breaking news
additional commissioner
-
Bhubaneswar: ప్రభుత్వ అధికారిపై దౌర్జన్యం.. నేటి నుంచి ఉద్యోగుల నిరవధిక సెలవు
భువనేశ్వర్: ఒడిశాలోని ఒక ప్రభుత్వ అధికారికి ఘోర అవమానం ఎదురయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కార్యాలయంలో అదనపు కమిషనర్ రత్నాకర్ సాహూపై కొందరు దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో రత్నాకర్ సాహూను కార్యాలయం నుంచి బయటకు ఈడ్చుకెళ్లి, అతనిపై దాడి చేస్తూ, ముఖంపై తన్నడం కనిపిస్తోంది. I am utterly shocked seeing this video. Today, Shri Ratnakar Sahoo, OAS Additional Commissioner, BMC, a senior officer of the rank of Additional Secretary was dragged from his office and brutally kicked and assaulted in front of a BJP Corporator, allegedly linked to a defeated… pic.twitter.com/yf7M3dLt9C— Naveen Patnaik (@Naveen_Odisha) June 30, 2025ఈ ఘటన గురించి రత్నాకర్ సాహూ మాట్లాడుతూ తాను ఉదయం 11.30 గంటల సమయంలో ఫిర్యాదులు స్వీకరించే పనిలో ఉండగా, బీఎంసీ కార్పొరేటర్ జీవన్ రౌత్‌తోపాటు వచ్చిన ఆరుగురు తన ఛాంబర్లోకి చొరబడ్డారని, తరువాత వారు దుర్భాషలాడుతూ, తనను ఆఫీసు నుండి బయటకు లాక్కెళ్లి, వారి వాహనంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించారని సాహూ తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. నిందితులు జీవన్ రౌత్, రష్మి మహాపాత్ర, దేబాషిష్ ప్రధాన్‌లను అరెస్ట్ చేశారు. ఈ ఘటన అనంతరం బిజు జనతాదళ్ (బీజేడీ)కార్పొరేటర్లు, బీఎంసీ సిబ్బంది నిరసనకు దిగారు. జనపథ్ రోడ్డు దిగ్బంధనం చేశారు.రత్నాకర్ సాహూపై దాడికి నిరసనగా ఒడిశా అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అసోసియేషన్ మంగళవారం (జూలై 1) నుండి సామూహిక నిరవధిక సెలవును ప్రకటించింది. అదనపు కమిషనర్ పై జరిగిన దాడిపై బిజు జనతాదళ్ అధినేత, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దోషులపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీని కోరారు. బీఎంసీ మేయర్ సులోచన దాస్ ఈ సంఘటనను ఖండిస్తూ నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.ఇది కూడా చదవండి: Madhya Pradesh: తనను దూరం పెట్టిందని.. నర్సింగ్ విద్యార్థినిపై యువకుని ఘాతుకం -
జీఎస్టీ అడిషనల్ కమిషనర్ బొల్లినేని గాంధీపై సస్పెన్షన్ వేటు
న్యూఢిల్లీ: జీఎస్టీ అడిషనల్ కమిషనర్ బొల్లినేని శ్రీనివాస గాంధీపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీఎస్టీ కేసులను మ్యానేజ్ చేస్తానని గాంధీ డబ్బు వసూళ్లకు పాల్పడినట్టు సీబీడీటీ గుర్తించింది. దీంతో ఆయనను 180 రోజులపాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. గతంలోనూ ఇదే ఆరోపణలపై గాంధీ సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆయనపై గతంలో ఈడీ, సీబీఐ కేసులు ఉన్నాయి. -
రాక– పోక
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ సెంట్రల్ జోన్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న భారతి హొళ్లికేరి మంచిర్యాల కలెక్టర్‌గా బదిలీ కాగా, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా ఆమ్రపాలి రానున్నారు. ఈమేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా జీహెచ్ఎంసీ నుంచి ఒక మహిళా ఐఏఎస్ అధికారి బదిలీ కాగా..మరో మహిళా ఐఏఎస్ రానున్నారు. -
ఇష్టానుసారం వస్తే సహించేది లేదు
అనంతపురం: కార్యాలయానికి పనివేళలు లేవా? ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టానుసారంగా వచ్చిపోవడానికి ఇదేమైనా మీ ఇల్లు అనుకుంటున్నారా..? అంటూ అనంతపురం పరిపాలనా విభాగం సిబ్బందిపై అదనపు కమిషనర్ పగడాల కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పలువురు సిబ్బంది కార్యాలయానికి వచ్చి హాజరు పట్టీలో సంతకం చేసి సొంత పనులపై వెళ్లారు. మరికొందరు సంతకం చేయకుండా వెళ్లారు. విషయం తెలుసుకున్న అదనపు కమిషనర్ పరిపాలనా విభాగాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన వచ్చిన సమయంలో చాలామంది అధికారులు సీట్లలో లేరు. దాదాపుగా విభాగం అంతా ఖాళీగా ఉంది. దీంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. హాజరు పట్టీని పరిశీలించిన ఆయన.. అందరూ ఎక్కడికి వెళ్లారని అడిగారు. పెళ్లికి వెళ్లారని అక్కడున్న సిబ్బంది చెప్పడంతో.. పెళ్లికి వెళ్లాలనుకునేవారు సెలవు పెట్టి వెళ్లాలి. కానీ హాజరు పట్టీలో సంతకం చేసి వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. వేళకు రాని వారందరికీ క్యాజువల్ లీవ్ మార్క్ చేయాలని మేనేజర్‌కి సూచించారు. కొందరి సంతకాలకు ఎదురుగా చుక్కలు పెట్టి ఉండడాన్ని గుర్తించిన ఆయన ఎందుకు ఇలా చుక్కలు ఉంచారని ప్రశ్నించారు. ఒక ఉద్యోగికి సంబంధించి నాలుగు రోజులుగా హాజరు పట్టీలో సంతకం ఉండాల్సిన స్థానంలో చుక్కలు ఉన్నాయి. నాలుగు రోజులుగా ఆ ఉద్యోగి ఎందుకు సంతకం చేయలేదని, కనీసం మీరు అదైనా గమనించారా అంటూ అధికారులను ప్రశ్నించారు. ఇలా చుక్కలు ఉంచేది ఒక రోజున వచ్చి సంతకాలు చేయడానికే అంటూ మండిపడ్డారు. తక్షణం సెలవు మార్క్ చేయండని ఆదేశించారు. అనంతరం అన్ని సీట్లను, విభాగాలను పరిశీలించారు. పనివేళల్లో తప్పనిసరిగా సీట్లలో ఉండాలని, ఇష్టానుసారం వచ్చిపోతే చర్యలు తీసుకుంటామని సిబ్బందిని హెచ్చరించారు.