Bhubaneswar: ప్రభుత్వ అధికారిపై దౌర్జన్యం.. నేటి నుంచి ఉద్యోగుల నిరవధిక సెలవు | Bhubaneswar Additional Commissioner Dragged out of his Office | Sakshi
Sakshi News home page

Bhubaneswar: ప్రభుత్వ అధికారిపై దౌర్జన్యం.. నేటి నుంచి ఉద్యోగుల నిరవధిక సెలవు

Jul 1 2025 9:58 AM | Updated on Jul 1 2025 10:31 AM

Bhubaneswar Additional Commissioner Dragged out of his Office

భువనేశ్వర్: ఒడిశాలోని ఒక ప్రభుత్వ అధికారికి ఘోర అవమానం ఎదురయ్యింది. దీనికి సంబంధించిన వీడియో  సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కార్యాలయంలో అదనపు కమిషనర్ రత్నాకర్ సాహూపై కొందరు దాడికి పాల్పడ్డారు.  దీనికి సంబంధించి, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలో  రత్నాకర్ సాహూను కార్యాలయం నుంచి బయటకు ఈడ్చుకెళ్లి, అతనిపై దాడి చేస్తూ, ముఖంపై తన్నడం కనిపిస్తోంది.
 

ఈ ఘటన గురించి రత్నాకర్ సాహూ మాట్లాడుతూ  తాను ఉదయం 11.30 గంటల  సమయంలో ఫిర్యాదులు స్వీకరించే పనిలో ఉండగా, బీఎంసీ కార్పొరేటర్ జీవన్ రౌత్‌తోపాటు వచ్చిన ఆరుగురు తన ఛాంబర్‌లోకి చొరబడ్డారని, తరువాత వారు దుర్భాషలాడుతూ,  తనను ఆఫీసు నుండి బయటకు లాక్కెళ్లి, వారి వాహనంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించారని సాహూ తెలిపారు.  పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. నిందితులు జీవన్ రౌత్, రష్మి మహాపాత్ర, దేబాషిష్ ప్రధాన్‌లను అరెస్ట్‌  చేశారు. ఈ ఘటన అనంతరం బిజు జనతాదళ్ (బీజేడీ)కార్పొరేటర్లు, బీఎంసీ సిబ్బంది  నిరసనకు దిగారు. జనపథ్ రోడ్డు దిగ్బంధనం చేశారు.

రత్నాకర్ సాహూపై దాడికి నిరసనగా ఒడిశా అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అసోసియేషన్ మంగళవారం (జూలై 1) నుండి సామూహిక నిరవధిక సెలవును ప్రకటించింది. అదనపు కమిషనర్ పై జరిగిన  దాడిపై బిజు జనతాదళ్ అధినేత, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దోషులపై వెంటనే  తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీని కోరారు. బీఎంసీ మేయర్ సులోచన దాస్ ఈ సంఘటనను ఖండిస్తూ నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: Madhya Pradesh: తనను దూరం పెట్టిందని.. నర్సింగ్‌ విద్యార్థినిపై యువకుని ఘాతుకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement