యువతిని ఈడ్చుకెళ్లిన ఘటనలో మరో ట్విస్ట్‌.. గొడవ పడ్డ అంజలి, నిధి

Sultanpuri Case Anjali Sing And Her Friend Nidhi Fought Over Money - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలో అంజలీ సింగ్‌ అనే యువతిని కారు ఢీకొట్టి, 12 కిలోమీటర్లు లాక్కెళ్లిన ఘటనలో మరికొన్ని విషయాలు వెలుగుచూశాయి. డిసెంబర్‌ 31వ తేదీ రాత్రి అంజలి స్కూటీపై ఆమె స్నేహితురాలు నిధి కూడా ఉన్నట్లు తేలింది. అయితే, అంతకుముందు వారిద్దరూ డబ్బు విషయమై ఘర్షణకు కూడా దిగినట్లు అంజలి స్నేహితుడొకరు వెల్లడించాడు.

ఈ కేసులో నిందితులను కాపాడేందుకు యత్నిస్తున్నట్లు అనుమానాలున్న అశుతోష్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరో అనుమానితుడు అంకుశ్‌ ఖన్నా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇలా ఉండగా, మృతురాలు అంజలీ సింగ్‌ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందజేయనున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ చెప్పారు.

ఇదీ చదవండి: అంజలి ఘటనతో అట్టుడుకుతున్న ఢిల్లీ.. మహిళా కమిషన్‌ చైర్మన్‌ కీలక వ్యాఖ్యలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top