
‘ప్రతిభాపూర్వక సేవ’ కింద మరో 23 మందికి కూడా..
దేశవ్యాప్తంగా మొత్తం 1,090 మందికి శౌర్య/సేవా పతకాలు
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి/కర్నూలు/లక్ష్మీపురం(గుంటూరు ఈస్ట్) : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు పోలీసు అధికారులు చెన్నుపాటి భద్రయ్య (ఎస్పీ), గోపు రాజీవ్‌కుమార్ (డీఎస్పీ) రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీసు పతకానికి ఎంపికయ్యారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పోలీసు, అగి్నమాపక, హోంగార్డు, సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్విసెస్‌కు చెందిన మొత్తం 1,090 మంది అధికారులకు శౌర్య/సేవా పోలీస్ పతకాలను ప్రకటించింది. ఇందులో మొత్తం 25 మంది ఏపీ అధికారులు ఈ పతకాలకు ఎంపికయ్యారు.
కేంద్ర హోంశాఖ గురువారం ఈ జాబితా విడుదల చేసింది. ఇందులో భాగంగా.. దేశవ్యాప్తంగా 233 మందికి శౌర్య పతకాలు (జీఎం), 99 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు (పీఎస్‌ఎం), 758 మందికి ప్రతిభాపూర్వక సేవా పతకాలు (ఎంఎస్‌ఎం) ప్రకటించింది. వీరిలో ఏపీకి చెందిన ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం, 20 మంది పోలీసులకు కరెక్షనల్ సర్విసెస్ కింద, ముగ్గురు అధికారులకు ప్రతిభాపూర్వక సేవా పతకాలు లభించాయి.
ప్రాణాలు, ఆస్తులను కాపాడటంలో, నేరాలను నిరోధించడంలో లేదా నేరస్తులను అరెస్టుచేయడానికి విధి నిర్వహణలో ప్రదర్శించిన శౌర్యం, తెగువ ఆధారంగా రాష్ట్రపతి శౌర్య పతకం (పీఎంజీ), శౌర్య పతకం (జీఎం) కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. అలాగే, విధి నిర్వహణలో అందించిన విశిష్ట సేవకు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం (పీఎస్‌ఎం), విలువైన సేవకు ప్రతిభాపూర్వక సేవా పతకం (ఎంఎస్‌ఎం) ఇస్తున్నారు.
ప్రతిభాపూర్వక సేవా పతకాలు
రవికృష్ణ ఆకే (ఐజీ), శ్రీనివాసరావు వల్లూరి (డీఎస్పీ), వీరవెంకట ప్రతాప్‌కుమార్ తోట (డీఎస్పీ), కోదండ శ్రీరామచంద్రరాజు దెందుకూరి (అసిస్టెంట్ కమాండెంట్), గోవిందరావు మామిడి (ఇన్‌స్పెక్టర్), రామకృష్ణ గండెం (ఇన్‌స్పెక్టర్), శ్రీనివాసరావు బొడ్డు (హెడ్ కానిస్టేబుల్), సీతారాము కరిమకొండ (ఎస్‌ఐ), చంద్రశేఖర్ పెదిరెడ్డి (ఏఎస్‌ఐ), నాగమల్లేశ్వరరావు విశ్సరాపు (ఏఎస్‌ఐ), వెంకటరామశర్మ బుర్రా (ఏఎస్‌ఐ), ఉస్మాన్ గనిఖాన్ నయేబ్ (ఏఎస్‌ఐ), గోపాల్ కరువా (ఎస్‌ఐ), కోటేష్ కోట్టకోట (ఎస్‌ఐ), నాగేశ్వరరావు దొమ్మేటి (ఏఎస్‌ఐ), సీతారామాంజనేయులు పామర్తి (ఏఎస్‌ఐ), నాగబాబు కొప్పిశెట్టి (ఏఎస్‌ఐ), గోపాలకృష్ణ గుబ్బల (హెడ్ కానిస్టేబుల్), సురేష్ కుమార్ మురుగేశన్ (హెడ్ కానిస్టేబుల్), దానం గడ్డ (హెడ్ కానిస్టేబుల్), డా. వరప్రసాద్ మామిళ్లపల్లి (డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్), రవికుమార్ కరణం (చీఫ్ హెడ్‌వార్డర్), వీరవెంకట సత్యనారాయణరావు తలపర్తి (హెడ్ వార్డర్)
జమ్మూకశ్మీర్‌లో ఏపీ ఐపీఎస్‌కు కూడా..
ఇక జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న కర్నూలుకు చెందిన ఐపీఎస్ అధికారి జీవీ సందీప్ చక్రవర్తి కూడా రాష్ట్రపతి పోలీస్ మెడల్‌కు ఎంపికయ్యారు. చక్రవర్తి అక్కడ అనేక ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో చురుకైన పాత్ర పోషించారు. ఆయన ధైర్యసాహసాలకు గుర్తింపుగా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే, గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని ఆరీ్పఎఫ్ డీఎస్పీ గొల్లమూడి మధుసూదనరావు, రేణిగుంట అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ కుక్కల రాజగోపాల్‌రెడ్డి కూడా రాష్ట్రపతి పోలీసు మెడల్స్‌కు ఎంపికయ్యారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ, డీఆర్‌ఎం సుధేష్ట సేన్ వీరికి అభినందనలు తెలిపారు.