షాకింగ్‌ వీడియో.. రహదారిపై వాహనాలను ఢీకొడుతూ వ్యక్తిని లాక్కెళ్లిన కారు

Toyota Fortuner Rammed Vehicles And Also Dragged A Man In Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని కరోల్‌ బాఘ్‌ ప్రాంతంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన పార్కింగ్‌ చేసిన పదుల సంఖ్యలో వాహనాలు ఢీకొట్టటమే కాకుండా ఓ వ్యక్తిని లాక్కెళ్లింది. సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. 

సీసీటీవీ దృశ్యాల ప్రకారం.. కరోల్‌ బాఘ్‌ ప్రాంతంలో రహదారి పక్కన ఓ మహిళ స్కూటీ వద్ద నిలుచుని ఉంది. ఈ క్రమంలో ఓ ఫార్చునర్‌ ఎస్‌యూవీ కారు దాని ముందు నిలిపి ఉంచిన కార్లను ఢీకొడుతూ ముందుకు వెళ్లింది. అలాగే ఓ వ్యక్తిని సుమారు 100 మీటర్ల దూరం వరకు లాక్కెళ్లింది.ఈ సంఘటనతో అక్కడ ఉన్నవారు షాక్‌కు గురయ్యారు. ఎస్‌యూవీ కారు బీభత్సంలో పదుల సంఖ్యలో వాహనాలు, బైక్‌లు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం కారును పోలీసులు స్వాధీనం చేసుకోగా.. డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

(వీడియో సోర్స్‌: ఎన్‌డీటీవీ)

ఇదీ చదవండి: వీడు మనిషేనా.. మానవత్వం లేకుండా కుక్కను కారుకు కట్టి లాక్కెళ్లి..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top