
ఢిల్లీ: ఎన్టీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగి సీపీ రాధాకృష్ణన్‌ను ఎంపిక చేశారు. ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్.. స్వస్థలం తమిళనాడు. సీపీ రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేస్తూ బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ అనంతరం సీపీ రాధాకృష్ణన్ ఎంపికపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మీడియాకు స్పష్టం చేశారు.
ఎన్డీఏ పక్షాలు ఉపరాష్ట్రపతి అభ్యర్థి బాధ్యతలను ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డాలకు అప్పగించారు. ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ సభ్యులు భారత ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో సమతుల్యత పాటించింది కేంద్రం. రాష్ట్రపతి ముర్ము ఉత్తరాది వాసి కాగా, ప్రస్తుతం ఎంపిక చేసిన ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ దక్షిణాది వాసి. ఇదిలా ఉంచితే, ఆగస్టు 21తో నామినేషన్ల గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఎన్డీఏ తమ అభ్యర్థిని ముందుగా ప్రకటించింది. ఇక సెప్టెంబర్ 9వ తేదీ ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది.
కాగా, సీపీ రాధాకృష్ణన్.. బీజేపీ నాయకుడు. ఆయన రెండుసార్లు కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచారు. తమిళనాడు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా సేవలందించారాయన. 2023 ఫిబ్రవరి 12న జార్ఖండ్ గవర్నర్‌గా బాద్యతలు నిర్వర్తించారు.
తెలంగాణ గవర్నర్‌గా పనిచేసిన తమిళిసై సౌందరరాజన్.. 2024 మార్చి 18న రాజీనామా చేయడంతో తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ అదనపు బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్‌కు తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలును అప్పగించారు. 2024 జులై 31 వరకు తెలంగాణ గవర్నరుగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. 2024 ఆగస్టు 06 వరకు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేశారు. ఆపై మహారాష్ట్ర గవర్నర్‌గా ఎంపికయ్యారు.