
సాక్షి,న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికపై బీజేపీ దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఢిల్లీలో ఉప రాష్ట్రపతి ఎంపికపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. ఈ భేటీలో ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనేది ఖరారు కానుంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక బాధ్యతను ఎన్డీయే పక్షాలు ప్రధాని మోదీ,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగించాయి.