
పాట్నా: తమ్ముడూ ఆ ద్రోహులతో జాగ్రత్త అంటూ రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ తన తమ్ముడు తేజశ్వి యాదవ్‌కు సలహా ఇచ్చారు. ఆ ద్రోహులకు హెచ్చరికలు జారీ చేశారు.
తేజ్ ప్రతాప్ ఇటీవల ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు ప్రత్యక్షమైంది.ఆయన ఒక మహిళతో ఉన్న ఫొటో దానిలో ఉంది. ఆమె పేరు అనుష్క యాదవ్ అని, గత 12 ఏళ్లుగా తాము రిలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు.ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో తేజ్ ప్రతాప్ తన కుటుంబ గౌరవాన్ని మంట గలుపుతున్నారని లాలూ ప్రసాద్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించారు.
ఈ క్రమంలో తండ్రి తీసుకున్న నిర్ణయంపై తేజ ప్రతాప్ స్పందిస్తూ.. తనపై రాజకీయంగా, వ్యక్తిగతంగా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సమాజంలో పేరు ప్రతిష్టలున్న ఐదు కుటుంబాలు ఈ కుట్రకు పాల్పడుతున్నాయి.త్వరలో వారి వివరాలను బహిర్గతం చేస్తాను’ అని తేజ్ ప్రతాప్ ప్రకటించారు.
ఓ ఐదు కుటుంబాలు గత పదేళ్లుగా నా రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని పెద్ద ఎత్తున కుట్ర చేశాయి. నేను ఏ తప్పూ చేయలేదు. ఎవరిమీద ఎలాంటి కుట్రలకు పాల్పడలేదు. కానీ, ఈ ఐదు కుటుంబాలు వ్యక్తిగత, రాజకీయ జీవితాన్ని నాశనం చేశాయని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం టీమ్ తేజ్‌ప్రతాప్‌యాదవ్ పేరుతో తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.అదే సమయంలో తనపై రాజకీయ కుట్ర చేస్తున్న వారిని జైచంద్(ద్రోహులు)గా పేర్కొంటూ వారిని టార్గెట్ చేస్తున్నారు.అదే సమయంలో తన తమ్ముడు తేజశ్వి యాదవ్‌కి కూడా ఆ కుట్రదారుల నుంచి దూరంగా ఉండాలని హెచ్చరించారు.
కాగా, తేజ ప్రతాప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీహార్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.ఆ ఐదు కుటుంబాలు ఎవవో, ఆయన ఎలాంటి ఆధారాలు చూపించబోతున్నారో అన్నది ఆసక్తిగా మారింది.
मेरे राजनैतिक जीवन को पांच परिवार के लोगों ने मिलकर और बृहद रूप से षडयंत्र कर समाप्त करने की कोशिश किया।
मैने अपने दस वर्षों से अधिक राजनीतिक जीवन में किसी के प्रति कभी गलत नहीं किया, कभी भी किसी के प्रति कोई षडयंत्र नहीं किया।
लेकिन इन पांच परिवार के लोगों के द्वारा मेरे… pic.twitter.com/9mb3HUnGXb— Tej Pratap Yadav (@TejYadav14) August 21, 2025