కారును ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ట్రక్కు.. ఆరుగురు దుర్మరణం..

Uttar Pradesh Unnao Road Accident Several Dead - Sakshi

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ఉన్నావ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. లక్నో-కాన్పూర్ హైవేపై  ఓ కూడలి వద్ద కారును ట్రక్కు ఢీకొట్టింది. రోడ్డుపై ఉన్న మరో ముగ్గురిపైకి కూడా దూసుకెళ్లింది ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 

ట్రక్కును కారును ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లిందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత కారు ఓ గుంతలో పడిందని పేర్కొన్నారు. మృతుల్లో ముగ్గురు ఓకే కుటుంబానికి చెందిన వారని వివరించారు. మరో ఇద్దరు తల్లికూతుళ్లు ఉ‍న్నారని పేర్కొన్నారు. 

ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.  ఆరుగురు చనిపోవడంతో స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ట్రక్కు డ్రైవర్‌ను అరెస్టు చేయాలని వైరు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. రెండు గంటలపాటు రహదారిని దిగ్భందించారు. పోలీసులు వచ్చి హామీ ఇవ్వడంతో ఆందోళనలు విరమించారు. ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నాడని త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు.
చదవండి: చిరుత దాడి.. ఇంటికి వస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి చంపేసిన వైనం

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top