్లాడు డ్రైవర్. ప్రస్తుతం ఈ ఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కొత్వాలి నగర పరిధికి చెందిన కేతన్ అనే విద్యార్థి కోచింగ్ సెంటర్‌కు వెళ్లేందుకు సైకిల్‌పై బయలుదేరాడు. కొద్ది దూరం వెళ్లిన క్రమంలో కారు వెనకనుంచి ఢీకొట్టింది. దీంతో అతడి కాలు కారు వెనకాల బంపర్‌లో చిక్కుకుపోయింది. అలాగే సుమారు కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లాడు కారు డ్రైవర్. కేతన్‌ను గమనించిన స్థానికులు కారును ఆపేందుకు పెద్దగా అరస్తూ వెంట పరిగెత్తారు. కిలోమీటర్ వెళ్లాక ఆపడంతో డ్రైవర్‌ను బయటకి లాగి చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికులను చెదరగొట్టి డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. బాధితుడిని స్థానిక వైద్య కళాశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. #Hardoi में सड़क पर साइकिल सवार छात्र को घसीटते हुए ले गई कार @Manchh_Official pic.twitter.com/6jkBTuGkOS — पत्रकार Rishabh Kant (@KantChhabra) January 7, 2023 ఇదీ చదవండి: యువతిని ఈడ్చుకెళ్లిన ఘటనలో మరో ట్విస్ట్.. గొడవ పడ్డ అంజలి, నిధి -
Delhi: దారుణానికి ముందు గొడవ పడ్డ అంజలి, నిధి
న్యూఢిల్లీ: ఢిల్లీలో అంజలీ సింగ్ అనే యువతిని కారు ఢీకొట్టి, 12 కిలోమీటర్లు లాక్కెళ్లిన ఘటనలో మరికొన్ని విషయాలు వెలుగుచూశాయి. డిసెంబర్ 31వ తేదీ రాత్రి అంజలి స్కూటీపై ఆమె స్నేహితురాలు నిధి కూడా ఉన్నట్లు తేలింది. అయితే, అంతకుముందు వారిద్దరూ డబ్బు విషయమై ఘర్షణకు కూడా దిగినట్లు అంజలి స్నేహితుడొకరు వెల్లడించాడు. ఈ కేసులో నిందితులను కాపాడేందుకు యత్నిస్తున్నట్లు అనుమానాలున్న అశుతోష్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. మరో అనుమానితుడు అంకుశ్ ఖన్నా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇలా ఉండగా, మృతురాలు అంజలీ సింగ్ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందజేయనున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పారు. ఇదీ చదవండి: అంజలి ఘటనతో అట్టుడుకుతున్న ఢిల్లీ.. మహిళా కమిషన్ చైర్మన్ కీలక వ్యాఖ్యలు -
Kanjhawala Case:‘సాక్ష్యాలను దాచేందుకు ప్రయత్నం.. సీబీఐకి అప్పగించాలి’
Delhi Horror: ఢిల్లీ కారు ప్రమాదంలో మృతిచెందిన అంజలి సింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశం మొత్తాన్ని కుదిపేసిన ఈ ఘటనలో తవ్వేకొద్ది అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సరైన సమయంలో ఢిల్లీ పోలీసులు స్పందించలేదంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు నిరసనలతో ఢిల్లీ అట్టుడుకుతోంది. నిందితులకు ఉరితీయాలని కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. సుల్తాన్‌పురి కారు ప్రమాద కేసులో పోలీసుల విచారణ సంతృప్తి కరంగా లేదంటూ ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్ ఎస్ మలివాల్ మండిపడ్డారు. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు నిధి ఫోన్ స్వాధీనం చేసుకోలేదని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. అది ఈ కేసులో చాలా ముఖ్యమైన సాక్షం. ఇందులో పోలీసుల వైఫల్యం కనిపిస్తుంది. పోలీసుల వైఫల్యం పోలీసులు ఇప్పటికీ యువతి మృతదేహాన్ని ఈడ్చుకెళ్లిన 13 కిలోమీటర్ల దూరంలోని అన్నీ సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించలేదు. 164 సీఆర్పీసీ ప్రకారం ప్రత్యక్ష సాక్షులు స్టేట్మెంట్ను రికార్డ్ చేయలేదు. కారు చక్రాల కింద యువతి మృదేహం చిక్కుకుందని ఉదయం 2.22 నిమిషాలకు పోలీసులుకు సమాచారం వచ్చింది. కానీ పోలీసులు ఉదయం.4.15 నిమిషాలకు నగ్న స్థితిలో ఉన్న మహిళ మృతదేహం రోడ్డుపై పడి ఉన్నట్లు సమాచారం అందుకున్న తర్వాతే చర్యలు ప్రారంభించారు. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని సిఫార్సు చేస్తున్నాను’ అని పేర్కొన్నారు. 18 బృందాలుగా కాగా అంజలి సింగ్ కేసుపై ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ.. దీనిపై 18 బృందాలు పనిచేస్తున్నాయని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారు అశుతోష్‌కు చెందినదిగా.. యాక్సిడెంట్ సమయంలో అమిత్ కారు డ్రైవ్ చేసినట్లుగా గుర్తించారు. ఈ కేసులో మరో ఇద్దరి(అశుతోష్, అంకుష్) ప్రయేయం ఉన్నట్లు పేర్కొన్నారు. వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. వీరిద్దరూ మిగతా అయిదుగురు నిందితులకు స్నేహితులని పేర్కొన్నారు. అయితే వీరు ప్రమాద సమయంలో కారులో లేరని, మిగిలిన ఐదుగురు నిందితులను రక్షించేందుకు ఇద్దరూ ప్రయత్నించారని పేర్కొన్నారు. ఏ సంబంధం లేదు నిందితులకు మృతురాలు, ఆమె స్నేహితురాలు నిధితో ఎలాంటి సంబంధం లేదని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. నిందితులు అనేక సాక్ష్యాలను దాచేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. వీలైనంత త్వరలో ఈ కేసులో చార్జీషీట్ దాఖలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇద్దరు కొత్త నిందితులు సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. నిందితులకు నార్కో అనాలసిస్ టెస్ట్ చేయాలని భావిస్తున్నారని పేర్కొన్నారు. నిందితుల్లో ఒకరు కారు కింద అంజలి మృతదేహాన్ని గమనించి అక్కడి నుంచి ఆటోలో పరారయ్యాడని, అంజలి ఫోన్ ఇప్పటి వరకు దొరకలేదని వెల్లడించారు. చదవండి: యూపీ సీఎం కాషాయ దుస్తులపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. #StandWithAnjali@priyanktripathi shares more information about Ashutosh, the main owner of the car involved in the death of Anjali.@Aditi14Bhardwaj dissects the details emerging from the latest CCTV footage which shows the accused getting down & checking the car. pic.twitter.com/PiRaH6j83d — TIMES NOW (@TimesNow) January 5, 2023 -
ఢిల్లీ తరహా దారుణం.. బైక్‌ని ఢీ కొట్టి లాక్కెళ్లిన ట్రక్కు..విద్యార్థి మృతి
సాక్షి, భోపాల్: ఢిల్లీ మహిళను కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన మరువక మునుపే అచ్చం అలాంటి తరహ మరోక ఘటన చోటు చేసుకుంది. అదేవిధంగా మధ్యప్రదేశ్‌లో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థి మృతి చెందింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో చోటు చేసకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...బాధితురాలు మధ్యప్రదేశ్‌లోని షాదోల్ నివాసి రూబీ థాకూర్. ఆమె జబల్పూర్లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీస్ చదువుతోంది. ఆమె తన క్లాస్మేట్ సౌరవ్ ఓజా అనే అబ్బాయితో కలసి జబల్పూర్కి 35 కిలోమీటర్లు దూరంలో ఉన్న భేదాఘాట్ జలపాతాన్ని చూసేందుకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ఒక పెద్ద ట్రక్కు వారిని దారుణంగా ఢీ కొట్టింది. ఐతే బాధితురాలు రూబీ వెనుక కూర్చొని (పిలియన్ రైడర్)వెనుక కూర్చొని ఉండగా, బైక్‌ని అతని క్లాస్మేట్ సౌరవ్ డ్రైవ్ చేశాడు. ఈ ఘటనలో సౌరవ్ 20 మీటర్ల దూరంలో పడిపోగా, రూబీ శరీరం ట్రక్‌లో చిక్కుకుపోవడంతో.. సుమారు 100 మీటర్లు ఈడ్చకుని పోయింది. దీంతో శరీరం నుజ్జునుజ్జు అయినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. గాయపడిని సౌరవ్‌ని ప్రభుత్వా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, కానీ అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఐతే దర్యాప్తులో హెవీలోడ్ ట్రక్కు వారి బైక్‌ని వెనుక నుంచి ఢీ కొట్టినట్లు తేలిందని, ఆ ట్రక్కుని కూడా గుర్తించమని వెల్లడించారు. తాము నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: అంజలి సింగ్ కేసులో ట్విస్ట్.. ఐదుగురు కాదు మరో ఇద్దరు ఉన్నారటా!) -
Delhi: అంజలి సింగ్ కేసులో మరో ఇద్దరి ప్రమేయం!
న్యూఢిల్లీ: దేశ రాజధాని నడిబొడ్డున దారుణ రీతిలో ప్రాణం పోగొట్టుకున్న అంజలి సింగ్(20) కేసు కీలక మలుపులు తిరుగుతోంది. పీకలదాక మద్యం సేవించి యువతి ప్రాణాలు కోల్పోయేందుకు కారణమైన ఐదుగురిని ఇప్పటికీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో మరో ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సీటీటీవీ దృశ్యాల ఆధారంగా ఈ కేసుకు సంబంధం ఉందని అనుమానిస్తున్న ఆశుతోశ్, అంకుశ్‌లను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఢిల్లీ పోలీసులు గురువారం వెల్లడించారు. ‘కస్టడీలో ఉన్న ఐదుగురు కాకుండా మరో ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. మా వద్ద సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయి. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు వారు ప్రయత్నాలు చేశారు.’అని వెల్లడించారు సీనియర్ పోలీసు అధికారి సాగర్‌ప్రీత్ హుడా. కారు నడిపినట్లు మొదటి నుంచి భావిస్తున్న దీపక్ ఖన్నా కాదని, అమిత్ ఖన్నాగా పేర్కొన్నారు. అమిత్‌కు డ్రైవింగ్ లైసెన్స్ లేదని గుర్తించినట్లు చెప్పారు. #दिल्ली - कंझावला मामले में एक और नया सीसीटीवी आया सामने, जिसमें पांचो अरोपी कार से उतरते नज़र आए...#Delhiaccident #DelhiPolice #KanjhawalaDeathCase #Kanjhawala #Delhi #Delhiaccident #Nidhi #Kanjhawala #kanjhawalaaccident #Kanjhawala_girl_accident #KanjhawalaHorror pic.twitter.com/0qqrjlNw2N — TheuttarpradeshNews.com (@TheUPNews) January 5, 2023 ఇదీ చదవండి: అంజలి సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్!.. నిధి అసలు ఫ్రెండే కాదట! -
అదే దారుణం: బైక్‌ను ఢీకొట్టి లాక్కెళ్లిన కారు.. డెలివరీ ఏజెంట్ మృతి
లఖ్‌నవూ: సంచలనం సృష్టించిన ఢిల్లీ ఘటన తరహాలోనే ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ జరిగిన ఓ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి అతి సమీపంలోని నోయిడాలో నూతన ఏడాది వేడుకల వేళ ఓ డెలివరీ ఏజెంట్‌ను ఓ కారు ఢీకొట్టి 500 మీటర్లు లాక్కెళ్లినట్లు పోలీసులు తెలిపారు. దీంతో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు స్విగ్గీలో డెలివరీ ఏజెంట్‌గా పని చేస్తున్న కౌషల్‌గా గుర్తించారు. నూతన ఏడాది రాత్రి డెలివరీ ఇచ్చేందుకు వెళ్లాడు కౌషల్. నోయిడా సెక్టార్ 14లోని ఫ్లైఓవర్ సమీపంలో అతడి ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. సుమారు 500 మీటర్ల మేర లాక్కెళ్లింది. కౌషల్ మృతదేహాన్ని గమనించిన కారు డ్రైవర్ సమీపంలోని ఆలయం వద్ద కారును నిలిపేసి అక్కడి నుంచి పారిపోయాడు. కౌషల్ సోదరుడు అమిత్ బాధితుడికి ఆదివారం రాత్రి 1 గంటకు ఫోన్ చేశాడు. ఆ ఫోన్‌ను సంఘటనా స్థలంలో ఉన్న ఓ వ్యక్తి మాట్లాడి జరిగిన విషయాన్ని చెప్పాడు. అమిత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టామని తెలిపారు. ఇదీ చదవండి: షాకింగ్.. స్కూటీపై వెళ్తున్న టీచర్‌ను ఢీకొట్టి 3 కి.మీ ఈడ్చుకెళ్లిన ట్రక్కు.. -
‘రక్తమోడుతున్నా ఈడ్చుకెళ్లారు’.. ఢిల్లీ దారుణంపై ప్రత్యక్ష సాక్షి
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో యువతిని స్కూటీతో పాటు కారు కింద కిలోమీటర్ల మేరకు ఈడ్చి పొట్టన పెట్టుకున్న దారుణ ఘటనకు సంబంధించి మరిన్ని నివ్వెరపరిచే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కారు ఢీకొనడంతో చక్రాల కింద ఇరుక్కుని, కాపాడండంటూ ఆర్తనాదాలు చేస్తున్నా కనికరం లేకుండా నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకెళ్లారని నిధి అనే ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. మృతురాలు అంజలీ సింగ్‌కు ఆమె స్నేహితురాలే. ఘటన జరిగినప్పుడు అదే స్కూటీపై అంజలీ వెనక కూచొని ఉంది. స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడింది. షాక్‌తో ఘటన వివరాలను ఆమె ఇంతవరకూ బయట పెట్టలేదు. స్కూటీపై మరో మహిళ ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజీలో గుర్తించిన పోలీసులు ఆరా తీసి ఆమె వాంగ్మూలం నమోదుచేశారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి జరిగిన దారుణం గురించి నిధి వెల్లడించారు. ‘‘మా పరిచయమై 15 రోజులే అయినా మంచి స్నేహితులమయ్యాం. కొత్త ఏడాది వేడుక కల్సి చేసుకుందామనుకున్నాం. హోటల్లో పార్టీ తర్వాత 2 గంటలపుడు బయటకొచ్చి స్కూటీపై వెళ్తున్నాం. ఎదురుగా వస్తున్న కారు హఠాత్తుగా మమ్మల్ని ఢీకొట్టింది. నేను పడిపోయా. కానీ అంజలీ కారు చక్రాల్లో ఇరుక్కుని రక్తమోడుతూ సాయం కోసం అరిచింది. అయినా వాళ్లు వేగంగా అలాగే ఆమెను కారుతో పాటుగా ఈడ్చుకెళ్లారు. వెంటనే ఆపితే ఆమె కచ్చితంగా బ్రతికేది. చక్రాల్లో ఆమె ఇరుక్కుందని తెలిసీ నిర్దయగా అలాగే వెళ్లిపోయారు. ఆ దారుణాన్ని చూసిన షాక్‌లో ఈ విషయం ఎవరికీ చెప్పలేదు’’ - నిధి, బాధితురాలి స్నేహితురాలు, ప్రత్యక్ష సాక్షి అయితే స్కూటీ ఎక్కడానికి ముందు హోటల్ బయట వారిద్దరూ గొడవ పడుతున్నట్టు మరో వీడియో కూడా వైరల్ అవుతోంది. నిధి నుంచి ఏదో లాక్కోవడానికి అంజలి ప్రయత్నిస్తున్నట్టు అందులో కనిపిస్తోంది. బహుశా స్కూటీని ఎవరు నడపాలనే విషయమై వారు వాదించుకున్నారని భావిస్తున్నారు. కాగా ఈ కేసులో అత్యాచారం ఆనవాళ్లు లేవని పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. తల, వెన్నెముక, మొండెం కింది అవయవాలకు తీవ్ర గాయాలవడంతో అంజలీ మరణించినట్టు నివేదిక పేర్కొంది. నిందితులు ఆమెను రేప్ చేసి చంపేశారనే ఆరోపణల నేపథ్యంలో మెడికల్ బోర్డు పర్యవేక్షణలో పోస్ట్‌మార్టం జరిగిందని ఢిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్ సాగర్ ప్రీత్ హూడా చెప్పారు. ఝౌంతీ గ్రామంలో నగ్నంగా పడి ఉన్న యువతి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం, నిందితులను అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకోవడం తెల్సిందే. కేసును నీరుగారుస్తున్నారు: ఆప్ దర్యాప్తు వేగంగా ముగించి దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలంటూ ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు ‘ఆప్’ ఎమ్మెల్యేల బృందం వినతిపత్రం ఇచ్చింది. మృతురాలి కుటుంబానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రూ.10 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. కేంద్రం సీరియస్ ఘటనపై కేంద్రం సీరియస్‌గా ఉంది. సమగ్ర నివేదిక ఇవ్వాలని ఢిల్లీ పోలీసులను కేంద్ర హోం శాఖ ఆదేశించింది. దాంతో స్పెషల్ కమిషనర్ శాలినీ సింగ్ నేతృత్వంలో ఢిల్లీ పోలీస్ విభాగం దర్యాప్తు సంఘాన్ని ఏర్పాటుచేసింది. ఘటన సమయంలో ఇద్దరు నిందితులు తాగి ఉన్నట్లు వార్తలొచ్చాయి. వారి రక్త నమూనాలను పరీక్షకు పంపారని, రిపోర్టులు రావాల్సి ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కుటుంబానికి ఏకైక దిక్కు మృతురాలు అంజలి తన కుటుంబానికి ఏకైక పెద్ద దిక్కు. తండ్రి ఎనిమిదేళ్ల క్రితమే మరణించాడు. అక్కకు పెళ్లయింది. దాంతో అమ్మ, ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లను ఆమే పోషిస్తోంది. ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తూ వారికి ఆసరాగా నిలుస్తోంది. మూత్రపిండాలు దెబ్బ తిన్న తల్లికి తరచూ డయాలసిస్ అవసరం. ఇదీ చదవండి: ఢిల్లీ సుల్తాన్‌పురి ఘటన: అంజలితో పాటు మరో యువతి కూడా!.. పోలీసులు పట్టించుకోలేదా? -
అంజలి కారు ముందు పడిపోయింది.. భయంతో పారిపోయా: స్నేహితురాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అంజలి(20) అనే యువతిని కారుతో ఢీకొట్టి లాక్కెళ్లిన ఘటనలో ఆమెతోపాటు తన స్నేహితురాలు కూడా ఉన్నట్లు తేలింది. ఇప్పటి వరకు కారు ఢీకొట్టిన సమయంలో అంజలి ఒకరే ఉన్నారని అనుకున్నారు కానీ హోటల్ ముందు ఉన్న సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా పార్కింగ్ నుంచి స్కూటీ తీస్తుండగా పక్కన మరో యువతి కూడా కనిపించింది. ఆమే అంజలి స్నేహితురాలు నిధి. ఇద్దరు స్నేహితులు శనివారం సాయంత్రం సుల్తాన్‌పురిలో న్యూ ఇయర్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఆదివారం తెల్లవారుజామున 1.45 గంటలకు హోటల్ నుంచి అంజలి స్కూటర్‌పై బయలుదేరారు. ముందుగా స్కూటీ డ్రైవ్ చేసే విషయంలో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. టూవీలర్‌ను మొదట నిదీనే డ్రైవ్ చేయగా కొంత సమయం తర్వాత అంజలి డ్రైవింగ్ తీసుకుంది. నిధి వెనకాల కూర్చుంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో మద్యం మత్తులో అయిదుగురు వ్యక్తులతో వెళ్తున్న కారు స్కూటీని ఢీకొట్టింది. దీంతో అంజలి కారు ముందు పడిపోగా.. నిధి మరోవైపు పడింది. అదృశవశాత్తు ఆమెకు గాయాలేవి అవలేదు. కానీ అంజలి కారు ముందు చక్రాల్లో ఇరుక్కుపోయింది. దీంతో ఆమెను కారుతోపాటే వీధుల గుండా 13 కిమీ ఈడ్చుకెళ్లారు. #WATCH | Kanjhawala death case: CCTV footage of that night shows the presence of another girl with the girl who died after being dragged for a few kilometres by a car that hit her in Sultanpuri area. (CCTV visuals confirmed by police) pic.twitter.com/nd1NUBQVze — ANI (@ANI) January 3, 2023 డ్డ్రైవర్ తప్పిదం వల్లే నిధిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణకు ఆమె సహకరిస్తోందని తెలిపారు. మంగళవారం నిధిని పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. ప్రమాదం జరిగిన తర్వాత భయంతో అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిపింది. భయంతో ప్రమాదం గురించి ఎవరికీ చెప్పలేదని ఆమె పేర్కొన్నారు. కారు డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ఘటన జరిగినట్లు నిధి కోర్టులో వాంగ్మూలం ఇచ్చింది. స్కూటర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని నిందితులు పేర్కొన్నారు. మరోవైపు ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని నిందితుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు సైతం ప్రకటించారు. అత్యాచారం జరగలేదు మరోవైపు అంజలిపై హత్యాచారం జరిగినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఢిల్లీ ఆందోళనలు చేపట్టారు. అయితే అంజలిపై అత్యాచారం జరగలేదని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఇక కారు డ్రైవ్ చేసిన వ్యక్తితోపాటు మొత్తం అయిదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాద సమయంలో మద్యం సేవించి ఉన్నట్లు నిందితులు అంగీకరించారు. వారిపై నేరపూరిత హత్య అభియోగం, ర్యాష్ డ్రైవింగ్ వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా ఈవెంట్ పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న అంజలి సింగ్‌ను ఢిల్లీలోని సుల్తాన్‌పురిలో జనవరి 1వ తేదీ తెల్లవారు జామున కొంతమంది యువకులు కారుతో ఢీకొట్టి కొన్ని కిలోమీటర్ల మేర ఆమెను ఈడ్చుకెళ్లిన విషయం తెలిసిందే. స్కూటర్‌ను ఢీకొట్టడంతో భయంతో అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించారు. అయితే మహిళ శీరరం కారు చక్రాలకు చిక్కుకుందన్న విషయం వారికి తెలియలేదు. సుల్తాన్పూరి నుంచి కంజావాలా వరకు 13 కిలోమీటర్ల మేరకు ఆమెను అలాగే ఈడ్చుకెళ్లారు. చివరికి కంజావాలా వద్ద యూ టర్న్ తీసుకునే సమయంలో మహిళ కారుతోపాటు రావడాన్ని గమనించిన కారులోని ఓ వ్యక్తి గమనించాడు. వెంటనే కారు ఆపడంతో ఆమె శరీరం పడిపోయింది. దీంతో మళ్లీ అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. అయితే కారుతోపాటు రోడ్డుపై మహిళ శరీరం ఈడ్చుకెళ్లడం చూసిన ప్రత్యక్ష సాక్షులు పోలీసులుకు సమాచారం అందించడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నెంబర్ ప్లేట్ ఆధారంగా కారును ట్రేస్ చేసిన పోలీసులు అదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు దీపక్ ఖన్నా(26), అమిత్ ఖన్నా(25), క్రిష్ణణ్(27), మిథున్(26), మనోజ్ మిత్తల్‌గా గుర్తించారు. వీరకి కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. దీపక్ ఖన్నా అనే వ్యక్తి కారు డ్రైవ్ చేస్తుండగా.. స్కూటీనిని ఢీ కొట్టిన సమయంలో దేని మీద నుంచో కారు ఎక్కించినట్లు అనిపించిందని దీపక్ పోలీసుల ఎదుట అంగీకరించాడు, అయితే మిగతావాళ్లు మాత్రం తామకు అలాంటిది ఏం అనిపించలేదని తెలిపారు. స్కూటీని ఢీకొట్టిన తర్వాత అక్కడి నుంచి భయంతో పారిపోయినట్లు తెలిపారు. -
ఢిల్లీ ఘటన: కుటుంబానికి అంజలి ఒక్కతే ఆధారం.. ఫోన్ చేసి వస్తున్నానని చెప్పి
న్యూఢిల్లీ: నూతన సంవత్సరం వేళ దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. 23 ఏళ్ల యువతిని కారుతో ఢీకొట్టి కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన యావత్తు దేశాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. కారు చక్రాల మధ్యలో చిక్కుకొని కిలోమీటర్ల మేర మహిళను ఈడ్చుకెళ్లడంతో ఆమె శరీరం పూర్తిగా ఛిద్రమైంది. తీవ్ర గాయాలపాలైన సదరు మహిళ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఢిల్లీ ఘటనలో మృతిచెందిన బాధితురాలిని అమర్ విహార్‌కు చెందిన అంజలిగా పోలీసులు గుర్తించారు. పెళ్లిళ్లు వంటి శుభకార్యాలను నిర్వహించే ఈవెంట్ కంపెనీలో పనిచేస్తోంది. ఎప్పటిలాగే కార్యక్రమ పనులు ముగించుకొని డిసెంబర్ 31న రాత్రి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. అంజలి తన తల్లి, నలుగురు చెల్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లతో కలిసి జీవిస్తోంది. పిల్లల్లో అంజలి పెద్దది. ఎనిమిదేళ్ల క్రితమే తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలను అంజలి తన భూజాన వేసుకుంది. కుటుంబ పోషణ మొత్తం ఆమె ఒక్కతే చూసుకుంటోంది. తను పనిచేసి సంపాదిస్తే కానీ కుటుంబం గడవదు. కుటుంబానికి పెద్ద దిక్కైన అంజలి మరణంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. డిసెంబర్ 31న సాయంత్రం ఆరుగంటలకు న్యూ ఇయర్ ఈవెంట్ కోసం అంజలి బయటకు వెళ్లిందని కుటుంబ సభ్యులు తెలిపారు. రాత్రి 9 గంటలకు కాల్ చేసి ఇంటికి వస్తున్నట్లు చెప్పినట్లు వెల్లడించారు. రాత్రి 10 గంటలకు మళ్లీ కాల్ చేయగా స్విచ్చాఫ్ వచ్చిందని, ఉదయం 8 గంటల సమయంలో కూతురు ప్రమాదానికి గురైనట్లు ఢిల్లీ పోలీసులు చెప్పినట్లు విలపించారు. అంజలి మృతదేహం నగ్నంగా కనిపించిన తీరు 2012 నిర్భయ అత్యాచార ఘటనను తలపించిందని వాపోయారు. నిందితులను పోలీసులు రక్షిస్తున్నారని ఆమె కుటుంబం ఆరోపించింది. ఇది యాక్సిడెంటల్‌గా జరగలేదని ఉద్దేశ పూర్వకంగానే చేశారంటూ ఆమె తల్లి, మేనమామ ఆరోపిస్తున్నారు. ఏం జరిగిందంటే ఆదివారం తెల్లవారు జామున స్కూటీపై వెళ్తున్న యువతిని కారుతో ఢీకొట్టిన కొంతమంది యువకులు అక్కడితో ఆగకుండా కొన్ని కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లారు. రోహిణిలోని కంజావాల్ నుంచి కుతూబ్‌గఢ్ వైపు వెళ్తున్న కారు మహిళను ఊడ్చుకెళ్తున్నట్లు ఆదివారం తెల్లవారు జామున 3.24 నిమిషాలకు పోలీసులకు ఫోన్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు సమీపంలోని అన్ని చెక్‌పోస్టులను అలెర్ట్ చేశారు. ఫోన్ చేసిన వ్యక్తి కారు నెంబర్ కూడా చెప్పడంతో వాహనాన్ని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఇంతలోనే రోడ్డుపై నగ్న స్థితిలో ఉన్న మహిళ మృతదేహం పడి ఉన్నట్లు ఉదయం 4 గంటలకు కంజావాలా పోలీసులకు మరో కాల్ వచ్చింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను మంగోల్‌పురిలోని ఆసుపత్రికి తరలించారు. మహిళ శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నట్లు గుర్తించారు. చాలా దూరం కారుతో ఊడ్చుకెళ్లడంతో మహిళ వెనకవైపు శరీరమంతా తీవ్రంగా గాయపడినట్లు, కాలిన గాయాలు ఉన్నట్లు తెలిపారు. తలకు గాయమవ్వడంతోపాటు చేతులు మరియు కాళ్లు విస్తృతంగా కొట్టుకుపోయాయని పేర్కొన్నారు. మరోవైపు మహిళను ఢీకొట్టిన అనంతరం కారులోని వ్యక్తులు వాహనాన్ని ఆపకుండా అక్కడి నుంచి పరారయ్యారు. మహిళను అలాగే సుల్తాన్పూరి నుంచి కంజావాలా వరకు 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారు. కారుతో మహిళను ఈడ్చుకెళ్లిన ఘటనపై రాజకీయ దుమారం కూడా రాజుకుంది. న్యూ ఇయర్ వేళ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేపట్టక పోవడంపై, నిందితులు ఏ ఒక్క చెక్‌పోస్టు వద్ద పట్టుబడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళ మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనలు చేపట్టారు. వైరల్ వీడియో మహిళను కారు ఈడ్చుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కంజావాలా ప్రాంతంలో కారు యూటర్న్ తీసుకుంటున్న సమయంలో కారు కింద మహిళ చిక్కుకుని ఉండడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. తెల్లవారుజామున 3.34 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. Clear CCTV of Delhi Kanjhawala Accident where girl dragged for few KM #Kanjhawala #delhi @SwatiJaiHind @RahulGandhi pic.twitter.com/Di1T2B7o4h — Sachin Tiwari (@SachinReport) January 1, 2023 నిందితులు ఎలా చిక్కారంటే.. నెంబర్ ప్లేట్ ఆధారంగా కారును ట్రేస్ చేసిన పోలీసులు అదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు దీపక్ ఖన్నా(26), అమిత్ ఖన్నా(25), క్రిష్ణణ్(27), మిథున్(26), మనోజ్ మిత్తల్‌గా గుర్తించారు. అరెస్టయిన వారిలో క్రెడిట్ కార్డు కలెక్షన్ ఏజెంట్, డ్రైవర్, రేషన్ షాపు యజమాని ఉన్నారు. ఘటన సమయంలో దీపక్ కారు డ్రైవ్ చేస్తున్నట్లు తేలింది. సుల్తాన్‌పురి ప్రాంతంలో తమ కారు స్కూటీని ఢికొట్టిన్నట్లు నిందితులు అంగీకరించారు. కానీ మహిళ కారు చక్రాలకు చిక్కుకుందన్న విషయం తమకు తెలీదని తెలిపారు. నిందితులంతా మద్యం మత్తులోకారు డ్రైవ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిని సోమవారం కోర్టులో హజరుపరచగా.. మూడు రోజుల కస్టడీకి అప్పగించింది. #Delhi: People gather to protest outside Sultanpuri Police station regarding the death of a woman who died after she was dragged for a few kms by a car that hit her in Sultanpuri area on January 1. pic.twitter.com/TJYkeSvO6g — TOI Delhi (@TOIDelhi) January 2, 2023 -
ఢిల్లీ ఘటనపై గవర్నర్ సక్సేనా ఫైర్: సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది
దేశ రాజధాని ఢిల్లీలో మహిళ స్కూటీని కారుతో ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన ఘటనపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఫైర్ అయ్యారు. నిందితుల భయానక చర్యను చూసి షాక్‌కి గురయ్యానని అన్నారు. ఈ అమానవీయ ఘటనతో సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందంటూ మండిపడ్డారు. ఈ క్రూరమైన చర్యకు దిగ్బ్రాంతికి గురయ్యానని అన్నారు. బాధిత కుటుంబానికి సాధ్యమైనంత మేర మద్దతు, భరోసా అందిస్తాం. కానీ ఇలాంటి దారుణమైన ఘటనలకు పాల్పడవద్దని ప్రజలకు విజ్క్షప్తి చేశారు. అందరం మంచి సమాజం కోసం కలిసి పనిచేద్దాం అని సక్సేనా అన్నారు. కాగా, ఆదివారం న్యూ ఇయర్ రోజున ఢిల్లీలోని 20 ఏళ్ల యువతిని కారుతో ఢీ కొట్టి కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఐతే ఆమె చక్రాల్లో ఇరుక్కుపోవడంతో చనిపోయిందని పోలీసులు తెలిపారు. ఈడ్చుకెళ్లడంతోనే ఆమె బట్టలు, శరీరం వెనుకభాగం వైపు ఉన్న బట్టలు చిరిగిపోయాయని వెల్లడించారు. ఈ మేరకు ఢిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ కూడా ఈ ఘటనపై ఘాటుగా స్పందించారు. ఈ విషయంపై ఢిల్లీ పోలీసులకు సమన్లు జారీ చేశారు. ఈ ఘటన చాలా దారుణమైనదని, సాధ్యమైనంత త్వరగా అసలు విషయాలు వెలుగులోకి రావాలని ట్విట్టర్లో ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. అంతేగాదు సదరు బాధిత మహిళకు మీరు ఏవిధంగా న్యాయం చేయగలరంటూ ఢిల్లీ పోలీసులను ప్రశ్నించారు. ఈ ఘటనలో ఆ కారులోని వ్యక్తుల తాగి ఉన్నారు, పైగా ఏ చెక్ పోస్ట్ వారి కారుని అడ్డుకోలేకపోయందంటూ ట్విట్టర్ వేదికగా పోలీసులపై మండిపడ్డారు. దీంతో సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు.. ఈ ఘటన గురించి ఆదివారం తెల్లవారుజామున కంజ్వాలా పోలీస్ స్టేషన్‌కు పిసిఆర్ కాల్ వచ్చిందని తెలిపారు. దీంతో పోలీసులు పికెట్ల వద్ద మోహరించి అధికారులను అప్రమత్తం చేసి వాహానాలను సోదా చేయడం ప్రారంభించారని చెప్పారు. ఆ ఘటనకు కారణమైన కారుని స్వాధీనం చేసుకోవడంగాక ఆ ఐదుగురు నిందితులను వారి నివాసాల నుంచే అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఈ ఘటనపై ఢిల్లీ పోలీస్ కమిషనర్‌తో స్వయంగా పర్యవేక్షించడమే కాకుండా అధికారులు నిందితులను అదుపులోకి తీసకున్నారని, అలాగే అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరంగా సాగిస్తున్నట్లు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ట్వీట్టర్లో పేర్కొన్నారు. (చదవండి: 10 రోజుల్లో రూ.1,262 కోట్ల మద్యం..ఏకంగా 20 లక్షల లీటర్లు తాగేశారు) -
ఢిల్లీలో ఘోరం: నడిరోడ్డుపై నగ్నంగా యువతి మృతదేహం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కొత్త ఏడాది తొలిరోజే ఓ యువతి దారుణంగా హింసకు గురై ప్రాణాలు కోల్పోయింది. న్యూఇయర్ సెలబ్రేషన్స్‌లో తప్పతాగిన ఐదుగురు దుండగులు బాధితురాలి స్కూటర్‌ను ఢీకొట్టడంతో పాటు ఆమెను నాలుగు కిలోమీటర్లు రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. శరీరంపై నూలుపోగు కూడా లేకుండా రోడ్డుపై పడి ఉన్న ఆ యువతి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. ఈ దారుణ సంఘటన ఢిల్లీ సుల్తాన్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితురాలు ఆదివారం తెల్లవారుజామున తన స్కూటర్‌పై వెళ్తోంది. ఆమె స్కూటర్‌ను ఓ కారు ఢీకొట్టింది. ఈ క్రమంలోనే ఆమె డ్రెస్ కారు టైరులో చిక్కుకుంది. స్కూటర్‌ను ఢీకొట్టినప్పటికీ ఆగకుండా కారును ముందుకు నడిపారు. టైరులో డ్రెస్ చిక్కుకోవడంతో సుమారు 4 కిలోమీటర్లు ఆ బాధితురాలిని ఈడ్చుకెళ్లారు. దీంతో తీవ్రగాయాలపై ఆ యువతి మృతి చెందింది. ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా యువతి మృతదేహం కనిపించటం కలకలం సృష్టించింది. రోడ్డుపై నగ్నంగా పడి ఉన్న యువతి మృతదేహాన్ని చూసి ముందుగా హత్యాచారంగా భావించారు. కానీ, రోడ్డు ప్రమాదం కారణంగా ఆమెను కారు వెనకాల ఈడ్చుకెళ్లడం ద్వారా మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున 3.24 గంటలకు రోడ్డుపై మృతదేహం సమచారం అందినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ‘ఓ మహిళ మృతదేహాన్ని బలెనో కారుకు కట్టి ఈడ్చుకెళ్తున్నారని ఓ వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. కంఝవాలా పోలీస్ స్టేషన్ బృందం ఈ విషయంపై ఆ కాలర్‌కు తిరిగి పలు మార్లు ఫోన్ చేశారు. ఆ తర్వాత బలెనో కారును ఆ వ్యక్తి గుర్తించాడు.’ అని తెలిపారు. ఫోన్ రాగానే పోలీసు బృందం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుంది. రోహిణి జిల్లా క్రైమ్ టీం సైతం అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టింది. ఆ తర్వాత మృతదేహాన్ని ఎస్జీఎం ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆ తర్వాత కారును పట్టుకుని ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈక్రమంలోనే సుల్తాన్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలో యాక్సిడెంట్ జరిగినట్లు వారు తెలిపారు. మహిళా కమిషన్ నోటీసులు యువతిని ఈడ్చుకెళ్లి మృతి చెందేందుకు కారణమైన ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. కేసులో నిజానిజాలు తేల్చి పూర్తి వివరాలు సమర్పించాలని ఢిల్లీ పోలీసులకు నోటీసులు ఇచ్చారు మహిళా కమిషన్ ఛైర్పర్సన్ శ్వాతి మాలివాల్. ‘ఢిల్లీ కంఘావాలా ప్రాంతంలో ఓ యువతి మృతదేహం నగ్నంగా పడి ఉంది. కొందరు యువకులు తప్పతాగి ఆమె స్కూటర్‌ను ఢీకొట్టడంతో పాటు ఆమెను పలు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారు. ఈ సంఘటన చాలా ప్రమాదకరమైనది. ఢిల్లీ పోలీసులకు సమన్లు జారీ చేస్తున్నా.’అని ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: చైనాలో తమిళనాడు యువకుడు మృతి.. సాయం కోసం కుటుంబం వేడుకోలు -
Viral Video: చలానా కట్టమంటే.. ట్రాఫిక్ పోలీసును కారు పై 4కిలోమీటర్లు లాక్కెళ్లాడు
-
ఇంత దారుణమా? చలానా కట్టమన్నందుకు 4 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు
భోపాల్: డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటమే కాకుండా ప్రశ్నించిన ట్రాఫిక్ పోలీసు పట్ల దురుసుగా ప్రవర్తించాడు ఓ వ్యక్తి. చలాన్ కట్టమన్నందుకు కారు బానట్‌పై ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను 4 కిలోమీటర్లు లాక్కెళ్లాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో జరిగింది. ఇండోర్ నగరంలోని సత్య సాయి జంక్షన్ వద్ద ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ శివ సింగ్ చౌహాన్(50) విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే కారులో వచ్చిన ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ కనిపించాడు. ఫోన్ మాట్లాడటం తప్పు అని చెప్పి జరిమానా కట్టాలని సూచించాడు కానిస్టేబుల్. దీంతో ఆగ్రహించిన కారు డ్రైవర్.. కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగాడు. జరిమానా తప్పించుకునేందుకు కానిస్టేబుల్ అడ్డుగా ఉన్నప్పటికీ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ పోలీసు కారు బానట్పైకి దూకాడు. అయినప్పటికీ.. కారును ఆపకుండా అలానే 4 కిలోమీటర్లు కారు నడిపాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్‌కు గాయాలైనట్లు ఉన్నతాధికారులు తెలిపారు. కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేసి ఐపీసీ సెక్షన్ 279, 332 కింద కేసు నమోదు చేసినట్లు లసుదియా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ఎస్ దండోతియా తెలిపారు. నిందితుడి వద్ద నుంచి ఓ పిస్తోల్, ఓ రివాల్వర్ సైతం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అయితే, అవి లైసెన్స్‌తో తీసుకున్నవని నిందితుడు తెలిపాడన్నారు. ग्वालियर के केशव उपाध्याय ने इंदौर में गाड़ी चलाने के दौरान फोन पर बात करते हुए ट्रैफिक तोड़ा और रोकने पर ट्रैफिक कांस्टेबल शिव सिंह चौहान को चार किलोमीटर तक अपने बोनट पर टांग कर ले गए। बताया जा रहा है के FIR कर छोड़ दिया गया।pic.twitter.com/PXEhQ3lm31 — काश/if Kakvi (@KashifKakvi) December 12, 2022 ఇదీ చదవండి: మూన్‌లైటింగ్ కూలీ: రాత్రి పూట రైల్వే స్టేషన్లో.. మరి పగటి పూట! -
మైనర్లను ట్రక్కుకు కట్టి ఈడ్చుకెళ్లారు.. ఏం తప్పు చేశారో?
భోపాల్: ఇద్దరు మైనర్లను ట్రక్కుకు కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. దొంగతనం చేశారనే ఆరోపణలతో తీవ్రంగా చితకబాది.. రెండు కాళ్లకు తాళ్లు కట్టి రద్దీగా ఉండే ఛాయ్‌త్రోమ్ కూరగాయల మార్కెట్ గుండా ఈడ్చుకెళ్లారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇద్దరు మైనర్లపై పోలీసులు దొంగతనం కేసు నమోదు చేశారు. మరోవైపు.. ఇద్దరిని ట్రక్కుకు కట్టి ఈడ్చకెళ్లిన ఘటనపై వీడియో ఆధారంగా కేసు నమోదు చేయనున్నట్లు చెప్పారు. ఇదీ జరిగింది.. కూరగాయల మార్కెట్లో లోడ్ దింపుతుండగా ఇద్దరు టీనేజర్లు ట్రక్కు నుంచి డబ్బులు దొంగతనం చేశారని ఇద్దరు వ్యాపారులు, డ్రైవర్ ఆరోపించారు. వారు ట్రక్కులోంచి నగదు తీస్తుండగా తాను చూసినట్లు డ్రైవర్ చెప్పాడు. ఈ క్రమంలో వ్యాపారులు, అక్కడే ఉన్న కొందర మైనర్లను చితకబాదారు. వారి కాళ్లకు తాడు కట్టి ట్రక్కుకు కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఇలా కూరగాయల మార్కెట్ మొత్తం తిప్పారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు మైనర్లను అదపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ‘మైనర్ల పట్ల ప్రవర్తించిన తీరు భయానకం, హింసాత్మకం. వారిపైనా మేము చర్యలు తీసుకుంటాం. వీడియో ఆధారంగా వారిని గుర్తిస్తున్నాం.’ అని ఇండోర్ పోలీసు అధికారి నిహత్ ఉపాధ్యాయ్ తెలిపారు. ఇదీ చదవండి: జర్నలిస్టులకు లక్షల్లో ‘క్యాష్ గిఫ్ట్‌లు’.. మరో వివాదంలో కర్ణాటక ప్రభుత్వం -
షాకింగ్ ఘటన.. కాలేజీ విద్యార్థిని ఈడ్చుకెళ్లిన ఆటో డ్రైవర్, వీడియో వైరల్
ముంబై: మహారాష్ట్రలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పట్టపగలే నడిరోడ్డుపై కాలేజీ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ క్రూరంగా ప్రవర్తించాడు. ఈ ఘోరం సీఎం ఏక్నాథ్ షిండే నియోజకవర్గం థానే నగరంలో చోటుచేసుకోవడం గమనార్హం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. వివరాలు 21 ఏళ్ల యువతి కళాశాలకు వెళ్తుండగా రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఆటో డ్రైవర్ అసభ్యకరమైన కామెంట్స్ చేశాడు. దీంతో యువతి అతినిపై ఎదురు తిరిగి ప్రశ్నించగా.. అతడు ఆమె చేతిని పట్టుకొని లాగాడు. తరువాత నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించగా యువతి అతడిని వదిలిపెట్టలేదు. ఆటో తీసి పరారవుతుండగా అతడి చేతిని గట్టిగా పట్టుకుంది. అయితే ఆటో డ్రైవర్ యువతిని అలాగే 500 మీటర్లు తన బండితోపాటు ఈడ్చుకెళ్లాడు. అనంతరం ఆమెను ఓ చోట కింద పడేసి అక్కడి నుంచి పారిపోయాడు. యువతిని గమనించిన స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఆటోరిక్షా డ్రైవర్ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: రూ. 9 లక్షల లోన్ కట్టాలని బ్యాంక్ నోటీస్.. గంటల్లోనే అదృష్టం తలుపు తట్టింది Shocking! In CM’s constituency by an autodriver. HM should resign.#Maharashtra https://t.co/dL5JV3kMip — Shraddhey (@shraddhey) October 14, 2022 -
మీ పిల్లలు బడికి వెళ్తున్నారా.. పేరెంట్స్ ఒక్కసారి ఈ వీడియో చూడండి!
కొన్నిసార్లు మనుషులు చేసే తప్పిదాలు.. తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి. క్షణికావేశం, క్షణకాల నిర్లక్ష్యం కారణంగా ఎదుటివారి ప్రాణాలు గాలిలో కలిసే అవకాశం ఉంటుంది. ఇలాంటి వీడియోనే ఒకటి తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా చిన్నారి తీవ్రంగా గాయపడింది. వివరాల ప్రకారం.. అమెరికాకు చెందిన జెఫ్ఫర్సన్ పబ్లిక్ స్కూల్ బస్సు నుండి ఓ చిన్నారి(6) కిందకు దిగుతోంది. ఈ క్రమంలో బస్సు డ్రైవర్.. డోర్ ఓపెన్ చేసింది. కాగా, చిన్నారి పూర్తిగా స్టెప్స్ దిగకముందే.. డోర్ క్లోజ్ కావడంతో ఆమె బ్యాగ్.. డోర్ మధ్యలో చిక్కుకుపోతుంది. దీంతో, బాలిక.. కిందకు దిగకుండా అలాగే నిల్చుడిపోతుంది. అది గమనించని డ్రైవర్.. బస్సును స్టార్ట్ చేసి వెళ్లిపోతుంటాడు. HOLY SHIT. The little girl is miraculously fine, the bus driver has been fired. pic.twitter.com/uuijsrNn2U — Dean Blundell🇨🇦 (@ItsDeanBlundell) September 23, 2022 దీంతో, చిన్నారి బస్సు డోర్‌కు వేలాడుతూనే వస్తుంది. ఇలా దాదాపు 1000 అడుగుల దూరం వచ్చాక.. బస్సులో ఉన్న వారు చిన్నారిని చూసి కేకలు వేయడంతో డ్రైవర్ బస్సును నిలిపివేస్తుంది. ఈ ప్రమాదంలో బాలిక తీవ్రంగా గాయపడుతుంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలిస్తారు. ఇక, ఈ ఘటన అనంతరం డ్రైవర్‌ను విధుల నుంచి తొలిగిస్తారు. అలాగే, పాఠశాల యాజమాన్యం చిన్నారి పేరెంట్స్‌కు దాదాపు 5 మిలియన్ల డాలర్లను నష్టపరిహారంగా ఇచ్చినట్టు సమాచారం. కాగా, ఈ ప్రమాదం 2015లో జరిగింది. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు పిల్లల విషయంలో పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. -
షాకింగ్ ఘటన: ఈ డ్రైవర్ కళ్లు మూసుకుని కారు నడిపాడా?
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని కరోల్ బాఘ్ ప్రాంతంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన పదుల సంఖ్యలో వాహనాలు ఢీకొట్టటమే కాకుండా ఓ వ్యక్తిని లాక్కెళ్లింది. సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. సీసీటీవీ దృశ్యాల ప్రకారం.. కరోల్ బాఘ్ ప్రాంతంలో రహదారి పక్కన ఓ మహిళ స్కూటీ వద్ద నిలుచుని ఉంది. ఈ క్రమంలో ఓ ఫార్చునర్ ఎస్యూవీ కారు దాని ముందు నిలిపి ఉంచిన కార్లను ఢీకొడుతూ ముందుకు వెళ్లింది. అలాగే ఓ వ్యక్తిని సుమారు 100 మీటర్ల దూరం వరకు లాక్కెళ్లింది.ఈ సంఘటనతో అక్కడ ఉన్నవారు షాక్‌కు గురయ్యారు. ఎస్యూవీ కారు బీభత్సంలో పదుల సంఖ్యలో వాహనాలు, బైక్‌లు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం కారును పోలీసులు స్వాధీనం చేసుకోగా.. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Video: Fortuner Rams Multiple Vehicles, Drags Man For 100 Metres In #Delhi https://t.co/DDtF49VJD5 pic.twitter.com/1PTcOihghd — NDTV (@ndtv) September 19, 2022 (వీడియో సోర్స్: ఎన్డీటీవీ) ఇదీ చదవండి: వీడు మనిషేనా.. మానవత్వం లేకుండా కుక్కను కారుకు కట్టి లాక్కెళ్లి.. -
వీడు మనిషేనా.. మానవత్వం లేకుండా కుక్కను కారుకు కట్టి లాక్కెళ్లి..
ఆయనో డాక్టర్.. కానీ మానవత్వం మరిచి ఓ మూగజీవాన్ని దారుణంగా హింసించాడు. దీంతో, ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతను చేసిన పనికి నెటిజన్లు దుమ్మెతిపోస్తున్నారు. పోలీసులు సైతం కేసు నమోదు చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. వివరాల ప్రకారం, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ కారు డ్రైవర్.. ఓ కుక్కను తన కారుకు కట్టి నడిరోడ్డు మీద లాక్కెళ్లాడు. కారును స్పీడ్‌గా డ్రైవ్ చేయడంతో కుక్క వేగంగా పరిగెత్తలేక కిందపడిపోయింది. అయినప్పటికీ అతను మాత్రం కారును ఆపలేదు. కాగా, కారు వెనుక వస్తున్న ఓ బైకర్.. కారును అడ్డుకునే పయత్నం చేశాడు. కారుకు బైకును అడ్డంగా పెట్టడంతో డ్రైవర్ కారును ఆపాడు. ఈ క్రమంలో అక్కడున్న మరికొంత మంది కారు వద్దకు చేరుకుని కుక్కను విడిపించారు. ఈ ప్రమాదంలో కుక్కకు తీవ్ర గాయాలు కాగా ఆసుప్రతికి తరలించారు. అనంతరం.. డ్రైవర్‌ను ఎందుకిలా చేస్తున్నావని ప్రశ్నించాడు. అయితే, ఈ దారుణానికి ఒడిగట్టింది డాక్టర్ రజనీష్ గ్వాలాగా గుర్తించారు. దీంతో, ఈ ఘటనపై కొందరు వ్యక్తులు పోలీసులు, ఎన్జీవోకు ఫిర్యాదు చేశారు. దీంతో, ఎన్జీవోల ఫిర్యాదు మేరకు పోలీసులు జంతు హింస చట్టం కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇక, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. డాక్టర్‌కు కనికరం లేదని, మానవత్వం అంటే తెలియదని కామెంట్స్ చేస్తున్నారు. The person who did this he is a Dr. Rajneesh Gwala and dog legs have multiple fracture and this incident is of Shastri Nagar Jodhpur please spread this vidro so that @CP_Jodhpur should take action against him and cancel his licence @WHO @TheJohnAbraham @Manekagandhibjp pic.twitter.com/leNVxklx1N — Dog Home Foundation (@DHFJodhpur) September 18, 2022 -
దారుణం: పిల్లాడిని లాగేసుకున్న ట్రెడ్మిల్
వాషింగ్టన్: ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏ పని చేస్తున్నా ఓ కంట వారిని కనిపెడుతూ ఉండాలి. ఎందుకంటే చిన్నారులు తమ కళ్ల ముందు కనిపించే ప్రతిదాన్ని తాకి చూడాలని.. వీలైతే ఆయా వస్తువులతో ఆడుకోవాలని భావిస్తారు. అలాంటప్పుడు వారికి అందేంత ఎత్తులో కానీ.. కింద కానీ ఎలాంటి ప్రమాదకర వస్తువులు ఉంచకూడదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థుతుల్లో ఉంచాల్సి వచ్చినా.. చిన్నారులను ఆ సమక్షంలోకి రానివ్వకూడదు. అలా కాదని మనం ఏ కాస్త ఏమరపాటుగా ఉన్నా.. ఇదిగో ఈ వీడియోలో చూపించినటువంటి భయంకర అనుభవం ఎదుర్కొవాల్సి వస్తుంది. దీనిలో ఇద్దరు పిల్లలు ట్రెడ్మిల్ వద్ద ఆడుకుంటూ ఉంటారు. ఇంతలో ఓ చిన్నారి చేతులోని బెలూన్ ట్రెడ్‌మీల్ పడిపోవడంతో దాన్ని అందుకోవడం కోసం ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో చిన్నారి ట్రెడ్‌మీల్ కిందకు పూర్తిగా వెళ్లిపోతాడు. చివరకు ఎలాగో అలా బయటపడతాడు. ఇందుకు సంబంధించిన వీడియోని అమెరికాకు చెందిన కన్జుమర్ ప్రొడక్ట్ సేప్టీ కమిషన్(సీపీఎస్సీ) తన ఫేస్బుక్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో ఇద్దరు చిన్నారులు ఇంట్లో ట్రెడ్‌మీల్ వద్ద ఆడుకుంటూ ఉంటారు. అప్పటికి అది ఆన్ చేసి ఉంటుంది. వీరిలో పాప ట్రెడ్మిల్ మీద నడుస్తుండగా.. మరో చిన్నారి చేతిలో బెలూన్‌తో ట్రెడ్మిల్ పక్కన ఆడుకుటుంటూ ఉంటాడు. ఇంతలో ఆ పిల్లాడు తన చేతిలోని బెలూన్ని ట్రెడ్మిల్ మీద పెట్టగా.. అది అలా వెళ్లిపోతుంది. దాన్ని లాక్కోవడం కోసం పిల్లాడు ట్రెడ్మిల్ మీద చేతులు పెడతాడు. దాంతో బెలూన్‌తో పాటు చిన్నారి చేతులు కూడా ట్రెడ్మిల్ కింద ఇరుక్కుంటాయి. అది చూసిన పాప తన తల్లిదండ్రులను పిలిచేందుకు ఇంట్లోకి పరిగెడుతుంది. ఈ లోపు పిల్లాడు ఎంతో కష్టపడి చేతులను బయటకు లాక్కున్నా.. రెండోసారి మళ్లీ ట్రెడ్మిల్ అతడిని లాగేసుకుంది. ఈ సారి పూర్తిగా ట్రెడ్మిల్ కిందకి వెళ్లిపోయాడు. ఆ బాధను తట్టుకోలేక విలవిల్లాడాడు. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమేరాలో రికార్డైంది. చివరికి ఆ పిల్లాడు తనంతట తానే దాన్ని విడిపించుకుని ఏడుస్తూ వెళ్లిపోవడం కనిపించింది. ట్రెడ్మిల్ ఇళ్లల్లో ఉంటే జాగ్రత్తగా ఉండాలని చెప్పేందుకే ఈ వీడియోను షేర్ చేశారు. ఇప్పటివరకు ఇలాంటి ట్రెడ్మిల్ వల్ల ఒకరు చనిపోగా, కొంతమంది పిల్లలు దాని కింద నలిగి గాయపడ్డారని సీపీఎస్పీ పేర్కొంది. ఇలాంటి ఘటనలకు సంబంధించి సుమారు 39 ఫిర్యాదులు తమకు అందాయని తెలిపింది. ఇంట్లో ఇలాంటి ట్రెడ్మిల్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. చదవండి: వైరల్ వీడియో: దీని నటనకు ఆస్కార్ ఇచ్చినా తక్కువే.. -
పెద్దాయన క్రూరత్వం, నెటిజన్ల మండిపాటు
సాక్షి, తిరువనంతపురం: పెంపుడుకుక్కను దారుణంగా కారుకు కట్టి నడిరోడ్డుపై లాక్కెళ్లిన క్రూర చర్య సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అదీ 62 ఏళ్ల ఒక పెద్దాయన కనీసం కనికరం లేకుండా దారుణంగా ప్రవర్తించిన వైనంపై నెటిజన్లులు మండిపడుతున్నారు. కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో శుక్రవారం ఈ ఉదంతం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తనను బాగి విసిగిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన యూసఫ్ ఆప్రాంతం నుండి కుక్కను దూరంగా తీసుకెళ్లి వదిలిరావాలని అనుకున్నాడు. అంతే క్షణం ఆలోచించకుండా.. ఏ మాత్రం దయ లేకుండా కుక్కను కారుకు కట్టేసి మరీ లాక్కెళ్లిపోయాడు. ఈ అమానుషాన్ని గమనించిన అఖిల్ అనే బైకర్ వీడియో తీశారు. ఇంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తామంటూ ఆయన యూసఫ్‌ను అడ్డుకుని ప్రశ్నించారు. అయితే...నీకేంటి సమస్య అంటూ వాదించిన యూసఫ్ చివరకు కుక్కకు కట్టిన తాడును వదిలించి అక్కడినుంచి వెళ్లి పోయారు. దీనిపై వ్యవహారంపై అఖిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కారు యజమాని యూసుఫ్‌పై చెంగమండ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జంతువుల క్రూరత్వాన్ని నిరోధించే (ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ యాక్ట్, 1960) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద నిందితుడిని అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల చేశామని పోలీసు అధికారి తెలిపారు. గాయపడిన కుక్కను ప్రభుత్వ పశువైద్య కేంద్రానికి తరలించి చికిత్స అందించినట్టు చెప్పారు. -
ఏ మాత్రం జాలి, దయ లేకుండా..
చెన్నై: ప్రభుత్వ ఆస్పత్రి ఉద్యోగి ఒకరు ఓ రోగిని వీల్ చైర్లోంచి కిందపడేసిన సంఘటనపై తమిళనాడు రాష్ట్ర మానవహక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది. ఈ మేరకు సోమవారం వైద్య, గ్రామీణ ఆరోగ్య సేవల డైరెక్టర్‌కు నోటీసు పంపింది. కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రిలోని ఇన్-పేషెంట్ వార్డులో ఈ సంఘటన జరిగింది. వీడియోలో ఓ పేషెంట్.. హాస్పిటల్ ఉద్యోగి బాస్కరన్(40)ను, తన మంచం మీదకు వెళ్లడానికి సహాయం చేయమని కోరతాడు. కానీ బాస్కరన్ స్పందించడు. పేషెంట్ పదే పదే ప్రాధేయపడటంతో సదరు ఉద్యోగిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటిది. ఏ మాత్రం జాలి, దయ లేకుండా ఆ పేషెంట్‌ను వీల్ చైర్లో నుంచి కిందకు పడేస్తాడు. పాపం ఆ వ్యక్తి మంచం మీదకు ఎక్కడానికి నానా అవస్థలు పడతాడు. అంతేకాక బాస్కరన్ అతడిని తిట్టడం వీడియలో చూడవచ్చు. ఈ తతంగాన్ని మరో పేషెంట్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సదరు ఉద్యోగితో పాటు ఆస్పత్రి యాజమాన్యం మీద ఆగ్రహం వ్యక్తం అవుతోంది. (5 రూపాయల డాక్టర్ ఇకలేరు) Watch | Tamil Nadu government hospital employee pushes patient from wheel-chair, viral video leads to action. pic.twitter.com/Y3d5yRbbBb — The Indian Express (@IndianExpress) August 18, 2020 అంతేకాక దీని గురించి ఓ తమిళపత్రికలో వార్తా కథనం ప్రచురితమయ్యింది. ఈ క్రమంలో ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించి.. నోటిసులు జారీ చేసింది. దీనికి సంబంధించి మూడు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆలస్యం చేస్తే.. చర్యలు తప్పవని హెచ్చరించింది. దీనిపై ఉన్నతాధికారి ఒకరు స్పందించారు. ఈ ఘటనకు బాధ్యుడైన ఉద్యోగిని తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. -
‘నడిరోడ్డు మీద జుట్టు పట్టి ఈడ్చారు’
భోపాల్: స్టాల్ ఏర్పాటు విషయంలో పోలీసులకు, ఓ సిక్కు వ్యక్తికి మధ్య వివాదం చోటు చేసుకుంది. దాంతో నడిరోడ్డు మీద ఆ సిక్కు వ్యక్తి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు పోలీసులు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఖాకీల తీరు పట్ల నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్ బర్వానీలోని రాజ్పూర్ తహసీల్‌లో ఈ సంఘటన జరిగింది. బాధితుడిని జియానీ ప్రేమ్ సింగ్‌గా గుర్తించారు. వివరాలు.. బాధితుడు ఈ ప్రాంతంలో ఒక స్టాల్ ఏర్పాటు చేయాలని భావించాడు. కానీ పోలీసులు అందుకు అంగీకరించలేదు. ఈ విషయంలో జియానీకి, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో పోలీసులు అతడి జుట్టు పట్టుకుని ఈడ్చారు. జియానీని కాపాడ్డానికి వచ్చిన మరో వ్యక్తిని పోలీసులు అవతలకు లాగి పడేశారు. (రూ. 100 ఇవ్వనందుకు.. అయ్యో పాపం!) ఈ క్రమంలో పోలీసులు తనను ఈడ్చుకెళ్తుండగా.. ‘వీళ్లు నన్ను కొడుతున్నారు. మమ్మల్ని చంపేస్తారు. పోలీసులు మా జుట్టు పట్టుకుని ఈడుస్తున్నారు. మేం స్టాల్ పెట్టుకోవడానికి వారు అంగీకరించడం లేదు’ అంటూ అరుస్తూ.. తమను కాపాడాల్సిందిగా చుట్టూ ఉన్న జనాలను కోరాడు జియానీ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసుల తీరు పట్ల జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. ‘ఈ సంఘటన జరిగినప్పుడు జియానీ తాగి ఉన్నడు. పోలీసులను అడ్డుకున్నాడు’ అని తెలిపారు. ఇందుకు బాధ్యులైన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. (చూస్తే పిచ్చోళ్లే.. కానీ అతి కిరాతకులు!) The incident took place in Rajpur Tehsil of Barwani after an argument broke out between the family of Giani Prem Singh Granthi and the police over setting up a stall in the area, police said he was drunk, two suspended @ndtvindia @ndtv pic.twitter.com/C6SudAS5cD — Anurag Dwary (@Anurag_Dwary) August 7, 2020 ఈ ఘటన పట్ల రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధి నరేంద్ర సలుజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బాధితుడు గత కొంతకాలంగా పల్సూద్ పోలీస్ ఔట్‌పోస్ట్ దగ్గర తాళాల దుకాణం నడుపుకుంటున్నాడు. అతడిని నడిరోడ్డు మీద పోలీసులు అవమానించారు. అతడి తలపాగాను అపవిత్రం చేశారు’ అని మండిపడ్డారు. లంచం ఇవ్వడానికి నిరాకరించడంతోనే పోలీసులు తనపై దాడి చేశారని జియానీ ఆరోపించాడు. -
మేయర్‌ను ట్రక్కు కట్టి ఈడ్చుకెళ్లిన పౌరులు
మెక్సికోలో దారుణం చోటు చేసుకుంది. ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చలేదన్న ఆగ్రహంతో దక్షిణ మెక్సికో పౌరులు చట్టాన్ని తమ చేతుల్లోకి చాలా అమానుషంగా ప్రవర్తించారు. మెక్సికన్ రాష్ట్ర మేయర్‌ను కిడ్నాప్ చేస, ఒక ట్రక్కుకు కట్టి, వీధుల గుండా లాక్కెళ్లిన ఘటన సంచలనం సృష్టించింది. దేశంలోని చిపాస్ రాష్ట్రంలోని లాస్ మార్గరీటాస్ పట్టణంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మీడియా నివేదికల ప్రకారం తోజోలాబల్ కమ్యూనిటీకి చెందిన 30మంది సభ్యులు మేయర్ కార్యాలయంలోకి చొరబడి మేయర్ జార్జ్ లూయిస్ ఎస్కాండన్ హెర్నాండెజ్ను బయటకు లాక్కొచ్చారు. అనంతరం పికప్ ట్రక్ వెనుక భాగంలో కట్టి ఈడ్చుకెళ్లారు. ఇలా కొన్ని మీటర్లు లాక్కెళ్లారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చివరకు పోలీసుల జోక్యంతో ప్రాణాపాయం నుంచి తృటిలో క్షేమంగా బయటపడ్డాడు మేయర్. అయితే ఈ సంఘటన జరిగిన ఎనిమిది గంటల తరువాత, మేయర్ హెర్నాండెజ్ లాస్ మార్గరీటాస్‌లో ప్రసంగించారు, శాంటారీటా సమాజంలోని నాయకులు దీనికి బాధ్యులుగా ప్రకటించారు. కిడ్నాప్, హత్యాహత్నం కింద ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. అటు ఈ సంఘటనలో 10 మంది గాయపడ్డారని, 11 మందిని అరెస్టు చేసినట్లు ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం తెలిపింది. కాగా ప్రత్యక్ష నగదు బదిలీలతో సహా అందించిన దానికంటే ఎక్కువ ప్రజా వనరులను అందోళనకారులు డిమాండ్ చేశారని, ఈ విషయంలో మేయర్ వైఫ్యలం ఈ సంఘటనకు దారి తీసిందని స్టేట్ ప్రాసిక్యూటర్ జార్జ్ లూయిస్ లావెన్ వెల్లడించారు. #Enterate Circula en redes video en el que pobladores del ejido Santa Rita en el municipio de #LasMargaritas, #Chiapas, suben en una camioneta al alcalde Jorge Luis Escandón Hernández. Los motivos es porque no ha cumplido lo prometido en campaña. pic.twitter.com/Yywx2exGAC — Tabasco Al Minuto (@Tabalminutomx) October 8, 2019 UNA SU ARRASTRADA. Alcalde de #LasMargaritas, Jorge Luis Escandón Hernández, es sujetado a una camioneta que lo arrastra en pleno parque central, luego de haber sido secuestrado de la propia alcaldía #Chiapas #VideoViral pic.twitter.com/ptdP7g2w92 — Tinta Fresca Chiapas (@tinta_fresca) October 8, 2019 -
నెల జీతం అడిగిన పాపానికి యువతిపై దాడి
-
కర్ణాటకలో అమానుష ఘటనలు
సాక్షి, బెంగళూర్ : కర్ణాటకలో చోటు చేసుకున్న రెండు అమానుష ఘటనలకు సంబంధించి వీడియో పుటేజీలను రాష్ట్ర పోలీసు శాఖ విడుదల చేసింది. బెంగళూర్‌లో 2017 డిసెంబర్ 31వ తేదీ రాత్రి బైక్‌పై వెళ్తున్న ముగ్గురు నార్త్ ఇండియన్స్ పై కొందరు విచక్షణ రహితంగా దాడి చేశారు. బాధితుల్లో ఇద్దరు వ్యక్తులు, ఓ యువతి ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆ ముగ్గురు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో నిందితులు మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. #WATCH One person arrested today in connection with a CCTV footage of 31st December 2017 in which a couple was thrashed by a group of people #Bengaluru pic.twitter.com/mNZCdWySLU — ANI (@ANI) 16 January 2018 వృద్ధుడిని ఈడ్చేసిన అధికారి ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ వృద్ధుడిని కానిస్టేబుల్ ఒకరు ఈడ్చేసిన ఘటన విమర్శలకు తావునిచ్చింది. మంగళవారం చిక్ మంగళూర్‌లోని శృంగేరీ శారదాంబ ఆలయానికి మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ దేవె గౌడ కుటుంబ సభ్యులతో సహా వచ్చారు. ఆ సమయంలో గుడిలోకి ఎవరినీ అనుమతించలేదు. దీంతో ఓ వృద్ధుడు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఓ కానిస్టేబుల్ అతడిని గమనించి అడ్డుకుని బయటకు ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనపై తీవ్ర విమర్శల వెల్లువెత్తగా.. ఉన్నతాధికారులు ఆ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. #WATCH A policeman drags an old man from Shringeri Sharadamba Temple gate in #Karnataka's Chikmagalur allegedly because he was trying to enter temple when HD Deve Gowda's family was inside; the policeman has been suspended (15.01.18) pic.twitter.com/BTbUVBWYTD — ANI (@ANI) 16 January 2018 -
ముఖ్యమంత్రిపై సంచలన వ్యాఖ్యలు
కోలకత్తా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. డీమానిటైజేషన్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న మమతను జుట్టు పట్టి ఈడ్చి పారేసి ఉండాల్సిందని వ్యాఖ్యానించి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ దుమారం రాజేశారు. పశ్చిమ్ మెద్నిపూర్ జిల్లా జార్గ్రామ్ లో ఆదివారం జరిగిన పార్టీ యువజన విభాగం సమావేశంలో మాట్లాడుతూ ఘోష్ బెనర్జీ ఇలా నోరు పారేసుకున్నారు. పెద్దనోట్ల రద్దుతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వేల కోట్ల రూపాయల నష్ట పోయారని, అందుకే ఆమెకు మతి భ్రమించిందని దిలీప్ వ్యాఖ్యానించారు. డిల్లీలో ఆమె ఆందోళన (డ్రామా) చేస్తున్నపుడు జుట్టు పట్టి లాగి విసిరి పారేసి ఉండవచ్చు.. అక్కుడన్న పోలీసులు తమ వాళ్లే...కానీ తాము అలా చేయలేదంటూ దిలీప్ చెప్పుకొచ్చారు. నోట్ల రద్దుతో పిచ్చి పట్టిన మమత ఢిల్లీ, పట్నా చుట్టూ చక్కర్లు కొడుతోందన్నారు. ఢిల్లీ, రాష్ట్ర సెక్రటేరియట్ ఆందోళనలు ఇందులో భాగమే అన్నారు. ఆమె చివరకు గంగలో దూకుతుందని తాము భావించామన్నారు. తృణమూల్ తప్పులను పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారనీ, ఇకపై మమతా దశ్చర్యలను తాము క్షమించమని ఘోష్ హెచ్చరించారు. కాగా ఘోష్ వ్యాఖ్యలపై టీఎంసీ తీవ్రంగా స్పందించింది. బెనర్జీ వ్యతిరేక పోరాటంలో విఫలమైన బీజీపీ ఇలాంటి వ్యక్తిగత దూషణలకు, బెదింరింపులకు పాల్పడుతోందని విమర్శించింది. ప్రమాదకరమైన బెదిరింపులు, తప్పుడు వ్యక్తిగత ప్రకటనలతో విషం చిమ్ముతూ బీజేపీ దిగజారుడు రాజకీయాలకు ఇది నిదర్శనమని ఎదురు దాడి చేసింది. లక్షలాది సామాన్య జనానికి అండగా నిలిచిన మమతకు ఎదురు నిలవలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని టీఎంసీ విడుదల చేసిన ప్రకటనలో ఆరోపించింది. -
నిరూపించడానికి ప్యాంటు విప్పాడు!
బీజింగ్: పైకి కనిపించేవన్నీ నిజాలు కావు. పైపై నటనలను చూసి మోసపోవద్దని చెబుతుంటారు. అయితే నిజం తెలిసేదెలా. చైనాలో బిచ్చగాడు చేస్తున్న మోసాన్ని తెలిపేందుకు ఓ వ్యక్తి పెద్ద సాహసమే చేశాడు. నడిరోడ్డుపై అతడి ప్యాంటు విప్పి నిల్చోబెట్టాడు. ఇంతకీ ప్యాంటులో ఉన్న నిజం ఏమిటంటారా. కొంతమంది వ్యక్తులు తమ శరీరంలోని కొన్ని భాగాలు సక్రమంగా పనిచేయకపోయినా ఆత్మవిశ్వాసంతో జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడం చూస్తూనే ఉంటాం. మరికొందరు మాత్రం అన్నీ సక్రమంగా ఉన్నా అడ్డదారిలో బ్రతుకుంతుంటారు. ఈ రెండోరకానికి చెందిన బిచ్చగాడి బండారాన్ని ఓ వ్యక్తి బయటపెట్టాడు. చక్రాల బండిపై బోర్లాపడుకొని కాళ్లులేని వాడిగా నటిస్తూ బిక్షాటన చేస్తున్న వ్యక్తిని.. రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి ఎలా కనిపెట్టాడో తెలియదు కానీ అతడికి కాళ్లు ఉన్నాయని కనిపెట్టాడు. అంతే.. ఒక్కసారిగా అతడి వద్దకు వెళ్లి అతడి ప్యాంటు విప్పాడు. లోదుస్తుల్లో రెండు కాళ్లను కట్టేసుకొని.. కాళ్లు లేనివాడిగా నటిస్తున్న బిచ్చగాడు బిక్కమొహంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. -
మహిళపై దౌర్జన్యం..ముగ్గురు అరెస్ట్!
పూనెః యువతిపై దాడికి దిగిన ఐదుగురు యువకుల్లో ఎట్టకేలకు పోలీసులు ముగ్గుర్ని అరెస్టు చేశారు. తనపై ఐదుగురు యువకులు దౌర్జన్యానికి దిగారని, బెదిరింపులకు పాల్పడ్డారంటూ వారం రోజులుగా ఓ మహిళ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదు. పోలీసులు ఫిర్యాదును స్వీకరించేందుకు, ఎఫ్ ఐ ఆర్ బుక్ చేసేందుకు అంగీకరించలేదు. చివరికి ఆమె ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సుమారు పది రోజులక్రితం జరిగిన ఘటనలో పూనేకు చెందిన 22 ఏళ్ళ మహిళా అడ్వర్ టైజింగ్ ఎగ్జిక్యూటివ్ పై ఐదుగురు యువకులు దౌర్జన్యానికి దిగారు. కారులో ఉన్న ఆమెను జుట్టు పట్టుకొని బయటకు లాగి తీవ్రంగా కొట్టారు. తమ కుటుంబాల్లోని మహిళలు, బాలికలు ఎవ్వరూ కురచ దుస్తులు వేసుకోకూడదని, పర పురుషులతో కలసి ప్రయాణించకూడదని బెదిరింపులకు కూడ పాల్పడ్డారు. దీంతో బాధితురాలు తనపై జరిగిన దాడిని గురించి ఫిర్యాదు చేసేందుకు వారం రోజులపాటు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగింది. అయితే ఏ ఒక్కరూ ఆమె ఫిర్యాదును స్వీకరించలేదు. అనంతరం పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో స్పందించిన ఉన్నతాధికారులు ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. మహిళ ఫిర్యాదు స్వీకరించని ముగ్గురు పోలీసులపై కూడ తాము చర్యలు తీసుకుంటామని సిటీ పోలీస్ కమిషనర్ రష్మి సుక్లా తెలిపారు. మే 1వ తేదీన ఇద్దరు మగ కొలీగ్స్ తో కలసి కారులో వెడుతున్నబాధితురాలు, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిన సమయంలో మరో కారులో వెడుతున్న ఐదుగురు యువకులు ఆమెపై వేధింపులకు దిగారు. కారును చుట్టుముట్టి, తెరచి ఉన్న విండోనుంచి ఉమ్ము వేయడమే కాక, డోర్ తెరచి ఆమెను బలవంతంగా కారు నుంచి బయటకు లాగి, ఆమె అపార్ట్ మెంట్ కు ముందే తీవ్రంగా కొట్టి అక్కడినుంచి జారుకున్నారు. ఐదు నిమిషాల తర్వాత తిరిగి వెనక్కు వచ్చి, సహాయంకోసం తన బంధువులకు, మిత్రులకు ఫోన్ చేస్తున్న ఆమెను బెదిరింపులకు పాల్పడ్డారు. నీ ఇల్లు అడ్రస్ తెలిసిందని, తర్వాత నీ సంగతి చూస్కుంటామని, నువ్వు ఎవరితో చెప్పుకున్నా లాభం లేదని, తమకు ఎంతో మంచి పరిచయాలు ఉన్నాయని బెదిరించారని బాధితురాలు తెలిపింది. అయితే ఇంత జరిగినా ఘటనలో ఎటువంటి సెక్యూరిటీ కెమెరా ఫుటేజ్ దొరకక పోవడం విశేషం. -
గెలుపుకోసం పిల్లలను ఈడ్చుకెళ్లడానికైనా రెడీ..
లిన్జ్(ఆస్ట్రేలియా): పిల్లలను అల్లారు ముద్దుగా చూసుకునే తల్లిదండ్రులు కొన్ని విషయాల్లో వారిపట్ల కనికరం లేకుండా ప్రవర్తిస్తారు. ముఖ్యంగా చదువు, ఆటలు లాంటి విషయాల్లో తమ పిల్లలే ఎప్పుడూ ముందు ఉండాలనుకుంటారు. అయితే పోటీల్లో వాళ్లకు కూడా అవకాశం దొరికితే పిల్లలను గెలిపించడానికి ఎంత దూరం వెళతారో ఈ ఫోటోను చూస్తే అర్థం అవుతుంది. ఆస్ట్రేలియాలోని లిన్జ్‌లో 40 మీటర్ల పరుగు పందెంను నిర్వహించారు. వీటిలో 3 నుంచి 5 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలతో పాటూ తల్లిదండ్రులు కూడా వారికి సహాయం చేయడానికి పరిగెత్తే అవకాశం కల్పించారు. నిర్వాహకులు ఆటలతో ఆహ్లాదాన్ని, ప్రతి క్షణం ఆనందంగా గడపాలంటూ పోటీలను నిర్వహిస్తే తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లాడు రేసులో ముందుండాలని మాత్రమే వీటిలో పాల్గొన్నారు. మరీ వేగంగా పరిగెత్తే ఓపిక లేక పోయినా తమ తల్లిదండ్రులు ఒంటి చేత్తో లాక్కుంటూ వెళ్లే ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పిల్లలు ఏడుస్తున్నా వారిని మొదటి బహుమతి కోసం ఎంతో కఠినంగా ఈడ్చుకుంటూ వెళ్లారు. పరిగెత్తే సమయంలో కొందురు పిల్లలు ఏడిస్తే మరి కొందరు ట్రాక్ పైనే పడిపోయారు. అయినా వారి తల్లిదండ్రులు మాత్రం వారిని ఒంటి చేత్తే ఈడ్చుకుంటూ లైన్ క్రాస్ చేయడానికి ప్రయత్నాలు మాత్రం వదలుకోలేదు. చిన్నపిల్లలతో ఇలాంటి ఆటలేంటని విమర్శలు వస్తున్నా ఆర్గనైజర్లు మాత్రం పెద్దగా పట్టించుకోవడంలేదు. ఇలాంటి దృశ్యాలు ఇప్పటి వరకు తాము కండక్ట్ చేసిన వాటిలో చాలానే చూశామని చెబుతున్నారు. పిల్లలకు సహాయం చేయమని మాత్రమే తల్లిదండ్రులకు మేము చెప్పామని నిర్వాహకులు అంటున్నారు.