breaking news
horror killing
-
Delhi: అంజలి సింగ్ కేసులో మరో ఇద్దరి ప్రమేయం!
న్యూఢిల్లీ: దేశ రాజధాని నడిబొడ్డున దారుణ రీతిలో ప్రాణం పోగొట్టుకున్న అంజలి సింగ్(20) కేసు కీలక మలుపులు తిరుగుతోంది. పీకలదాక మద్యం సేవించి యువతి ప్రాణాలు కోల్పోయేందుకు కారణమైన ఐదుగురిని ఇప్పటికీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో మరో ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సీటీటీవీ దృశ్యాల ఆధారంగా ఈ కేసుకు సంబంధం ఉందని అనుమానిస్తున్న ఆశుతోశ్, అంకుశ్‌లను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఢిల్లీ పోలీసులు గురువారం వెల్లడించారు. ‘కస్టడీలో ఉన్న ఐదుగురు కాకుండా మరో ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. మా వద్ద సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయి. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు వారు ప్రయత్నాలు చేశారు.’అని వెల్లడించారు సీనియర్ పోలీసు అధికారి సాగర్‌ప్రీత్ హుడా. కారు నడిపినట్లు మొదటి నుంచి భావిస్తున్న దీపక్ ఖన్నా కాదని, అమిత్ ఖన్నాగా పేర్కొన్నారు. అమిత్‌కు డ్రైవింగ్ లైసెన్స్ లేదని గుర్తించినట్లు చెప్పారు. #दिल्ली - कंझावला मामले में एक और नया सीसीटीवी आया सामने, जिसमें पांचो अरोपी कार से उतरते नज़र आए...#Delhiaccident #DelhiPolice #KanjhawalaDeathCase #Kanjhawala #Delhi #Delhiaccident #Nidhi #Kanjhawala #kanjhawalaaccident #Kanjhawala_girl_accident #KanjhawalaHorror pic.twitter.com/0qqrjlNw2N — TheuttarpradeshNews.com (@TheUPNews) January 5, 2023 ఇదీ చదవండి: అంజలి సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్!.. నిధి అసలు ఫ్రెండే కాదట! -
పాయింట్ బ్లాంక్‌లో ఏకే 47 పేలలేదెందుకో?
-
పాయింట్ బ్లాంక్‌లో ఏకే 47 పేలలేదెందుకో?
పారిస్: నవంబర్ 13న పారిస్ నగరమంతా ఒక్కసారిగా అట్టుడికింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వీధులు, రహదారులు, నివాసాలు, హోటళ్లు ఇలా ప్రతి ఒక్కటి క్షణాల్లో భయం గుప్పిట్లోకి జారుకున్నాయి. ఒక్కసారిగా ముష్కరుల తుపాకీ చప్పుళ్లు హోరెత్తించాయి. దఫాల వారిగా దాడులు చేస్తూ దాదాపు ఆ రోజంతా కాల్పులు జరిపి 129మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నారు ఇస్లామిక్ ఉగ్రవాదులు. అదే సమయంలో ఓ ఆసక్తి కరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ కేఫ్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయినదాని ప్రకారం ఓ మహిళ ఓ ఉగ్రవాది భారి నుంచి బయటపడింది. అదృష్టమంటే అదేనేమో.. తొలుత ఆ కేఫ్ పై ఎంతో వేగంగా కాల్పులు జరిపిన ఉగ్రవాది తాను రెండడుగులు వేస్తే దొరికిపోయేంత దూరంలో ఓ మహిళ ఉండటం గమనించి ఆమె దగ్గరికి వాయువేగంతో వెళ్లి అతడి చేతిలోని ఏకే 47 గన్ ను ఆ మహిళ తలకు గురిపెట్టాడు. కానీ ట్రిగ్గర్ నొక్కినా అది పేలలేదు. స్ట్రక్ అయిపోవడంతో అతడు రెండు మూడు సెకన్లు మాత్రమే మరోసారి నొక్కే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆమె బతుకు జీవుడా అంటూ ప్రాణాలు అరచేతబట్టుకొని అక్కడి నుంచి పారిపోయింది. ఆ కేఫ్ లో తలదాచుకున్న ఇద్దరు దంపతులు కూడా బతికిబట్టకట్టారు.