చలానా కట్టమన్నాడని.. ట్రాఫిక్‌ పోలీసును కారు బానట్‌పై 4కిలోమీటర్లు లాక్కెళ్లాడు

Traffic Cop Dragged On Top Of Car Bonnet For 4 KM In Indore - Sakshi

భోపాల్‌: డ్రైవింగ్‌ చేస్తూ ఫోన్‌ మాట్లాడటమే కాకుండా ప్రశ్నించిన ట్రాఫిక్‌ పోలీసు పట్ల దురుసుగా ప్రవర్తించాడు ఓ వ్యక్తి. చలాన్‌ కట్టమన్నందుకు కారు బానట్‌పై ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను 4 కిలోమీటర్లు లాక్కెళ్లాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నగరంలో జరిగింది. 

ఇండోర్‌ నగరంలోని సత్య సాయి జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ శివ సింగ్‌ చౌహాన్‌(50) విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే కారులో వచ్చిన ఓ వ్యక్తి మొబైల్‌ ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తూ కనిపించాడు. ఫోన్‌ మాట్లాడటం తప్పు అని చెప్పి జరిమానా కట్టాలని సూచించాడు కానిస్టేబుల్‌. దీంతో ఆగ్రహించిన కారు డ్రైవర్‌.. కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగాడు. జరిమానా తప్పించుకునేందుకు కానిస్టేబుల్‌ అడ్డుగా ఉన్నప్పటికీ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ పోలీసు కారు బానట్‌పైకి దూకాడు. అయినప్పటికీ.. కారును ఆపకుండా అలానే 4 కిలోమీటర్లు కారు నడిపాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్‌కు గాయాలైనట్లు ఉన్నతాధికారులు తెలిపారు. 

కారు డ్రైవర్‌ను అరెస్ట్‌ చేసి ఐపీసీ సెక్షన్‌ 279, 332 కింద కేసు నమోదు చేసినట్లు లసుదియా పోలీస్‌ స్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌ఎస్‌ దండోతియా తెలిపారు. నిందితుడి వద్ద నుంచి ఓ పిస్తోల్‌, ఓ రివాల్వర్‌ సైతం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ‍అయితే, అవి లైసెన్స్‌తో తీసుకున్నవని నిందితుడు తెలిపాడన్నారు.

ఇదీ చదవండి: మూన్‌లైటింగ్‌ కూలీ: రాత్రి పూట రైల్వే స్టేషన్‌లో.. మరి పగటి పూట!

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top