నీ భాషలో మాట్లాడ.. ఏం చేసుకుంటావో చేస్కో పో! | Transfer Manager After Kannada Language Row In Bangalore SBI Bank | Sakshi
Sakshi News home page

SBI: నీ భాషలో మాట్లాడ.. ఏం చేసుకుంటావో చేస్కో పో!

May 21 2025 4:56 PM | Updated on May 21 2025 5:23 PM

Transfer Manager After Kannada Language Row In Bangalore SBI Bank

సాక్షి,బెంగళూరు: ప్రభుత్వ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐలో (sbi) ప్రాంతీయ  (language row) భాష చిచ్చు పెట్టింది. ఎస్‌బీఐ మేనేజర్‌ తమ మాతృ భాషలో మాట్లాడడం లేదంటూ స్థానికులు ఆందోళన బాటపట్టారు. ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయంలో ప్లకార్డ్‌లతో నిరసన చేపట్టారు. ఈ అంశంలో రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా ఇతర నేతలు సైత్యం జోక్యం చేసుకోవడం చిలికి చిలికి గాలివానలా మారింది. చివరకు సదరు మేనేజర్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేస్తూ ఎస్‌బీఐ చర్యలకు ఉపక్రమించింది.

ఇంతకీ ఏం జరిగిందంటే? 
కర్ణాటక రాజధాని బెంగళూరు సూర్యా నగర్‌ ఎస్‌బీఐ (SBI Surya Nagar branch Bangalore) బ్రాంచ్‌లో కస్టమర్‌కు, మహిళా బ్యాంక్‌ మేనేజర్‌ మధ్య వివాదం జరిగింది.అందుకు సంబంధించిన వీడియోలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఆ వీడియోల్లో బ్యాంక్‌ మేనేజర్‌ను పదేపదే కన్నడలో (kannada language row) మాట్లాడమని కస్టమర్‌ సూచించడం, అందుకు బ్యాంక్‌ మేనేజర్‌ తాను కన్నడలో మాట్లాడనని, ఏం చేసుకుంటారో ఏం చేసుకోండి’ అంటూ కస్టమర్‌, బ్రాంచ్‌ మేనేజర్‌ మధ్య సంభాషణ జరిగింది. 

 అలా అని రాసుందా?
ఒకానొక సమయంలో ‘మేమేం చేయాలో మీరు చెప్పడం కాదని బ్యాంక్‌ మేనేజర్‌..కస్టమర్‌తో అనడం. భాష విషయంలో మళ్లీ జోక్యం చేసుకున్న కస్టమర్‌ మీరు హిందీలో కాకుండా కన్నడలో మాట్లాడమని బ్యాంక్‌ మేనేజర్‌కు సూచించడం.. అందుకు మేనేజర్‌ బదులిస్తూ..అలా అని ఎక్కడైనా రాసుందా? అని ప్రశ్నించడంతో మరింత వివాదం రాజుకుంది.

ఇది కర్ణాటక.. కాదు ఇండియా
కస్టమర్‌ బ్యాంక్‌ మేనేజర్‌ తీరును ప్రశ్నిస్తూ.. ఇది ఆర్‌బీఐ నిర్ణయం. మీరు ముందు అది తెలుసుకోండి. ఇది కర్ణాటక ఇక్కడ కన్నడే మాట్లాడాలి అని అనడంతో.. ఇది ఇండియా అని బ్యాంక్‌ మేనేజర్‌ జవాబు ఇవ్వడం వీడియోల్లో కనిపిస్తోంది.

ఎస్‌బీఐ సూర్యానగర్‌ బ్రాంచ్‌లో జరిగిన వివాదంపై ఎస్‌బీఐ స్పందించింది. బెంగళూరులోని సూర్యనగర్ బ్రాంచ్‌లో జరిగిన ఘటనపై మేం తీవ్రంగా విచారిస్తున్నాము. ఈ వ్యవహారాన్ని సమీక్షిస్తున్నాం. ఎస్‌బీఐ తన కస్టమర్ల భావోద్వేగాలను దెబ్బతీసే ప్రవర్తనకు సంబంధించి జీరో టాలరెన్స్ పాలసీని పాటిస్తుందని స్పష్టం చేసింది. అలాగే, ఎస్‌బీఐ మేనేజర్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేసినట్లు సమాచారం.  

మరింత వివాదం 
ఎస్‌బీఐ బ్యాంక్‌లో బ్యాంక్‌ మేనేజర్‌,క స్టమర్‌ మధ్య చోటు చేసుకున్న వివాదం రాష్ట్రంలో పలు చోట్ల కన్నడ మద్దతు దారులు ఆందోళన చేపట్టారు. ప్రో-కన్నడ సంస్థ కర్ణాటక రక్షణ వేదిక (కేఆర్‌వీ) రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ప్రకటించింది. ఎస్‌బీఐ సూర్యాపురం బ్రాంచ్‌ సిబ్బంది కన్నడ కస్టమర్లను అవమానిస్తోందని, స్థానిక భాషలో ప్రాథమిక సేవల్ని అందించడంలో విఫలమవుతున్నారని కేఆర్‌వీ ప్రతినిధులు ఆరోపించారు.

మరోవైపు, ఎస్‌బీఐ బ్యాంక్‌లో జరిగిన వివాదంపై సీఎం సిద్ధరామయ్య ఎక్స్‌ వేదికగా సంప్రదించారు. బ్రాంచ్‌ మేనేజర్‌ ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు. బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement