అంజలి సింగ్‌ కేసులో ట్విస్ట్.. ఐదుగురు కాదు మరో ఇద్దరు ఉన్నారటా!

Delhi Sultanpuri Car Horror Case Two More Were Involved Says Cops - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని నడిబొడ్డున దారుణ రీతిలో ప్రాణం పోగొట్టుకున్న అంజలి సింగ్‌(20) కేసు కీలక మలుపులు తిరుగుతోంది. పీకలదాక మద్యం సేవించి యువతి ప్రాణాలు కోల్పోయేందుకు కారణమైన ఐదుగురిని ఇప్పటికీ అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో మరో ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సీటీటీవీ దృశ్యాల ఆధారంగా ఈ కేసుకు సంబంధం ఉందని అనుమానిస్తున్న ఆశుతోశ్‌, అంకుశ్‌లను త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని ఢిల్లీ పోలీసులు గురువారం వెల్లడించారు. 

‘కస్టడీలో ఉన్న ఐదుగురు కాకుండా మరో ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. మా వద్ద సైంటిఫిక్‌ ఆధారాలు ఉన్నాయి. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు వారు ప్రయత్నాలు చేశారు.’అని వెల్లడించారు సీనియర్‌ పోలీసు అధికారి సాగర్‌ప్రీత్‌ హుడా. కారు నడిపినట్లు మొదటి నుంచి భావిస్తున్న దీపక్‌ ఖన్నా కాదని, అమిత్‌ ఖన్నాగా పేర్కొన్నారు. అమిత్‌కు డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదని గుర్తించినట్లు చెప్పారు.

ఇదీ చదవండి: అంజలి సింగ్‌ కేసులో ఊహించని ట్విస్ట్‌!.. నిధి అసలు ఫ్రెండే కాదట!
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top