దారుణం: డాక్టర్‌ని ఢీకొట్టి.. కారుతో లాక్కెళ్లి.. | Doctor Dragged On Car Bonnet In Panchkula | Sakshi
Sakshi News home page

దారుణం: డాక్టర్‌ని ఢీకొట్టి.. కారుతో లాక్కెళ్లి..

Aug 28 2023 1:13 PM | Updated on Aug 28 2023 2:43 PM

Doctor Dragged On Car Bonnet In Panchkula - Sakshi

కారుతో దాడి చేసి 50 మీటర్ల వరకు అలాగే లాక్కెళ్లారు దుండగులు..

చంఢీగర్‌: హర్యానాలో అమానవీయ ఘటన జరిగింది. ఓ డాక్టర్‌ని కారుతో దాడి చేసి 50 మీటర్ల వరకు అలాగే లాక్కెళ్లారు దుండగులు. పంచకుల ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డా. గగన్‌ తన కుమారున్ని ట్యూషన్ నుంచి ఇంటికి తీసుకువెళ్తున్నాడు. ఈ క్రమంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్దకు చేరుకున్నాడు. అదే సమయంలో  పక్కనే ఉన్న కారు అతన్ని ఢీ కొట్టింది. గగన్‌ కారును ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కారు డోమ్‌పై అతన్ని అలాగే ఉంచి ముందుకు దూసుకెళ్లారు. దాదాపు 50 మీటర్ల వరకు కారుతోపాటు లాక్కెళ్లారు దుండగులు. 

తీవ్ర గాయాలపాలైన అతన్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఆధారాలతో దుండగుల కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.     

ఇదీ చదవండి: ప్రభుత్వ ఆఫీస్‌లో అధికారి మద్యం సేవిస్తూ.. వీడియో వైరల్‌..

Advertisement
 
Advertisement
Advertisement