భార్య తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన భర్త.. కారణం ఏంటంటే? | horrible incident in Bengaluru | Sakshi
Sakshi News home page

భార్య తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన భర్త.. కారణం ఏంటంటే?

Jun 7 2025 9:33 PM | Updated on Jun 7 2025 9:37 PM

horrible incident in Bengaluru

బెంగళూరు,సాక్షి: బెంగళూరు సమీపంలో ఒళ్లు గ‌గూర్పొడిచే సంఘ‌ట‌న చోటు చేసుకుంది. అనేకల్‌ ప్రాంతంలోని హీలాలిగె గ్రామంలో నివసిస్తున్న ఓ యువకుడు తన భార్యను నరికి, ఆమె తలతో పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయిన ఘటన కలకలం రేపింది.

28 ఏళ్ల శంకర్ అనే వ్యక్తి తన 26 ఏళ్ల భార్య మానసను తల నరికి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. శంకర్, మానస దంపతులు కొంతకాలంగా హీలాలిగె గ్రామంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. జూన్ 3 రాత్రి శంకర్ తన పని ముగించుకొని ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. ఆ  స‌మ‌యంలో మాన‌స మ‌రో వ్య‌క్తితో స‌న్నిహితంగా ఉండ‌డం చూసి శంక‌ర్ తీవ్రంగా కోపోద్రిక్తుడయ్యాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి, మానస పుట్టింటికి వెళ్లింది.

అయితే, ఆ తర్వాత కొన్ని రోజులు మానస తిరిగి ఇంటికి వచ్చి శంకర్‌ను వేధించినట్లు సమాచారం. హత్యకు ముందు రోజు కూడా ఆమె ఇంటికి వచ్చి గొడవ పడ్డట్లు స్థానికులు చెబుతున్నారు. 

ఈ నేపథ్యంలో, జూన్ 6 రాత్రి శంకర్ తాను మానసను హత్య చేసి, ఆమె తల నరికి, నేరుగా సూర్యనగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడే తాను హత్య చేసినట్టు పోలీసులకు చెప్పిన శంకర్, తలను కూడా పోలీసులకు చూపించాడు. 

సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (బెంగళూరు రూరల్) సీకే బాబా మాట్లాడుతూ...రాత్రి దంపతుల మధ్య వాగ్వాదం జ‌రిగింది. ఆ వాగ్వాదంలో భార్య‌ను త‌ల‌ను నరికి స్టేష‌న్‌కు తీసుకువ‌చ్చాడు. మానసకు మరో వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానంతో గత వారం రోజులుగా ఈ దంపతులు తరచూ గొడవపడుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, శంకర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement