బెంగుళూరులో ఘోరం.. స్నేహితుడితో పార్క్‌కు వచ్చిన యువతిని ఊడ్చుకెళ్లి..

Bengaluru Woman Dragged From Park Molested In Moving Car - Sakshi

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. స్నేహితుడిని కలిసేందుకు పార్క్‌కు వెళ్లిన ఓ యువతిని నలుగురు వ్యక్తులు ఈడ్చుకెళ్లి కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మరుసటిరోజు ఉదయం ఆమెను తమ ఇంటి సమీపంలో విడిచిపెట్టి వెళ్లారు. మార్చి 25న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత ఆదివారం ఓ యువతి తన స్నేహితుడితో కలిసి బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలోగల నేషనల్ గేమ్స్‌ విలేజ్‌ పార్కులో  కూర్చొని మాట్లాడుతోంది. ఇంతలో ఓ వ్యక్తి వాళ్ల దగ్గరకు వచ్చి.. రాత్రి సమయంలో పార్కులో ఏం చేస్తున్నారంటూ బెదిరించాడు. దాంతో భయపడిన ఆమె స్నేహితుడు.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

అనంతరం ఆ బెదిరించిన వ్యక్తి తన ముగ్గురు స్నేహితులకు ఫోన్‌ చేసి అక్కడికి రప్పించాడు. నలుగురు కలిసి ఆమెను బలవంతంగా పార్కులోంచి ఈడ్చుకెళ్లి వాళ్ల కారులోకి తోశారు. అనంతరం ఆ వీధుల్లో తిరుగుతూ కదులుతున్న కారులోనే యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మార్చి 26న తెల్లవారుజామున బాధితురాలిని తన ఇంటి సమీపంలో వదిలేసి వెళ్లారు. అంతేగాక అఘాయిత్యం  గురించి ఎవరికైనా చెప్పినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా చంపేస్తామని బెదిరించారు.

అమిnrso బాధితురాలి ఆరోగ్యం బాలేక పోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తనకు జరిగిన ఘోరాన్నికుటుంబసభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు బెంగుళూరు పోలీస్‌ అధికారి సీకే బాబా వెల్లడించారు.

మరిన్ని వార్తలు :

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top