
ఢిల్లీ: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామన్న తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ప్రశ్నించారు. బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందనడానికి ఇదొక ఉదాహరణ అని పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరించిందని విమర్శించారు ఎంపీ లక్ష్మణ్. ఇంకా ఆయనేమన్నారంటే..
‘పీవీ నరసింహారావు , టి అంజయ్యను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అవమానించింది. ఈ అవమానాన్ని తట్టుకోలేక తెలుగు ఆత్మగౌరవం బయటికి వచ్చింది. నాడు వెంకయ్య నాయుడుని ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఎందుకు సమర్థించలేదు? అని ప్రశ్నించారు. ‘ బ్లాక్ మార్కెట్ వల్ల యూరియా కొరత ఏర్పడింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కారణం. మార్వాడి గో బ్యాక్ నినాదం మంచిది కాదు. ఎవరు ఎక్కడైనా పని చేసుకునే అవకాశం ఉంది. ఏవైనా సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కరించుకోవాలి .. పెద్దవి చేయకూడదు’ అని ఆయన స్పష్టం చేశారు.